ఆరోగ్యం జీవితానికి గొప్ప వరమైతే, వెన్ను నొప్పి ఓ పెద్ద శాపం .వెన్ను నొప్పి తీవ్రమైనప్పుడు అడ్రినాలిన్ గ్రంధి అదే పనిగా స్ట్రెస్ హార్మోన్లను విడుదల చేయడం వల్ల అంతిమంగా అది అధికారక్తపోటుకు ,మధుమేహానికీ దారి తీస్తుంది. పైగా హార్మోన్ వ్యవస్థ అంతా దెబ్బ తింటుంది . అందుకే వెన్ను నొప్పి సమస్య మొదలైన వెంటనే వైద్య చికిత్సలకు వెళ్ళడానికి మించిన వివేకం .మరొకటి లేదంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ వర్ధన్ , డాక్టర్ మాధురి వర్ధన్ .
వెన్ను స్థిరంగా నిలబడకపోతే, వారి జీవితమూ స్థిరంగా నిలవదు . వెన్నునొప్పి తీవ్రమైతే ,పర్యంతం మంచాన పది మూలిగే స్థితి ఏర్పడుతుంది. ఫలితంగా ఉద్యోగ, వ్యాపారాల నుంచి పూర్తిగా వైదొలగిపోయే స్థితి కల్పిస్తుంది. జీవితంలో ఎంతో చేయాలనుకున్న, మనిషి చివరికి ఏమీ చేయలేని అసహాయ స్థితిలో పడిపోతాడు. వెన్నునొప్పిని ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే అది క్రానిక్ గా మారిపోయి మనిషిని నానా యాతనల పాలు చేస్తుంది . ఈ నొప్పి శారీరకంగా,మానసికంగా దెబ్బ తీయడమే కాకుండా ,మానసికంగా దెబ్బతీయడమే కాకుండా సామాజికంగా కూడా వెనుకబడేలా చేస్తుంది .వెన్ను నొప్పి ,కేవలం వెన్ను భాగానికే పరిమితమై ఉంటే ,అక్యూట్ పెయిన్ అంటారు. ఒకవేళ వెన్ను వ్యవస్థను దాటి నరాలను, మొత్తం నాడీ వ్యవస్థను దెబ్బతీస్తే దాన్ని క్రానిక్ పెయిన్ అంటారు . మరోరకంగా చూస్తే, వెన్నునొప్పి తగిలిన దెబ్బ తాలూకు ఒక లక్షణంగా మాత్రమే ఉంటే అది అక్యూట్ పెయిన్ . ఒకవేళ ఆ నొప్పే ఒక వ్యాధిగా మారితే అది క్రానిక్ పెయిన్ .వ్యాధి గా మారడం అంటే వ్యవస్థను దాటి, మొత్తం నాడీ వ్యవస్థనూ , ఆ క్రమంలో శరీరంలోని కీలక బాగాలన్నింటి మీదా దుష్ప్రభావం కలిగించడం. నిజానికి ,నొప్పి ఒక లక్షణంగా ఉన్నప్పుడే సరియైనా వైద్య చికిత్సలు తీసుకుంటే, అది వ్యాధిగా మారే అవకాశం ఉండదు. ఒకవేళ ఏ కారణం గానో అప్పటికే వ్యాధి మారిపోతే, అప్పుడింక నొప్పి ఒక లక్షణంగా ఉండేటప్పుడు చేసే సాధారణ చికిత్సలు కాదు. కొన్ని ప్రత్యేక చికిత్సలు అవసరమవుతాయి.
క్రానిక్ గా మారితే?
ఎవరిలోనైనా వెన్నునొప్పి క్రానిక్ గా మారి ,నాడీ వ్యవస్థ దెబ్బ తిన్నప్పుడు మెదడులోని భావోద్వేగాలకు సంబంధించిన లింబిక్ సిస్టమ్ , శరీర పోషణ ,నిద్ర .లైంగిక విభాగాలకు చెందిన హైపోథాలమస్ దెబ్బతింటాయి. ముందు పిట్యూటరీ గ్రంధి కి సంకేతాలు పంపిస్తే,పిట్యూటరీ గ్రంధి అడ్రినలిన్ గ్రంథికి సంకేతాలు పంపిస్తుంది . ఈ ప్రభావాలు వెన్ను దగ్గరలో, కిడ్నీల పైన ఉండే అడ్రినలిన్ గ్రంధి మీద పడి ,స్ట్రెస్ హార్మోన్స్ విడుదల అవుతాయి. నిజానికి నరాలు ,రక్తనాళాలన్నీ ఈ గ్రంధి నియంత్రణలోనే ఉంటాయి. గుండె వేగం, శ్వాస కోశాల వేగం, మూత్రాశయ క్రియలు,ఎలెక్ట్రోలైట్స్ సమతుల్యత ,లవణాల మెటబాలిజం ఇవన్నీ ఈ గ్రంధి ఆదుపాజ్ఞల్లోనే ఉంటాయి . ఏ కారణంగానైనా ,ఈ అడ్రినల్ గ్రంధి సక్రమంగా పనిచేయనప్పుడు , అధిక రక్త పోటు, మధుమేహ సమస్యలు మొదలవుతాయి .
పోషకాలు అందక....?
అవసరమైన పోషకాలు అందక వెన్ను కండరాలతో పాటు, లింగ మెట్లు, టెండర్లు బిగుసుకుపోతాయి .దీంతో వెన్ను నొప్పి మరింత తీవ్రం అవుతుంది. ఒక దశలో రక్తనాళాలు బిగుసుకుపోతాయి . ఫలితంగా, వివిధ అవయవాలకు రక్త ప్రసరణ జరుగుతుంది. అంతిమంగా ఇది అధిక రక్తపోటు మధుమేహం సమస్యలకు తలెత్తడంతో పాటు, జననంగాలను వెళ్లే రక్తప్రసరణలో అంతరాయం ఏర్పడుతుంది. ఇది పురుషుల్లో అయితే ,అంగస్తంభన, శీగ్రస్థలన సమస్యలు మొదలవుతాయి. టెస్టోస్టిరాన్ హార్మోన్ కూడా తగ్గిపోయే , అంతిమంగా ఇది ఆండ్రోపాజ్ కు దారి తీయవచ్చు. స్త్రీలలో అయితే ,అండాశయం మీద కూడా దుష్ప్రభావం పడుతుంది. దీనివల్ల వైట్ డిశ్చార్జ్ నుంచి మొదలుకొని , రతి సమయంలో నొప్పి ,పిసిఒడి ప్రైబ్రాయిడ్స్ ,సంతానం లేమీ , ఇలా సమస్త స్త్రీ -లైంగిక సమస్యలు మొదలవుతాయి .అప్పటికే కండరాలు వ్యవస్థ అంత దెబ్బతిని అది వెన్ను నొప్పికి కారణమైన బాధపడుతున్న సమయంలో కూడా అడ్రినల్ గ్రంధి కూడా స్ట్రెస్ హార్మోన్లను విడుదల చేస్తే, అది కండరాలతో పాటు, లిగమెంట్లు ,టెండాన్లకు కూడా పోషకాలను అందకుండా పోయే పరిస్థితి నెలకొంటుంది. శరీరంలోని సప్తధాతువులు దెబ్బతినే శరీర స్థితి మరింత వేగంగా క్షిణిస్తూ వెళుతుంది. ఇదంతా ఒక విషవలయంలా మనిషి జీవితాన్ని ముంచేస్తుంది .
ఆలస్యం ప్రాణాంతకం...?
నిజానికి సమస్య అంతా కేవలం అడ్రినల్ గ్రంథి విడుదల చేసే హార్మోన్ల కే పరిమితమై లేదు. ఈ పరిమాణాలు శరీరంలోని మొత్తం హార్మోన్ల వ్యవస్థలన్నింటినీ దెబ్బ తీస్తూ వెళతాయి . అంతిమంగా ఇవన్నీ కలిసి మనిషి ప్రాణాన్ని నిలబెట్టే ఓజస్సు ను దెబ్బ తీస్తాయి. ఆ స్థితి వస్తే మనిషి ఇంకా నిర్జీవమే . అందుకే కేవలం వెన్నునొప్పికె పరిమితం కాకుండా ,ఆ కారణంగా దెబ్బతినే మొత్తం వ్యవస్థలన్నీ తిరిగి సాధారణ స్థితికి తేవడమే లక్ష్యంగా ఆయుర్వేదం పనిచేస్తుంది. మేరు చికిత్సలు , మర్మ చికిత్స ,రసాయన చికిత్సలు ఈ విషయంలో అద్భుతంగా పని చేస్తాయి. లైంగిక సమస్యలు ఉంటే వాజీకరణ చికిత్స తీసుకోవచ్చు. వెన్నునొప్పి పట్ల నిర్లక్ష్యం నిజంగా మనిషిని నిర్జీవుడ్నే చేస్తుంది .సమగ్రమైన ఆయుర్వేద చికిత్స లే ఇక్కడ మనిషిని సంపూర్ణుడిగా నిలబెడతాయి.
డాక్టర్ వర్ధన్
MD (Ayu): Ph.D: MS (C&P)
Founder & Chief Physician
ఫోన్ : 9056959595
హైదరాబాద్ బ్రాంచీలు : బషీర్బాగ్ ,తార్నాక , బంజారాహిల్స్
ఏపీ బ్రాంచీలు : విజయవాడ , తిరుపతి ,కర్నూల్ , రాజమండ్రి
Comments
Post a Comment