వెన్నునొప్పితో మెదడుకు నష్టమే :Does Backpain Effects On Brain |Best ayurveda Hospital||Dr Madhuri



ఎప్పుడూ ఉండే వెన్నునొప్పి కదా! అని ఎవరైనా ఎక్కువ కాలం నిర్లక్ష్యంగా ఉండిపోతే ఏమవుతుంది ? శరీరం శిధిలమైపోవడమే కాదు ఒక దశలో మెదడు 11 శాతం కుంచించుకుపోతుంది. అప్పుడు బ్రతికి వున్నాం అన్న  భావన గాని, జీవిస్తున్నాం అన్న స్పృహ గాని ఉండవు. నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో అల్లోపతి వైద్యానికి వెళ్లిన ఏమవుతుంది? ఆ విధానం నొప్పిని తాత్కాలికంగా తగ్గించి చేతులు దులిపేసుకుంటుంది .  ఆయుర్వేదం అలా కాదు .అది శరీరంలోని మొత్తం నొప్పి వ్యవస్థని చక్కదిద్దుతుంది .సప్త ధాతువులను సమగ్రంగా నిలబెడుతుంది. అందుకే ఆయుర్వేదంలో వెన్నునొప్పి శాశ్వతంగా నయం అవుతుంది అంటున్నారు, ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ వర్ధన్ ,డాక్టర్ మాధురీ వర్ధన్.


పగలంతా విపరీతంగా పని చేశాక వచ్చే వెన్ను మొత్తం విస్తరించినట్లు అనిపించే  నొప్పి కావచ్చు .వెన్ను భాగంలో ఏదో కోసేసినట్లు , లేదా పొడి చేస్తున్నట్లు అనిపించే నొప్పి కావచ్చు. ఎప్పుడైనా ఎక్కువ బరువు పైకెత్తినప్పుడు నడుములో కలుక్కుమనే  నొప్పి మొదలు మొదలవ్వడం కావచ్చు. ఏదో ఒక తరహా వెన్ను నొప్పి, ఎప్పుడో ఒకప్పుడు అందరూ అనుభవించినవారే .

కాకపోతే ఆ నొప్పి ఫీలింగ్ మనిషి మనిషికి వేరు వేరుగా ఉంటుంది. దానికి మనిషి మనిషికి మధ్య ఉండే శరీర ప్రకృతిలో ఉండే తేడా కారణమని ఆయుర్వేదం స్పష్టంగా చెబుతుంది. అయితే ఈ వ్యత్యాసాలు గురించిన ఆలోచన అల్లోపతిలో లేదు. అందుకే వెన్నునొప్పి తో వచ్చిన అందరికీ ఆవే పెయిన్ కిల్లర్లతో  కొందరికి కొద్దిపాటి నష్టం కలిగితే, మరికొందరికి చాలా తీవ్రమైన నష్టమే జరిగిపోవచ్చు.


అసలు నొప్పి ఎలా వస్తుంది :

శరీరంలోని ఏదైనా కణజాలం దెబ్బతిన్నప్పుడు నొప్పి వస్తుంది. ఆ నొప్పి ఎలా తెలుస్తుంది .చర్మం మీద, రక్తనాళాల మీద , టెండాన్ల మీద ,  నోసి సెప్టార్స్ అని ఉంటాయి .దెబ్బ తగిలినప్పుడు ఈ నోసీ సెప్టార్స్, ఆ  నొప్పిని సెన్సారీ  నెర్వ్స్  ద్వారా వెన్నుపాముకు చేరవేస్తాయి. వెన్నుపాము హైపోథలామస్ ను  చేరవేస్తుంది .అంతిమంగా నొప్పి మెదడుకు చేరుతుంది.


నిర్లక్ష్యం చేస్తే నిర్లక్ష్యం చేస్తే :

 చాలా రకాల నొప్పుల్ని మనం పట్టించుకోకుండానే ఉండిపోవచ్చు .కొన్నిసార్లు మాత్రం, ఆ నొప్పికి బాగా స్పందించడమే కాదు. ఆ నొప్పి లో తలమునకలై పోవచ్చు కూడా లింబిక్  సిస్టమ్ లో ఆమెగిడిల్లా  అనే విభాగం ఒకటి ఉంటుంది . ఇది నొప్పికి తట్టుకోవడం లేదా ఆ నొప్పి స్పృహ తెలియకుండా పోవడం ఒక నిర్ణయానికి వచ్చేలా చేస్తుంది.నొప్పి తెలియకుండా పోవాలనుకున్న శరీరం పదిరెట్ల శక్తిని ఉపయోగించి అంటే ఎండార్ఫిన్స్ ను అమితంగా విడుదల చేయడం ద్వారా ఆ నొప్పిని తట్టుకునే శక్తిని పొందుతుంది. కాకపోతే అనంత శక్తిని ఒకేసారి విడుదల చేయడం వల్ల, ఆ తరువాత శరీరం బాగా అలసిపోతుంది. ఈ స్థితినే సిండ్రోమ్ అంటారు. వైద్య చికిత్సలు తీసుకోకుండానే  ఏదో ఇలా ఉపశమనం పొందుతున్నారు కదా అని నిర్లక్ష్యం చేస్తూ ఎవరైనా ఎక్కువ కాలం అలాగే ఉండిపోతే ఏమవుతుంది ? ఆ తరువాత శరీరంలోని శక్తినంతా వెచ్చించిన ఆ నొప్పిని తట్టుకోలేక పోతారు .అప్పటిదాకా సాధారణ నొప్పి గా ఉన్నది తీవ్రమైన క్రానిక్  నొప్పి గా మారేది కూడా సరిగ్గా ఈ సమయంలోనే. సమస్య ఏ స్థాయికి ఎలా వెళ్ళిన దానికి మూలకారణం ధాతుక్షయమే. ధాతుక్షయం వల్ల ఏర్పడిన నాడీ వ్యవస్థలోపాలే అంటే మార్గఅవరోధమే కారణం.


క్రానిక్ పెయిన్ లో ఏమవుతుంది ?

సాధారణ నొప్పికి గురవుతున్న వారిలో 25 శాతం మంది ఏదో ఒక దశలో తీవ్రమైన క్రానిక్ నొప్పికి  గురవుతారు .ఎక్కువ కాలం నిర్లక్ష్యం చేయడం వల్ల ఏర్పడిన ధాతుక్షయం, మార్గ  అవరోధాలే అందుకు కారణం. శారీరక కారణాలతో మొదలైన ఈ సమస్య ఒక దశలో నిద్రలేమి ,దిగులు, ఆందోళన ,డిప్రెషన్ వంటి మానసిక సమస్యల పాలు చేస్తుంది. చివరికి ఒక దశలో ఇది శారీరక సమస్య, మానసిక సమస్య అని  తెలుసుకోలేని ఒక విష వలయంలో పడిపోతారు. ఏవైనా రెండు కలగలిసి సాంఘిక జీవనాన్ని, చివరికి లైంగిక జీవితాన్ని కూడా దెబ్బతీస్తాయి. క్రానిక్ పెయిన్ కారణంగా కలిగే ఒక భారీ నష్టం ఏమిటంటే ,నొప్పిని దీర్ఘకాలికంగా భరించి భరించి  మెదడు 11 శాతం కుంచించుకుపోతుంది. మనిషి మనిషి కాకుండా పోతాడు. ఈ క్రమంలో నరాలు ఇంకా దెబ్బ తినకపోతే ఆయుర్వేద చికిత్సలతో ఆ నరాల వ్యవస్థ తిరిగి పూర్తిగా సాధారణ స్థితి కి వచ్చేస్తుంది. ఒకవేళ అప్పటికే నరాలు కూడా బాగా దెబ్బతిని ఉంటే ఆ ఫలితాలు అంతా సంపూర్ణంగా ఉండవు. అందుకే వెన్నునొప్పి అక్యూట్  స్థాయిలో ఉన్నప్పుడే ఆయుర్వేద చికిత్సలు తీసుకోవాలి. కనీసం నొప్పి గా మారిన వెంటనే అయినా చికిత్సలు తీసుకోవాలి. ఒకవేళ నొప్పి క్రానిక్ గా మారిన తరువాత కూడా ఎక్కువ కాలం నిర్లక్ష్యం చేస్తే ఆ నష్టం జీవితకాలమంతా  వేధించే ప్రమాదం ఉంది


ఆయుర్వేదం విలక్షణం 

అనితర సాధ్యమైన వెన్ను నొప్పి సమస్య ఆయుర్వేదం లోనే ఎందుకు నయమవుతుంది అంటే. ఈ విధానం చాలా విస్తృత మైనది .ఆయుర్వేదం కేవలం కండరాలు ,లిగమెంట్లు ,టెండాన్లు, కీళ్లు ,నరాలు, వెన్నెముక, డిస్కులకే పరిమితమై కాకుండా ,ఇది మస్కూలో  స్కెలిటర్ , నెర్వస్ సిస్టమ్  కు వైద్యం అందిస్తుంది. అందుకే సమస్య సంపూర్ణంగా తొలగిపోతుంది. అన్నిటినీ మించి వాతాన్ని సమస్థితికి తెచ్చి మొత్తం శరీర వ్యవస్థను జీవ శక్తి తో నింపుతోంది.ఆయుర్వేదం కేవలం నొప్పిని తగ్గించడం తోనే ఆగిపోదు. శరీరంలోని నొప్పి సంబంధిత వ్యవస్థని చక్కబెడుతుంది. అందుకే ఆయుర్వేద చికిత్సలతో వెన్నునొప్పి నుంచి బయటపడటమే కాదు .అత్యంత సహజమైన, ఒక చైతన్య స్రవంతి మీ లోకి ప్రవేశిస్తుంది.ఫలితంగా  ఒక వినూత్నమైన జీవితాన్ని మీరు ఆస్వాదిస్తారు. 




డాక్టర్  మాధురి  వర్ధన్ 
MD (Ayu) (Gynecologist & Infertility Specialist)
ఫోన్  : 9056959595

హైదరాబాద్ బ్రాంచీలు :  బషీర్బాగ్ ,తార్నాక , బంజారాహిల్స్
ఏపీ బ్రాంచీలు : విజయవాడ , తిరుపతి ,కర్నూల్ , రాజమండ్రి 

Comments