సమస్త లివర్ వ్యాధులకు ఆయుర్వేదమే దిక్కు || What Are The Causes of Liver Disease|Symptoms Of Liver Diseases|Ayurvedic Remedies For Liver Disease



ప్రాణం అనగానే మన గురి మొత్తం గుండెమీదికి వెళుతుంది. కానీ ప్రాణానికి, మొత్తం శరీర వ్యవస్థకు మూలస్తంభంగా నిలిచేది కాలేయం. అందుకే అమెరికన్ తత్వవేత్త "జీవన సామర్ధ్య మంతా లివర్ ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది"అంటాడు అమెరికన్ తత్వవేత్త విలియం జేమ్స్. ఆంగ్లంలో లివర్ ను లైఫర్ అనడంలో అంతరార్థం కూడా ఇదే.ఒకరకంగా లివర్ ను నిర్లక్ష్యం చేయడం అంటే మొత్తం ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడమే. అనాదిగా గుండెకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. కానీ నిజానికి గుండె రక్తాన్ని పంపిణీ చేసే ఒక శరీర భాగం మాత్రమే. ఇదేమి రక్తాన్ని శుద్ధి చేసే యంత్రాంగ మైన కాదు.ఏం తిన్నా, తాగినా, ఏం పీల్చినా ,చివరికి చర్మం  మీద ఏం పోసినా అవన్నీ మొదట చేయవలసింది లివర్ కే. అక్కడ వాన్ని శుద్ధి చెంది చివరికి గుండెకు చేరతాయి. అప్పుడుగాని ఒక సిద్ధ స్థితిలో శరీర వ్యవస్థ కంతా వ్యాపిస్తాయి. మౌలికంగా ప్రధమ స్థాయి జీవక్రియలన్నీ లోనే జరుగుతాయి. ఆ తర్వాతే గుండెకు చేరే ప్రక్రియ మొదలవుతుంది. ఆప్ రీతిలో చూసిన చర్మం తర్వాత శరీరంలో కెల్లా పెద్ద అవయవం లివరే. ఇది మలినాలు వ్యర్ధ పదార్ధాలను నిరంతరం బయటకు పంపడం ద్వారా ఇది శరీరాన్ని అమలినంగా ఉంచుతుంది. ఆ సిద్ధ పదార్థాలన్నీ గుండెకు పంపుతుంది. జీవక్రియల్ని నడిపించడం తో పాటు గ్లూకోజ్ ను, విటమిన్లను లివర్ ఉత్పత్తి చేస్తుంది. రక్తస్రావం అవుతున్నప్పుడు నియంత్రించే క్లాటిక్ పాక్టర్ల ను ఉత్పత్తి చేసేది, హార్మోన్లను ఉత్పత్తి చేసేది కూడా లివరే. ఇలా మొత్తం 500 వేరు వేరు జీవక్రియలను లివర్ సమర్థవంతంగా నడిపిస్తుంది. ఇంతటి గురుతర బాధ్యతల్ని నిర్వహించే లివర్ కూడా కొన్నిసార్లు తీవ్రంగా వ్యాధిగ్రస్తం అవుతుంది.

 ఏమిటా కారణాలు....... 

విచిత్రమైన విషాదం ఏమిటంటే, లివర్ 80% దెబ్బతినే దాకా ఆ తాలూకు ఒక్క లక్షణమూ కనిపించదు. లివర్ సిరోసిస్ నే తీసుకుంటే, లివర్ fail అయి, ప్రాణాపాయ స్థితికి వచ్చేదాకా మనకు ఏమీ తెలియదు. లివర్ సమస్యలు పలురకాలు.... సాధారణ జాండిస్ నుంచి ప్యాటిలివర్, హైపటైటిస్, ఆల్కహాలిక్ లివర్ డిసీజ్, hepatomegaly, జలోదరం జన్యు కారణాలతో వచ్చే విల్సన్ డిసీజ్ ఇవన్నీ ఈ సమస్య ల్లో భాగంగా ఉంటాయి.

ఆయుర్వేదం ఏం చేస్తుంది.......

 ఏ లివర్ వ్యాధి  రావడానికైన మొట్ట మొదటి కారణం పాండుత్వం,...... అంటే రక్తహీనత, రక్త పరిణామాల్లో ను , దాని నాణ్యతలో మార్పు రావడం దానికి కారణం. ఆహారంలో పులుపు పదార్థాలు ఎక్కువ తీసుకోవడం, ఉప్పు ఎక్కువగా తీసుకోవడం, ఎక్కువగా వేడి చేసే మినుములు, ఉలవలు వంటి పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం  ఈ సమస్యలకు మూలం గా ఉంటాయి. శరీర ధర్మానికి పడని ఆహారపదార్థాలు తీసుకోవడం ఋతువుకు, కాలానికి, ప్రాంతానికి, విరుద్ధమైన ఆహారాన్ని తీసుకోవడం వంటివి కూడా లివర్ సమస్యలకు కారణమవుతాయి. మనో వికారాలు ,మానసిక ప్రకోపాలు, కూడా లివర్ ను వ్యాధిగ్రస్తం చేస్తుంటాయి. ఇలా పలురకాలుగా లివర్ పని తనం దెబ్బతింటుంది. అందుకే జాండీస్ నుంచి మొదలుకొని హెపటైటిస్ వంటి ఏ జబ్బును నిర్లక్ష్యం చేసినా లివర్ చిక్కుల్లో పడుతుంది ఈ నిర్లక్ష్యం ఒక దశలో లివర్ సిర్రోసిస్ అనే ఒక తీవ్రమైన వ్యాధి పాలు  చేస్తుంది. లివర్ సిరోసిస్ అనేది ఒక విషమ స్థితికి , చరమ దశకు చేరుకున్నప్పుడు వచ్చే వ్యాధి. అక్కడ నుంచి మరికొన్ని అదనపు సమస్యలు వచ్చి పడతాయి. ఎందుకంటే లివర్ కు క్లోమగ్రంధి ,శ్వాస కోశాలు, మెదడు, ప్లీహం, రెక్టమ్ ,యానం, పెద్ద పేగులు, చిన్న పేగులు వీటన్నింటితో ను విడదీయరాని సంబంధం ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే శరీరంలోని సమస్య వ్యవస్థలో ఆరోగ్యం అంతా లివర్ మీదే ఆధారపడి ఉంది. అందువల్ల ఒక లివర్ ఆరోగ్యం పాడైతే దానితో సంబంధం ఉన్న ఈ అవయవాలన్ని రోగగ్రస్తం అవుతాయి. ఈ క్రమంలోనే ఇది ఒక దశలో బాగా కుంచించుకుపోయి, ఆ తర్వాత కఠినంగా మారుతుంది. కఠినం గా మారడం అంటే అది తన  కార్యదక్షత ను కోల్పోవడమే. ఈ దశనే లివర్ సిర్రోసిస్ అంటాం . సిరోసిస్ వ్యాధి లివర్ ఫెయిల్యూర్ కు , కడుపులో నీరు చేరే జలోదరం సమస్యకు, అంతిమంగా లివర్ క్యాన్సర్ కు, మరణానికి దారి తీస్తుంది.

ఆయుర్వేద విశిష్టత.......

వ్యాధిగ్రస్తమయ్యే తలెత్తే పరిణామాలన్నీ ఎవరినైనా తీవ్రమైన భయాందోళనకు గురిచేసే వే. కానీ ,ఆయుర్వేదం భయాందోళన అన్నింటిని పారద్రోలుతుంది. ఆయుర్వేదంలో కాయ చికిత్స అనే ఒక విశిష్టమైన  విధానం ఉంది. ఇది శరీరంలోని అంతరాన్ని ఉత్తేజం చేసే విశేషమైన వైద్య విధానం. అంతరాన్ని క్షీణించి, అంటే ఆకలి తగ్గి నప్పుడే ఏ జబ్బు కైనా బీజం పడుతుంది. దీన్ని నివారించడం లో కాయ చికిత్స గొప్పగా తోడ్పడుతుంది. ఆయుర్వేదంలోని ఆర్మీ చికిత్స అన్న మాటకు అర్థం కూడా ఇదే. లివర్ సిరోసిస్ అసలే తగ్గించలేదని ఎంత చెబుతున్నా, ఆయుర్వేదం మాత్రం దాన్ని నయం చేసే మందులు ఉన్నాయని ఘంటాపధంగా చెబుతుంది. ఆయుర్వేదంలో అప్పటికే దెబ్బతిన్న లివర్ ను మరింత దెబ్బతినకుండా నియంత్రించే చికిత్సలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత సిరోసిస్ కట్టడి చేస్తూ లివర్ క్యాన్సర్ రాకుండా నిరోధించే వైద్య చికిత్సలు కూడా ఉన్నాయి. నిజానికి లివర్ transplantation వల్ల జరిగే, ప్రయోజనం ఏమీ ఉండదు. అప్పటికే ఎవరైనా transplantation చేయించుకున్న దాని దుష్ప్రభావాలు లేకుండా నియంత్రించే మందులు కూడా ఆయుర్వేదంలో ఉన్నాయి. ఆయుర్వేదంతో లివర్ వ్యాధి నుంచి బయట పడాలని కాదు,లివర్ ఒక కొత్త పవర్ తో పని చేస్తుంది. కొత్త జీవితం మొదలవుతుంది.



డాక్టర్  వర్ధన్ 
MD (Ayu): Ph.D: MS (C&P)
Founder & Chief Physician
ఫోన్  : 9056959595

హైదరాబాద్ బ్రాంచీలు :  బషీర్బాగ్ ,తార్నాక , బంజారాహిల్స్
ఏపీ బ్రాంచీలు : విజయవాడ , తిరుపతి ,కర్నూల్ , రాజమండ్రి

Comments