ఐబీఎస్ ను ఎన్నాళ్లు భరిస్తారు? | IBS తాలూకు లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయి | Ayurvedic Remedy for Irritable Bowel Syndrome



రిపోర్టులన్నీ నార్మల్ అని చెప్పినా, ఐబిఎస్ ఉన్న వ్యక్తి శరీరం నార్మల్ గా ఉన్నట్లేమీ కాదు. శరీరంలో కచ్చితంగా దోషాలు ఉన్నాయనే అర్థం కాకపోతే అవి వాత రూపంలో ఉండటంవల్ల రిపోర్ట్ ల్లో కనిపించవు. మామూలుగా వచ్చే డయేరియా లో ఓ కొద్ది రోజుల పాటు విరేచనాలై ఆ తరువాత ఆగిపోతాయి. కానీ, ఐబీఎస్ తో వచ్చే డయేరియా లో పేగుల్లో నిరంతరంగా ప్రకంపనాలు వస్తూనే ఉంటాయి. అందుకే సరియైన వైద్యం అందకపోతే, ఈ సమస్య ఏళ్ల తరబడి అలా కొనసాగుతూనే ఉంటుంది. ఐబిఎస్ తాలూకు  లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయి. ఎక్కువమందిలో సామాన్యంగా కనిపించే లక్షణాల్లో ప్రధానంగా ఉబ్బరం, కడుపు నొప్పి, హఠాత్తుగా టాయిలెట్ కు వెళ్లాలనిపించడం, విసర్జన తరువాత కూడా ఇంకా పూర్తి కాలేదన్న భావన ఉంటాయి. వీరి   జీవనం ఒక దశలో రెండు కిడ్నీలు ఫెయిలయిపోయి నిరంతరం డయాలిసిస్ కు  వెళ్లే వారిలాగే నిర్జీవంగా  ఉంటుంది. సహజమైన జీవ క్రియలు దెబ్బతినిపోయి, వ్యక్తిగత జీవితమూ, వృత్తిపరమైన జీవితమూ అస్త వ్యస్తం అయిపోతాయి, తిన్నదంతా విసర్జనలో వెళ్లిపోతుంటే, శరీరంలోని సప్తధాతువులు క్షిణిస్తూ వెళతాయి, అంతటితో ఆగకుండా ఈ విపరిణామాలు ఆత్మ విశ్వాసాన్ని దెబ్బ తీసి, మానసికంగా కుంగిపోయేలా చేస్తాయి.

మూల వైద్యం తోనే ముక్తి

ఆధునిక వైద్యం ఐబిఎస్ కి సమస్త కారణం బ్రెయిన్ మాత్రమే అంటుంది. మెదడే అయినా అది తలలో ఉండే ఫస్ట్ బ్రెయిన్ కాదు. కడుపులో ఉండే సెకండ్ బ్రెయిన్ (గ్రహణి) లో తలెత్తే సమస్య ఐబిఎస్ లో  ప్రత్యేకించి ఫస్ట్ బ్రెయిన్ లోని సెన్సరీ ఇన్ఫర్మేషన్ జరిగే పోస్టరియర్ ఇన్సులా అనే విభాగం దెబ్బతింటుంది. ఫలితంగా విషయం మీద దృష్టిని కేంద్రీకృతం చేసి స్థితిని, శరీర వ్యవస్థలను నియంత్రించే స్థితిని  శరీరం కోల్పోతుంది. ప్రతేకించి జీర్ణాశయం, మూత్రాశయం వీటన్నింటి మీద నియంత్రణ పోతుంది. అయితే, ఎన్ని రకాల స్కానింగ్ లు చేసినా, ఐపీఎస్ ఉన్నవారికి లేనివారికి మధ్య తేడా ఏమీ కనిపించదు. అలా కనిపించకపోవడానికి ఐబిఎస్ సమస్య భౌతిక రూపం లేని వాతపిత్తకఫాలా తేడాల కారణంగా వచ్చేది కావడమే. ఐబీఎస్ సమస్యకు అసలు కారణమైన వాతాన్ని నియంత్రించకుండా, వాత పిత్త కఫాలను సమస్థితికి తీసుకు రాకుండా ఐబిఎస్ ను తొలగించడం ఎవరికీ సాధ్యం కాదు. అలాగే, శరీరంలోని విషపదార్థాలు బయటకు పంపకుండా, జీర్ణవ్యవస్థకు ప్రాణమైన అగ్ని ని వృద్ధి చేయకుండా ఐబిఎస్ ను  నయం చేయడం కలలోని మాట. వాస్తవానికి అవసరమైన ఈ అన్ని  చికిత్సలూ  అందించే ఆయుర్వేదం ఒక్కటే. ఐబిఎస్ చికిత్సలో భాగంగా తీసుకువచ్చే విశేష చికిత్సలు చేస్తాం. మూలకారణమైన గ్రహణికి  జీవశక్తిని నింపుతాం. ఆయుర్వేద చికిత్సలతో శరీరం లోని అన్ని వ్యవస్థలూ, సమస్త జీవనక్రియలూ  పూర్తిగా సామ్య వస్థలోకి  వచ్చేస్తాయి.




డాక్టర్  వర్ధన్ 
MD (Ayu): Ph.D: MS (C&P)
Founder & Chief Physician
ఫోన్  : 9056959595

హైదరాబాద్ బ్రాంచీలు :  బషీర్బాగ్ ,తార్నాక , బంజారాహిల్స్
ఏపీ బ్రాంచీలు : విజయవాడ , తిరుపతి ,కర్నూల్ , రాజమండ్రి

Comments