Vardhan Ayurveda Hospital Importance And Treatment Speciality |Vardhan Ayurveda Hospital |Dr VARDHAN
మహర్షుల ప్రభావంతో వెలిగిన ప్రాచీనకాలం నుంచి ఆయుర్వేద వైద్యవిధానాల ప్రశస్తత గురించిన ప్రాచుర్యము , ప్రచారము జరుగుతూనే వున్నాయి .ఔషధాలకు, స్వస్థత చికిత్యలకు ఆయుర్వేదం ఒక అత్యంత పురాతన రూపం . అందుకే ఆయుర్వేదాన్ని సమస్త విజ్ఞాన శాస్త్రాలకు తల్లి అంటారు .
1999 లో స్థాపించిన " వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్ " శతాబ్దాల నాటి ఈ ప్రాచీన ఆయుర్వేద విజ్ఞానాన్ని , దాని మార్గాలను , మెళుకువలను అనుసరిస్తూనే మరికొన్ని చికిత్సా విధానాలను కూడా చేర్చి వాటిని ప్రపంచం నలుమూలల విస్తరింప చేయడానికి సాధ్యమైన అన్ని మార్గాల ద్వారా కృషి చేస్తోంది . ఈ సుదీర్ఘకాలం లో ఒక విస్తృతమైన పరిశోధన ద్వారా కొన్ని దీర్ఘకాలిక , హానికారక వ్యాధులకు శారీరక రుగ్మతలకు కొన్ని వినూత్నమైన ఔషధాలను తయారు చేయడం లో మేము కృతకృత్యులయ్యాం .ఉన్నత ప్రమాణాలతో , సేవ దృక్పధంతో ప్రామాణికమైన వృత్తి నైపుణ్యంతో ఈ హాస్పిటల్ నడిపిస్తున్నాం .డాక్టర్ వర్ధన్ ఎమ్.డి ( ఆయుర్వేద ) పిహెచ్..డి .,ఎమ్.ఎస్ .(సి &పి ) ఈ హాస్పిటల్ కు సారథ్యం వహిస్తున్నారు .ఈ రోజున ఈ హాస్పిటల్ ఈ స్థాయికి చేరుకోవడానికి వారి సారధ్యమే కారణం .
ఆయుర్వేద పరమైన వైద్య చికిత్యల్లో సుధేర్గమైన అనుభవం ఉన్న ఎంతోమంది డాక్టర్లు ,ఆరోగ్య రక్షణా నిపుణుల బృందంతో వారు ఈ హాస్పిటల్ నడిపిస్తున్నారు . వారంతా రోగులందరికీ అన్నివేళలా ఒక ప్రామాణికమైన చికిత్సను అందించడం లో నిబద్దతతో పని చేస్తున్నారు .
ఇక్కడ జరిగేవైద్య చికిత్సలన్నీ ఒక సమగ్ర దృష్టితో (హోలిస్టిక్ అప్రోచ్ ) జరుగుతున్నాయి .అందులో భాగంగా రోగిని అత్యంత నిశితంగా పరీక్షించి అతనికి ఉపయుక్తంగా ఉండేచికిత్సా కార్యక్రమాన్ని రూపొందించడం జరుగుతుంది .వైద్య చికిత్సలతో పాటు పోషకాంశాలు , జీవనశైలికి సంబంధించి ఒక శాస్త్రీయమైన సమిష్టి విధానాన్ని రూపొందిస్తారు . మౌలికంగా ఇవన్నీ మౌలికా వైద్య చికిత్సలు , అంతర్ చికిత్సల ప్రణాళికలతో ఉంటాయి .
మేరు చికిత్స
(ప్రాచీన వెన్నుముక - నాడీ చికిత్సా విధానం )
ఆయుర్వేద పరిభాషలో వెన్నుముకను 'మేరుదండం 'అని పిలుస్తారు .వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్ లో మేము 5 ,000 ల సంవత్సరాల నాటి ఆ ప్రాచీన ఆయుర్వేద వెన్నుముక -నాడీ చికిత్సల విశేషాల పైన పునః పరిశోధన చేసి ఒక ప్రత్యేకమైన విధానాన్ని పునర్నిర్మాణం చేశాం. ఇలా వృద్ధి చేసిన మేరు చికిత్సా విధానాలు వెన్నుముకకు దృఢత్వాన్ని సునాయాసంగా కదిలే ,వంగే వెసులుబాటును కలిగిస్తాయి .పైగా శస్త్ర చికిత్స లేకుండా మరే దుష్ప్రభావాలకూ తావు లేకుండా చికిత్సలు అందించగలుగుతున్నాం .
పంచకర్మ చికిత్స
(మలిన నిర్ములక - శుద్ధికారక చికిత్సలు )
ఐదు రకాల చికిత్సా ప్రక్రియలను పంచకర్మలు అంటారు . ఏవి శరీరాన్ని ,మెదడును ,మనసును ,ఇంద్రియాలను అణువణువునా శుద్ధి చేసి వాటి పూర్వశక్తిని వాటికి తిరిగి అందించేందుకు ఉద్దేశించినవి .
విమానం (నోటిద్వారా ),విరోచనం (విసర్జక మార్గం ద్వారా ) వప్తి (ఔషధీయ ఎనిమా ద్వారా ),నస్యం ( ముక్కు ద్వారా ),రక్త మోక్షణం ( చేదు రక్తాన్ని తొలగించడం ద్వారా ) శుద్ధి చేసిన ఈ ఐదు ప్రక్రియలే పంచకర్మలు .
ఈ పంచకర్మ చికిత్సలు పైపైన చుస్తే అతి మామూలుగానే కనిపిస్తాయి కానీ , వాటి ప్రభావాలు మాత్రం ఎంతో శక్తివంతమైనవి ,ఫలవంతమైనవి.విలక్షణంగా ప్రకృతి సహజంగా సమగ్రంగా ఆరోగ్యదాయకంగా ఉండే ఈ పంచకర్మలు శరీరంలో మలిన దాతుకాణాల్ని శుద్ధి చేస్తాయి . ఈ ప్రక్రియలు మూసుకుపోయిన జీవనవాహికల్ని తెరవడంతో పాటు జీవితానికి ఉత్తేజకరమైన శక్తినిస్తాయి .తద్వారా ప్రాణశక్తిని , అంతరశాంతిని,ఆత్మశాంతిని పరిపూర్ణ స్వస్థత ప్రసాదిస్తాయి.
రసచికిత్స
(శక్తి విస్ఫోటక - నానో ఔషధ చికిత్స)
వేదాల్లోని రసాయనశాస్త్రం ఆధారంగా రూపొందించబడిన ఆయుర్వేదంలో ని ఈ చికిత్సా విధానానికి అత్యంత ప్రభావవంతమైన అతి స్వల్ప వ్యవధిలోనే అద్భుత ఫలితాలనిచ్చే చికిత్సగా పేరుంది .ఇందులో వాడే ఔషదాలు ,ప్రత్యేకంగా శుద్ధి చేసి ,అతి తక్కువ మోతాదులో నే అతి శక్తివంతంగా పనిచేసేలా రూపొందించబడినవి .ఇవి శరీర కణజాలాన్ని నిలబెట్టడంలోనూ మొత్తం శరీర వ్యవస్థను శక్తివంతం చేయడంలోనూ ప్రత్యేక భూమికను నిర్వహిస్తాయి .ఆధునిక వ్యాదులైన ఎయిడ్స్ ,ఆటోఇమ్యూన్ వ్యాధులు , శరీర అపనవ్యతలు , అన్ని రకాల క్యాన్సర్లు , క్షయ ,థైరాయిడ్ , మధుమేహం తో పటు జీవక్రియ రుగ్మతలకు వర్ధన్ ఆయుర్వేద హాస్పటల్ లో రక్తచికిత్సల ద్వారా వైద్యం అందించబడుతోంది .
రసాయన చికిత్సలు
(దాతుకణ పరిరక్షణ - ఆయుర్వృద్ధి విధానాలు )
శరీరానికి పునరుతేజాన్ని , దీర్ఘాయువునూ అందించే విధానాలే రసాయన చికిత్సలు.
'రస' అంటే సంరక్షణ, పరివర్తన, ప్రాణశక్తిని అందించగలిగేది అని అర్థం. రసాయనాలు శరీరము, మెదడు, మనసు కు, సంబంధించిన మూలాన్ని శుద్ధి చేసి, పోషణ చేసి వాటిని తిరిగి ప్రాణ ప్రతిష్టాపన చేస్తాయి. ఈ ఫలాలన్నీ ఒక నిర్దేశిత బాహ్య , అంతర చికిత్సల ద్వారా, శ్వాసవ్యవస్థ ను శక్తివంతం చేయడం ద్వారా, ఒక వినూత్న ఆహార నియమావళి ద్వారా ఆరోగ్యవంతమైన దినచర్యల ద్వారా సిద్ధిస్తాయి. మానవాళికి పునరుత్తేజంన్నీ , దీర్ఘాయువు నిచ్చేందుకు ప్రాచీన ఆయుర్వేద విజ్ఞానం రూపొందించినదే ఈ రసాయనామృతం . నవతరానికి ఒక గొప్ప జీవ చైతన్యాన్నిచ్చేందుకు ,
మరింత , ఉపయుక్తంగా మలిచేందుకు వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్ పునః పరిశోధన చేస్తోంది. ప్రకృతి (శరీరధర్మం), అగ్ని (జీవక్రియల, జీవ వ్యవస్థల), సత్మ్య (స్వీకృతి ), బల (వ్యాధినిరోధకత) ఆచార( జీవనశైలి) విధానాలను దృష్టిలో ఉంచుకుని ఒక నిర్దిష్టమైన విధానంతో ఈ రసాయన చికిత్సలు జరిగినప్పుడు అపారమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
వాజీకరణ చికిత్స
(లైంగిక సంతృప్తి ,సంతాన సాఫల్యాల విజ్ఞానం )
వాజీకరణ చికిత్స అనేది అష్టాంగ ఆయుర్వేదంలోని ఒక విభాగం. ఇది నపుంసకత్వం , రతిలో అనాసక్తి, అంగస్తంభన లోపాలు,శ్రీఘ్ర స్థలనం వంటి పురుష సమస్యలను, వంధ్యత్వం (సంతానలేమి), జడత్వం (రతిలో అనాసక్తి) సమస్యల నివారణ కోసం పని చేసే చికిత్స విధానం.
మొత్తం శరీర వ్యవస్థకు మూలభూతమైన సప్తధాతువుల్లో చివరిది శుక్రధాతువు (వీర్యం). అయితే పునరుత్పత్తి కారకమైన ఈ శుక్రధాతువు మిగతా వాటికన్నా విశిష్టమైనదిగా గుర్తించబడినది. లైంగిక సంతృప్తికి, లైంగిక పటుత్వానికీ, ఆరోగ్యవంతమైన సంతానానికి ఈ శుక్రధాతువు సలక్షణంగా ఉండటం అవసరం. అది సప్తధాతువులూ సక్రమంగా పని చేసినప్పుడే సాధ్యం. అందుకు అన్ని విధాలా తోడ్పడేవే ఈ వాజీకరణ చికిత్సలు. ఇది శుక్రధాతువును శక్తివంతంగా చలన శీలంగా ఉంచడంతో పాటు మనిషి ఆయుః కాలాన్ని కూడా పెంచుతాయి. క్రమశిక్షణ గల జీవనశైలిని , ఒక నిష్ఠయుతమైన లైంగిక విధానాన్ని అలవర్చడం వాజీకరణ చికిత్స లో భాగంగా ఉంటాయి. పైగా లైంగిక ప్రక్రియ అనేది కేవలం సుఖసౌఖ్యాలు కోసమే కాదు ఉత్తమ సంతానం కోసం కూడా అనే అవగాహన కలిగించడం కూడా ఇందులో భాగమే.
సమగ్ర ఆరోగ్య పరిరక్షణ
వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్ చికిత్స విధానమంతా సమగ్ర దృష్టిపూర్వకమైనదే. ఇక్కడ ఇచ్చే బాహ్య, అంతర చికిత్సలు మీ శరీర వ్యవస్థను గొప్పగా పునర్నిర్మాణం చేసుకోవడానికి పునరుత్తేజం పొందడానికి విశేషంగా తోడ్పడతాయి. ముఖ్యంగా రోగి పరిస్థితిని , అతని జీవితావసరాలను లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని అతనికి అన్ని విధాల ఉపయుక్తంగా , ఉపయోగకరంగా ఉండే చికిత్సలు ఎంతో శ్రద్ధ ,జాగ్రత్తలతో రూపొందించబడతాయి .అయితే మరి కొన్ని ఇతర వ్యాధులకు కూడా ఇక్కడ పూర్తిస్థాయి చికిత్సలు ఉన్నాయి. ప్రధానంగా వెన్నెముక సమస్యలు, నరాల జబ్బులు,సంతాన సమస్యలు, శ్రీ జనగాంగ రుగ్మతలు , జీర్ణాశయ సమస్యలు, చర్మవ్యాధుల వంటి వివిధ ఆరోగ్య సమస్యలకు కు చికిత్స చేయడంలో ఈ సంస్థ విజయాన్ని సాధించింది. పైన పేర్కొన్న ఆరోగ్య సమస్యలతో పాటు వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్ జీవనశైలి సమస్యలకు, వంశానుగత వ్యాధులకు ,నిద్రలేమి, ఒత్తిడి, అలసత్వం, మధుమేహం, అధికరక్తపోటు ,నడుం నొప్పి వంటి రుగ్మతలను నయం చేయడంలో కూడా విశేషమైన అనుభవాన్ని సాధించింది .ఇక్కడ కేరళ కలారి మసాజ్ లు బ్యూటీథెరపీలకు సంబంధించి కూడా ఒక ప్రత్యేక వ్యవస్థ ఉంది. ఈ చికిత్స ప్రక్రియలో అన్ని ఏమాత్రం దుష్ప్రభావాలు లేకుండా గరిష్ట ప్రయోజనాలు కలిగించేవిగా నిరూపితమైనాయి ....
మౌలికంగా మనిషిని సమస్త రుగ్మతల నుంచి విముక్తి చేసి అతడి ఆయుర్వృద్ధిని కలిగించి ఆనందమైన జీవితాన్ని అందించాలనే లక్ష్యంతో వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్ సాగిపోతుందనేది వాస్తవం
Dr Vardhan,
MD (Ayu); Ph.D; MS (C&P),
Founder & Chief Physician,
VARDHAN AYURVEDA HOSPITAL,
II Hyderabad II Secunderabad II Vijayawada II
II Rajahmundry II Kurnool II Tirupati II
డాక్టర్ వర్ధన్ MD (Ayu): Ph.D: MS (C&P) Founder & Chief Physician
డాక్టర్ మాధురి వర్ధన్ MD (Ayu) (Gynecologist & Infertility Specialist) ఫోన్ : 9056959595 హైదరాబాద్ బ్రాంచీలు : బషీర్బాగ్ ,తార్నాక , బంజారాహిల్స్ . ఏపీ బ్రాంచీలు : విజయవాడ , తిరుపతి ,కర్నూల్ , రాజమండ్రి .
Comments
Post a Comment