అలర్జీలకు అడ్డుకట్ట || Preventing Allergy Attacks || Vardhan Ayurveda




వ్యాధి నిరోధక శక్తి తగ్గే  కొద్దీ అలర్జీలు  పెరిగి పెరిగి ఏదో ఒక దశలో క్యాన్సర్లు  తలెత్తే ప్రమాదమూ ఉంది. అందుకే అలర్జీలను తాత్కాలిక ఉపశమనంతో సరిపెట్టకుండా ఆయుర్వేద వైద్యంతో శాశ్వత విముక్తి పొందడం అవసరం అంటున్నారు, డాక్టర్ వర్ధన్, డాక్టర్ మాధురీ వర్ధన్ మరిన్ని వివరాలు వారి మాటల్లో.......

ఎప్పుడూ ఉండే తుమ్ములు ఆయాసమే కదా! ఆ మాత్రం దానికి అలర్జీలను పట్టించుకోవడం ఎందుకు అంటారు కొందరు. అలర్జీలు గురించి లోతుగా ఏమీ తెలియక పోతే ,ఎవరైనా అలాగే అనుకుంటారు. మరి ! కానీ, ఒక్కోసారి అలర్జీలు ప్రాణాంతకంగా మారుతాయి.అందుకే అలర్జీలు అంటే ఏమిటో ,ప్రతి ఒక్కరికీ కొంతయినా తెలియాలి .

మౌలికంగా వ్యాధి నిరోధక వ్యవస్థ అతిగా స్పందించడాన్ని అలర్జీ అంటారు. దుమ్ము ,ధూళి,పూల పుప్పొడి ,జంతువుల ఉన్ని ఇలా ఏదైనా ముక్కులో కి వెళ్ళినప్పుడు ఒకటి రెండు సార్లు తుమ్ములు రావడం మామూలే .అలా కాకుండా ఏకంగా 50 తుమ్ములు దాకా వస్తే అది అతిగా స్పందించడమే,దీనికి ఓజస్సు లోపాలు  అంటే వ్యాధి నిరోధక శక్తి లోపాలే కారణం. ఈ స్థితిలో ప్రతి చిన్న అవరోదానికి  ఓజస్సు ఏదో పెద్ద విపత్తు వచ్చినట్లు తనకు తానే తిరిగి అతిగా స్పందించడం మొదలవుతుంది . అలా స్పందించడాన్నే  ఎలర్జీ  అంటారు.  అలర్జీతో కొందరు ఏదో కాస్త అసౌకర్యంగా మాత్రమే అనిపించవచ్చు. ఒక్కోసారి అత్యంత తీవ్రమైన ప్రాణాంతక లక్షణాలూ కనిపించవచ్చు అయితే ,తుమ్ములు, దగ్గు తో మొదలైన అలర్జీ సమస్యలు కాలం గడుస్తూ పోతే, ఆస్తమాగా పరిణమించి ఊపిరాడకుండా చేస్తాయి. అలర్జీలు శరీరంలోని అన్ని వ్యవస్థలను దెబ్బతీస్తాయి .ఏదో అసౌకర్యంగా ఉన్నట్టే ఉండి, ఒక్కోసారి ప్రాణాపాయానికి దారి తీయవచ్చు.


 అలర్జీ  ముక్కులో మొదలైతే ,తుమ్ము లో ,దురదొ, ముక్కు కారడమో,  ముక్కు దెబ్బతీయడమో,పిల్లి కుతలో ఉండవచ్చు .  ఏదో మొక్కు కారణమే కదా అనుకుంటే, ఆ తర్వాత అదే మెడ, తలకు సంబంధించిన పలు సమస్యలకు దారి తీయవచ్చు.కళ్ళల్లో అయితే,నీరు కారడం ,కళ్ళు దురద పెట్టడం కావచ్చు .చర్మంలో అయితే, దురద, వాపు ,దద్దుర్లు  రావచ్చు. మెడ పై భాగాన ఉండే అవయవాన్నయినా, వ్యాధిగ్రస్తం చేయవచ్చు. మౌలికంగా క్యాన్సర్ కూడా అలర్జీ కారకమే . అందుకే ఒక్కోసారి అలర్జీ బాధితులు క్యాన్సర్ బారిన పడుతుంటారు.

గొంతు ,శ్వాసకోశాల్లో అలర్జీ తలెత్తే ,కపం పేరుకుపోవచ్చు. శ్వాస తీసుకోవడం కష్టం కావచ్చు .అలాగే పిల్లికూతలు ,దగ్గు, చాతి పట్టేసినట్లు ఉండటం,ఆయాసం  వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆయాసమే కదా అని నిర్లక్ష్యం చేస్తే అంతిమంగా ఇది ఆస్తమాగా మారవచ్చు .శ్వాసలో అంతరాయం ఏర్పడితే సిఓపిడి( క్రానిక్ అబ్సెస్సివ్ పల్మనరీ డిసీజ్ ) గా పరిగణించవచ్చు.

కళ్ళు అలర్జీకి గురైతే, కళ్ళు దురదగా ఉండటం తో పాటు  కళ్లు ఎరుపెక్కడం ,నీళ్లు కారడం ,కళ్ల చుట్టూ వాపు రావడం వంటి లక్షణాలు రావచ్చు. ఈ స్థితిని నిర్లక్ష్యం చేస్తే ,ఒక్కోసారి ఏకంగా దృష్టికోల్పోయే  పరిస్థితే రావచ్చు.

సాధారణ జబ్బులు గానే రావచ్చు. కానీ, అది ఏ విషమపరిస్థితికో తీసుకువెళ్లి వదిలేస్తుంది. సాధారణ తుమ్ములు ,ఆయాసమే కావచ్చు కానీ ,చివరికి అది ఆస్తమా లోకి తీసుకు వెళ్లి వదిలేస్తుంది .ఏదో కాస్త చాతి పట్టేయడమే  అనిపించవచ్చు కానీ ,అంతిమంగా అది సిఓపిడి గా పరిణమించవచ్చు.

చర్మం పొడిబారడం, దురద వేయడం, ఎర్రబారడమే  కావచ్చు, దద్దుర్లు రావచ్చు. చివరికి అది ఎగ్జిమాగా నో, సోరియాసిస్ గాను పరిణమించవచ్చు.

ఫుడ్ ఎలర్జీ వస్తే ముందు నోటిలో దురదలా  మొదలవుతుంది. ఆ తర్వాత ఏదైనా  మింగడం లోనూ, శ్వాస తీసుకోవడంలో నూ  ఇబ్బందులు ఏర్పడతాయి. అలర్జీ కడుపు లోకి వెళితే ,కడుపు ఉబ్బరం ,కడుపు నొప్పి, వికారం ,వాంతులు, విరేచనాలు, కావచ్చు. అప్పటికి నిర్లక్ష్యం చేస్తే ,నిరంతరం మలబద్ధకం, విరోచనాలు, కలగలసి వేధించే ఐబీఎస్ (ఇరిటెబుల్  ల్ బవెల్ సిండ్రోమ్ ) గానూ  మారవచ్చు.పేగుల్లో  అల్సర్లు  వచ్చే అల్సరేటివ్ కొలైటి స్  గాను మారవచ్చు.


వ్యాధి నిరోధక శక్తి సవ్యంగా ఉంటే అది మన శరీరాన్ని పరిరక్షిస్తుంది. కానీ, శరీరంలో వ్యర్థ- విషపదార్థాలు పెరిగిపోయినప్పుడు ఈ వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది . శరీరంలోకి వచ్చిండే విష - వ్యర్థ పదార్థాలు ఎక్కువై , ఓజస్సు బలహీనపడి పోతే, ఓజస్సు సంబంధించిన నాలుగు రకాల సమస్యలు తలెత్తుతాయి . వాటిలో మొదటిది  అలర్జీ,ఆస్తమా.

 రెండవది అవయవ మార్పిడి చేయించుకుంటే అవి ఫెయిలవుతాయి. మూడవది ఇమ్యూన్  డెఫిషియెన్సీ  డిజాస్టర్ .అంటే హెచ్.ఐ.వి టీబీ వంటి వ్యాధులు తీవ్రమవుతాయి. నాలుగవది ది ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్లు వాటిలో ముఖ్యంగా రుమాటాయిడ్ ఆర్టిరైటిస్,మయస్తిమియా గ్రావిస్, గ్రీవ్స్ డిసీస్, ఎంఎల్ e  వంటి చర్మ సమస్యలు మొదలవుతాయి. వీటన్నిటితోపాటు  క్యాన్సర్లకు  గురయ్యే ప్రమాదం కూడా ఎక్కువే. మౌలికంగా శరీరంలో  ఆమం అంటే  విష పదార్థాలు పేరుకుపోయినప్పుడే అలర్జీ వస్తుంది .అందుకే ,ఆయుర్వేదం ఆమాన్ని బయటకు పంపే ప్రక్రియ ల మీదే పూర్తి దృష్టిని సారిస్తుంది. విష పదార్థాలు పెరడంతో తగ్గిపోయిన ఇమ్యూనిటీ వాటిని తొలగించగానే  మళ్లీ పెరుగుతుంది. పంచకర్మ చికిత్సల ఈ విషయాన్ని బయటకు పంపడంలో సమర్థవంతంగా పని చేశాయి. ఆ తర్వాత వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి రసాయన చికిత్సలు ఉంటాయి .అదే క్రమంలో  ప్రాణ శక్తిని పెంచే ఓజోవర్దక   చికిత్సలు ఉంటాయి .ఇవన్నీ అన్ని  పలురకాల అలర్జీల నుంచి  ఏదో  తాత్కాలికంగా కాదు .  సమస్య నుంచి శాశ్వతంగా విముక్తి చేస్తాయి. అలర్జీ ఆయాస్థానాలన్నీ  పోయి, జీవిత పయనం ఎంతో సునాయాసంగా  సాగుతుంది.





డాక్టర్  మాధురి  వర్ధన్   
MD (Ayu) (Gynecologist & Infertility Specialist)
ఫోన్  : 9056959595

హైదరాబాద్ బ్రాంచీలు :  బషీర్బాగ్ ,తార్నాక , బంజారాహిల్స్ 
ఏపీ బ్రాంచీలు : విజయవాడ , తిరుపతి ,కర్నూల్ , రాజమండ్రి 

Comments