లివర్ సమస్యలకు కు ఆయుర్వేదమే అసలైన వైద్యం || Ayurvedic Treatment For Liver Disease || Dr Vardhan






ఆధునికుల్లో  కాలేయం (లివర్ ) సమస్యలు  నానాటికి పెరిగిపోతున్నాయి .ఫ్యాటీ లివర్ సమస్యలు ,హెపటైటిస్ ,అసైటిస్ ,లివర్ సిరోసిన్ , లివర్ కాన్సర్ వంటి సమస్యలు  నిజంగా అత్యదికుల్ని కలవరపెడుతున్నాయి . ఎక్కువ మంది ఆశ్రయించే ఆధునిక వైద్య విధానాలు ఇంతకు ఈ సమస్యకు చేస్తున్నదేమిటి ? ఏవో కొద్దీ రోజులు మందులివ్వడం వాటితో సమస్య పూర్తిగా ఎప్పుడు పోదు కాబట్టి చివరగా చేతులు ఎత్తేయడమో లేదా లివర్ మార్పిడి గురించి మాట్లాడతామో ఆనవాయితీగా మారింది .కాలేయ సమస్యలకు అసలు కారణమైన అగ్ని లోపాలను సరి చేయకుండా కాలేయం ఎలా బాగుపడుతుంది ? అందుకే అగ్ని చికిత్సలతో లివర్ సమస్యల్ని సమూలంగా నిర్ములించే ఆయుర్వేదం తప్ప మరో మార్గం లేదంటున్నారు .ఆయుర్వేద వైద్య  నిపుడులు డాక్టర్ వర్ధన్ .


అవిశ్రాంతమైన ఉరుకులు  పరుగులే కావచ్చు.అలివి  కానీ మానసిక ఒత్తిళ్లే కావచ్చు .మారిన ఆహారపు అలవాట్లే కావచ్చు .ఇవన్నీ కాలేయం మీద నిరంతరం  దుష్ప్రభావాన్ని  కలిగిస్తూనే ఉన్నాయి. ఏ ఆహారం తీసుకున్నా అది జీర్ణమై రసంగా మారి, అది ముందుగా చేరేది కాలేయం లోకె . ఆహారంలోని పోషకాలను శుద్ధి చేయడం, కార్బోహైడ్రేట్లను మనకు ఇచ్చే గ్లూకోజ్ గా , విటమిన్లు గా , లవణాలు గా మార్చడం ఇదంతా కాలేయం పనే. అంతేకాదు తిన్నదంతా ఒంటికి పట్టేలా చేసేది కూడా కాలేయమే. మౌలికంగా జీర్ణక్రియ తో పాటు, సమస్త జీవ ప్రక్రియల్లోనూ ,వ్యర్ధాల బహిష్కరణ లోనూ,కాలేయం పాత్ర కీలకం. అలాగే, అవసరమైన వాటిని నిల్వ చేయడంలోనూ, ఉత్పాదక క్రియలను,వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలోనూ, కాలేయం ఎంతగానో తోడ్పడుతుంది. అయితే ఆహార పదార్థాలతోపాటు, మద్యం ,మాదక ద్రవ్యాలు పొగాకు ఉత్పత్తులు వీటన్నిటిని కాలేయమే శుద్ధి చేయాలి .భావోద్వేగాలు తీవ్రమైనప్పుడు అతిగా ఉత్పన్నమయ్యే హార్మోన్ల ప్రభావాన్ని నియంత్రించేది కూడా కాలేయమే . ఈ బాధ్యతలన్నీ  నిర్వహించడానికి కాలేయం నిజంగా ఎంతో ఆరోగ్యంగానూ  బలంగాను ఉండాలి. ఈ భారం మరీ ఎక్కువైనప్పుడు కాలేయం దెబ్బతినే పరిస్థితి ఏర్పడుతుంది .శరీర వ్యవస్థకు మూలస్తంభాలైన సప్తధాతువుల ప్రక్రియలు కుంటుపడతాయి. మొత్తంగా చూస్తే ధాతుసామ్యత  దెబ్బ తింటుంది .

నిర్లక్ష్యం చేస్తే :

శరీరంలోని పలు వ్యవస్థలకు కేంద్రమైన కాలేయాన్ని నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుంది? ఎదో ఒక దశలో లివర్ వ్యాధిగ్రస్తమైన తాలూకు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటిలో మూత్రం పసుపు రంగులో రావడం, వికారం ,వాంతులు, విరేచనాలు, ఆకలి మందగించడం, బరువు తగ్గడం, నీరసం ,నిస్సత్తువ ,తరచూ జ్వరం రావడం, కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి, కాళ్లవాపు, రక్తహీనత ,రక్తం వాంతులు,మలం  నలుపు రంగులో రావడం ,వంటి లక్షణాలు కనిపిస్తాయి .వీటితోపాటు మానసిక స్థితిలో మార్పులు, నిద్రా సమయాలు మారడం ,మజ్జుతనం , అయోమయత్వం ,ఇలాంటివి రావచ్చు. కాలేయం డియోడినమ్, గ్రహిణి, వీటిలో ఏ ఒక్కటి సరిగా పని చేయలేకపోయినా లేక పిత్తాశయం తొలగించిన  ఇవన్నీ గ్రహిణి  అంటే ఐబిఎస్ కు  దారి తీసే ప్రమాదం కూడా ఉంది. ఈ స్థితిలో సరైన చికిత్స అందకపోతే ,కాలేయం, ప్లీహం పెరిగి  కడుపు ఉబ్బిపోయి   అసైటిస్  సమస్యకు దారితీయవచ్చు. పేగుల్లోంచి రక్తస్రావం మొదలు కావచ్చు.అంతిమంగా ఇవి లివర్ సిర్రోసిస్, లివర్ క్యాన్సర్ కు  దారితీయవచ్చు.


ఆయుర్వేదం ఏం చేస్తుంది:

 నిజానికి ఆహారం సప్తధాతువులు గా మారడానికి కాలేయమే  సింహద్వారం. కాలేయమే తన విధుల్ని సరిగా నిర్వర్తించలేక పోతే కాలేయంలో ఆమం అంటే వ్యర్థ, విషపదార్థాలు పేరుకుపోతాయి. ఈ స్థితిలో మలబద్ధకం,అజీర్తి, నీరసం, నిస్సత్తువ మధుమేహం ,కొలెస్ట్రాల్ నిల్వలు పెరిగి పోవడం వంటి సమస్యలు మొదలవుతాయి. పరిస్థితి ఇంకా విషమిస్తే ,జాండిస్, హెపటైటిస్, లివర్ సిర్రోసిస్ ,లివర్ కేన్సర్ వంటి జబ్బులు మొదలవుతాయి. ఈ సమస్యలన్నిటికీ మూల వైద్యంగా ఆయుర్వేదం ముందు జఠరాగ్ని ని పెంచి జీర్ణ శక్తిని సహజ స్థితికి తెచ్చే ప్రక్రియ చేపడుతుంది. ఆ క్రమంలో సప్తధాతువులన్నీ  పరిపుష్టం చేస్తుంది.

అంతిమంగా ఓజస్సును ఉద్దీపన చేస్తుంది .ఇందులో భాగంగా అగ్ని స్థానాలకు చికిత్స చేయడం కూడా అవసరం. అగ్ని స్థానాలు అంటే  ప్లిహమూ ,కాలేయాలే . ఈ రెండు తిరిగి సహజ స్థితి లో పని చేయడానికి వీలుగా శరీరంలోని ఆమాన్ని తొలగించే చికిత్సలు చేయాలి. ధాతు సామ్యత కే కాకుండా ధాతుపుష్టికి దోహదం చేసే చికిత్సలు కూడా చేయాలి.మొత్తంగా చూస్తే ఆగ్నేయ చికిత్సలు చేయాలి .అంటే అంతరాగ్ని చికిత్స చేయాలి.  కాలేయం తిరిగి పనిచేసేందుకు అన్నట్టు కొన్ని నామమాత్రపు చికిత్సలు చేసి ఇ అంతిమంగా లివర్ మార్పిడి దిశగానే ఆధునిక చికిత్సలు పనిచేస్తున్నాయి. లివర్ సంబంధిత ఇతర సమస్యలే కాదు ,చివరికి లివర్ సిర్రోసిస్ కైనా, లివర్ క్యాన్సర్ కైనా, అగ్ని చికిత్సలే అత్యుత్తమ వైద్యాలు. నిజానికి అగ్నికి చికిత్స చేయకుండా మిగతా ఎన్ని చికిత్సలు చేసినా అందుకే ఆయుర్వేదం ఆగ్నేయ చికిత్సలకు అత్యధిక ప్రాధాన్యత నిస్తుంది. ఏ రకంగా చూసినా లివర్ సమస్యలకు ఆగ్నేయ చికిత్సలే అసలైన పరిష్కారం. లివర్ సంబంధిత సమస్త వ్యాధులకు ఆయుర్వేదమే అసలు సిసలైన వైద్యం ఇది ముమ్మాటికీ నిజం.




డాక్టర్  వర్ధన్ 
MD (Ayu): Ph.D: MS (C&P)
Founder & Chief Physician
ఫోన్  : 9056959595

హైదరాబాద్ బ్రాంచీలు :  బషీర్బాగ్ ,తార్నాక , బంజారాహిల్స్
ఏపీ బ్రాంచీలు : విజయవాడ , తిరుపతి ,కర్నూల్ , రాజమండ్రి 

Comments