పేగుల్లో పెనుతుఫాను :What is the Ayurvedic Treatment for IBS | What Ayurveda Says About IBS:Dr Vardhan




ఎదురుగా అన్నీఉన్నా ఏమి తినలేని పరిస్థితి ఏ ఫంక్షన్ కు వెళ్లలేని నిస్సహాయత  అపూర్వమైన వాటి కోసం కాకుండా అస్తమానం టాయిలెట్ల కోసం వెతుక్కోవడం నిజంగా ఎంత దుర్గతం . ఐ బి ఎస్  (ఇరిటబుల్ బావెల్  సిండ్రోమ్) వ్యాధితో ఇదేగా సమస్య ఎంత మంది డాక్టర్లను కలిసిన ఇది ఒంట్లో ది కాదు పుర్రెలో పుట్టిన సమస్య  అని కొట్టి పారేస్తారు. ఏమిటి అయితే ఇది శారీరక సమస్యలు జీర్ణాశయంలో ఉండే సమస్యని దేశంలో ఉండే సెకండ్ బ్రెయిన్ రోగగ్రస్తం కావడం వల్ల మొదలవుతుందని దీనికి ఆయుర్వేదంలో సంపూర్ణమైన వైద్యం ఉందని నొక్కి చెబుతున్నారు డాక్టర్ వర్ధన్ డాక్టర్ మాధురీ వర్ధన్.....

దాదాపు ఓ పదేళ్లుగా ఐబీఎస్  ఇది  (ఇరిటబుల్ బావెల్  సిండ్రోమ్)సమస్యతో అతను నానా అవస్థలు పడుతున్నాడు.  అప్పటిదాకా పక్షిలా ఎగిరే  అతడు ఈ పదేళ్లలో ఒక పెద్ద రోగిష్టి  గా మారిపోయి విషాదంలో రోజంతా ఇంట్లోనే పడి ఉండే  దుష్ట వ్యవస్థకు  చేరుకున్నాడు. అతని వయస్సు  ఇంకా 36 ఏళ్లు తొలి రోజుల్లో కేవలం కడుపులో ఏదో మెలేసి నట్లు, పడేసినట్లు ఉండేది. ఆ తరువాత నీళ్ల విరోచనాలు మొదలయ్యాయి. ఏదో మజ్జిగ లాంటివి తీసుకుంటే ఓ పది రోజులు  కాస్త తగ్గినట్లే అనిపించినా ఆ తర్వాత మళ్లీ మొదలయ్యేవి .ఇటీవలే  విరోచనాలు, మలబద్దకం ఒకదాని తర్వాత ఒకటి పోటీపడి వేధిస్తున్నాయి. ఏం తిన్నా వెంటనే పరిగెత్తాల్సిందే అన్ని దశల్లోనూ నొప్పి గ్యాస్ ఆపైన వాయువుల విడుదల కావడం ఒక నిరంతర  యాతన అయిపోయింది. అందుకే ఉద్యోగం మానేశాడు .డాక్టర్ ఏమో  జబ్బు నీ ఒంట్లో కాదు నీ బుర్రలో ఉంది .దానికి ఎవరు మాత్రం ఏం చేయగలరు అంటూ నిర్లిప్తంగా మాట్లాడుతున్నారు. నా పుర్ర కొంత కారణమైతే కావచ్చు కానీ ఆ సమస్య గురించి ఆలోచించకుండా ఆందోళన చెందకుండా అలాగే జరుగుతుంది కదా !అంటే ఆ మాటకు ఎవరు సమాధానం చెప్పారు. గత రెండేళ్లలో 15 కిలోల బరువు తగ్గి పోయాను గత ఆరు నెలలుగా స్టెరాయిడ్స్ ఇస్తున్నారు. శరీరం పూర్తిగా చిక్కిపోయింది ఫలితంగా శరీరం తరచు ఇన్ఫెక్షన్లకు గురవుతుంది .గత రెండు నెలలుగా పరిస్థితి మరీ దారుణంగా తయారైంది ఒక్కోసారి నాకు తెలియకుండా నే  కళ్ళలో నీళ్ళు వచ్చేస్తున్నాయి. డాక్టర్కు చెబితే ఇప్పుడు ఇంకా మేము చేయగలిగింది ఏమీ లేదని చేతులు దులిపేసుకుంటున్నారు.చేతులెత్తేసిన ఈ స్థితిలో ఆయుర్వేదంలో ఏదైనా మేలు జరుగుతుందేమో అన్న  ఒక్క ఆశ అతనిలో మిగిలి ఉంది.ఇదంతా ఎవరో ఒక వ్యక్తి జీవితపు మనోవ్యధ కాదు.ఇది  ఈ దేశంలో నూటికి పది మంది పడుతున్న ఒక తీవ్రమైన  ఆత్మక్షోభ..

 మన దేశంలో  అత్యధికులు ఎదుర్కొంటున్న ఒక ప్రధాన సమస్య. పురుషుల కన్నా మూడు రెట్లు ఎక్కువగా స్త్రీలు  ఈ వ్యాధి బారిన పడుతున్నారు. అది కేవలం ఒక సమస్య గానే వ్యాఖ్యానిస్తున్నారు. కానీ నిజానికి అది పూర్తిగా మానసికం ఏమీ కాదు. ఈ సమస్యకు జీర్ణవ్యవస్థలో లోపమే అసలు కారణం. ఒకసారి పరిశీలిస్తే మనం తీసుకునే ఆహారం లో జరిగే సంకోచవ్యాకోచాలు  "పెరిస్టాల్సిస్ " ద్వారా జీర్ణమవుతుంది .అయితే కొందరిలో ఈ సంకోచ వ్యాకోచ ప్రక్రియ  అతిగా సాగుతోంది. దీనివల్ల ఆహారం బలవంతంగా లోనికి వెళుతుంది హటాత్తుగా వెళ్లడం వల్లే కడుపు ఉబ్బరంతో పాటు ఇతర సమస్యలు మొదలవుతాయి .అయితే సంకోచవ్యాకోచాలు కొన్నిసార్లు అతివేగంగా సాగిన మరికొన్ని సార్లు అది తక్కువ వేగంతో జరుగుతాయి. అయితే వేగంగా జరిగినప్పుడు విరోచనాలు తక్కువ వేగంతో సాగినప్పుడు మలబద్ధకం మొదలవుతాయి. ఈ సమస్యని ఐబీఎస్  అంటారు. దీనికి మానసిక ఒత్తిడికి లోనైనప్పుడు పేగుల్లో మిలియన్ల కొద్ది ఉండే న్యూరాన్లు ఇలా  ప్రేరేపితం అయినప్పుడు సమస్య తీవ్రమవుతుంది.

 గ్రహణి ఒక కేంద్రంగా...     
        
జీర్ణాశయంలో  గ్రహణి ఒక సూక్ష్మ వ్యవస్థ ఉంటుంది. ఆహారం జీర్ణం చేయడం ఆ తర్వాత ఆహారం లోని రసాయనాలు వ్యర్థాలను వేరు చేయడం చివరికి వ్యర్థాలన్నీ బయటకు పంపడం ఈ  గ్రహణి మౌలిక విధులు.అయితే పేగుల్లో జరగాల్సిన సంకోచ వ్యాకోచ ప్రక్రియ పడినప్పుడు ఈ సమస్య మొదలవుతుంది. సెకండ్ బ్రెయిన్ భూమిక.....          శరీరంలో ఫస్ట్ బ్రెయిన్ సెకండ్ బ్రెయిన్ అంటూ రెండు రకాల బ్రెయిన్ లు ఉంటాయి. ఫస్ట్ బ్రెయిన్ తలలో ఉంటే సెకండ్ రేంజ్ జీర్ణాశయం లో  ఉంటుంది .దీనినే ఆయుర్వేద పరిభాషలో  గ్రహణి అంటారు .సెకండ్  బ్రెయిన్  రోగగ్రస్తమైన అప్పుడే ఐబీఎస్ సమస్య మొదలవుతుంది. ఐబీఎస్ అనేది ప్రాణాంతక వ్యాధి కాదు కానీ జీవితాన్ని దుర్భరం చేస్తుంది. నరక యాతన పెడుతోంది. సెంటర్ బ్రెయిన్ లో ఎందుకు ఈ సమస్య?                     మౌలికంగా ఇది శరీరంలో వాతం ప్రకటితం కావడానికి ఆహార లోపాలు కారణం కావచ్చు ,వృత్తిపరమైన కారణాలు కావచ్చు, ఒకవేళ శరీరానికి మేలు చేసిన ఆహారం తీసుకున్న సరైన విధానంలో తీసుకోక పోయినా అది వాతానికి దారితీయవచ్చు. శరీర వ్యవస్థకు అవసరమైన ఆహారం మీ శరీర ప్రకృతి కి అనువైన ఆహారం ఇవన్నీ ఎంతో ముఖ్యం అవుతాయి .ఎవరైనా అగ్ని అంటే జీర్ణక్రియను పెంచి నాడీ వ్యవస్థను మృదువుగా ఉంచే ఆహారం తీసుకోవాలి.సూక్ష్మంగా చెప్పాలి అంటే వాతాన్ని ప్రకోపం చేసే అన్ని కారణాలు ఐబిఎస్ ను  కలిగిస్తాయి వాత, పిత్త, కఫ దోషాలను, ధాతువులను సామ్య వస్థలో ఉంచి ఆహారపు అలవాట్లు ఉండాలి. ఒకవేళ అందుకు విరుద్ధంగా వెళితే దాదాపు ధాతు క్షయానికి దారితీస్తుంది .ధాతుక్షయం తో  వాతం  ప్రకోపితం అవుతుంది. వాతం ప్రకోపితం అయిందంటే కఫం పెరుగుతుంది. దాంతో సెకండ్ బ్రెయిన్  రోగగ్రస్తమవుతుంది.

ఐబీఎస్ లక్షణాలలో ప్రధానంగా.............................

కడుపంతా పట్టేసినట్లు ఉండడం కడుపులో నొప్పి, ఉబ్బరం, విరోచనాలు ,మలబద్దకం, ఏ మాత్రం నిగ్రహించుకోలేనట్లు  అనిపించిన మరుక్షణం టాయిలెట్ కోసం పరుగులు తీయడం విసర్జనకు ఎన్నిసార్లు వెళ్లినా ఇంకా పూర్తిగా లేదనే భావన మూత్ర విసర్జనలో ను అదుపు లేకపోవడం ఏం తిన్న ఒంటికి పట్టక ,నీరసం ఆవరించడం,పెద్దగా ఏమీ చేయకుండానే విపరీతంగా అలసిపోవడం వంటి లక్షణాలు ఐబిఎస్ లో ప్రధానంగా కనబడతాయి. వాస్తవానికి వాతం అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు. జీర్ణక్రియ కోసం జరిగే సంకోచవ్యాకోచాలు సహజంగా ఉంటే ఏ సమస్యా ఉండదు. హెచ్చుతగ్గులు ఏర్పడినప్పుడు ఏదైనా సమస్య మొదలవుతుంది. కొన్నిసార్లు వాత ప్రకోపం జరిగితే కొన్నిసార్లు వాత క్షయం జరుగుతుంది. సంకోచవ్యాకోచాలు తీవ్రంగా ఉన్నప్పుడు విరోచనాలు అవుతాయి. మందంగా ఉన్నప్పుడు మలబద్ధకం ఏర్పడుతుంది. వీటితోపాటు చాతిలో మంట, మింగడం కష్టం కావడం, రుచి తెలియకపోవడం ,అజీర్తి,వికారం వాంతులు ,పెద్దగా ఏమీ తినకుండానే, కడుపునిండినట్లు కడుపుతో అసౌకర్యంగా అనిపించడం ఎప్పుడు కడుపులో గుడ గుడ మంటూ శబ్దం రావడం పొట్ట భాగాన్ని తాగితేనే నొప్పి అనిపించడం పెద్ద శబ్దంతో అపాన వాయువు విడుదల కావడం ఏం తిన్నా వెంటనే టాయిలెట్ వెళ్లాలనిపించడం ఇవన్నీ ఐబీఎస్ లక్షణాలే కడుపులో ఎడమవైపున పొడిచినట్లు అనిపించడం మలవిసర్జన లో భాగంగా పొడిచినట్లు నొప్పి అనిపించడం మలంలో జిగురు పడటం బరువు తగ్గిపోవడం రక్తంలో పలుచగా రక్తం పడడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఐబీఎస్  జీర్ణాశయానికి ఆవల కూడా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటిలో తలనొప్పి, మైగ్రేన్, ఒంటి నొప్పులు,వెన్నునొప్పి,కండరాల నొప్పులు, వస్తాయి .ఇవన్నీ వాత ప్రకోప లక్షణాలు వీటికి తోడు మూత్రాశయ జననాంగ సంబంధిత సమస్యలు కూడా తలెత్తుతాయి. వాటిలో తరచూ మూత్రం రావడం రుతుక్రమంలో తేడాలు రావడం శృంగార పరమైన అంటే అంగస్తంభన లోపాలు ,శీఘ్రస్థలన సమస్యలు ,శృంగారంలో గానీ, శృంగారం తర్వాత గాని నొప్పి రావడం శృంగారం పట్ల ఆసక్తి తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి .నిర్వచనం మలబద్దకం ఒకదాని వెంట ఒకటి తరచు రావడం వల్ల ఇది అర్శమొలలు దారితీసే అవకాశాలు చాలా ఎక్కువ అంతకన్నా మించి పోషకాలేవీ అందక సప్త ధాతువులు క్షీణిస్తాయి.

 అగ్ని/ జఠరాగ్ని...................

ఆహార పదార్థాలు కడుపులోని జీన్ ఆశయాలతో కలిసినపుడు శక్తి  ఉత్పన్నమవుతుంది. ఆసక్తితోనే సప్తధాతువులు ప్రాణం పోసుకుంటాయి అంతకన్నా మించి వ్యాధి నిరోధక శక్తి ఓజస్సు పుడతాయి మొత్తం చూస్తే ఆహారాన్ని శారీరక శక్తిగా మార్చడంలో లో అగ్ని మూల కర్తగా ఉంటుంది. ఈ అగ్ని సహజంగా ఉంటే సప్తధాతువులు సవ్యంగా ఉంటూ దివ్యంగా పనిచేస్తుంది ఇది ఇది వికృతంగా  మారితే శరీరం రోగాల పుట్ట అవుతుంది. అగ్ని మంద్యం ఏర్పడితే శరీరంలో లో ఆమెను నిలిచిపోతుంది. దీనివల్ల స్రోతస్సులు అవరోధం ఏర్పడుతుంది .ఈ అవరోధం తో  ధాతుక్షయం ఏర్పడుతుంది. ధాతుక్షయంతో వాతప్రకోపం జరిగితే పిత్తం, కఫం కూడా పెరిగి శరీరం రోగగ్రస్తమవుతుంది .ఆహార కారణాలతో జీర్ణ వ్యవస్థ దెబ్బ తింటే అది నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది .అది హార్మోన్ వ్యవస్థను దెబ్బతీస్తుంది. ఫలితంగా ఇమ్యూనిటీ దెబ్బతింటుంది. వాస్తవానికి 70 శాతం వ్యాధిని రోధక వ్యవస్థ జీర్ణాశయం మీదే కేంద్రీకృతమై ఉంటుంది.

 ఆగ్నేయ చికిత్స........

జీర్ణ వ్యవస్థను కేంద్రంగా చేసుకొని ని ఉత్తేజితం చేయడమే ప్రధాన లక్ష్యంగా పని చేయడం వల్లే ఆయుర్వేద చికిత్సలను ఆగ్నేయ చికిత్సలు అంటారు .అగ్ని కి అంత ప్రాధాన్యత నివ్వడానికి 70 శాతం వ్యాధి నిరోధక శక్తి ఇ జీర్ణ వ్యవస్థ మీద ఆధారపడి ఉండటమే అందుకు కారణం అగ్ని ప్రకృతి సహజ  స్థితికి చేర్చడానికి దీపన పాదన చికిత్సలు లంఘన చికిత్సలో చేస్తాం. అదే సమయంలో శరీరంలోని సమస్త కణజాలంలోని ఆమాన్ని తొలగించడానికి వాత పిట్ట కఫాలను సప్త ధాతువులను సామ్యవాద వ్యవస్థ లో కి తీసుకురావడానికి సరమైన అన్ని థెరపీలు ఆయుర్వేదంలో ఉన్నాయి. వ్యాధి తాలూకు ఏదో ఒక లక్షణాన్ని తొలగించడం కాదు వ్యాధి బహుముఖాలుగా విస్తరించిన సిండ్రోమ్ ను  తొలగిస్తుంది .రోగగ్రస్తమైన సెకండ్ బ్రెయిన్  అర్థం చేసుకొని దానికి చికిత్స చేయడం కీలకమవుతుంది. ఐ బి ఎస్ అనగానే అది ఫస్ట్ బ్రెయిన్ కు  సంబంధించిన పూర్తిస్థాయి మానసిక సమస్య గానే అత్యధికులు పొరబడుతున్నారు. అందుకే వారికి అందించే చికిత్స ఫలవంతం కావడం లేదు వాస్తవానికి ఇది జీర్ణాశయంలో కేంద్రంగా ఉండే సెకండ్ హ్యాండ్ సమస్య ఈ కేంద్రానికి చికిత్స చేయడానికి పూనుకోవడం వల్ల ఆయుర్వేదం అద్భుత ఫలితాలు సాధిస్తోంది తాత్కాలికంగా కాదు సమస్యను శాశ్వతంగా తొలగిస్తుంది .ఆయుర్వేదం రోగగ్రస్తమైన శరీరాన్ని ఒక నిండు ఆరోగ్య శిల్పంగా మార్చివేస్తోంది మరొక సంపూర్ణ జీవితాన్ని జీవించేలా పరిపూర్ణంగా సహకరిస్తుంది.




డాక్టర్ వర్ధన్
MD (Ayu): Ph.D: MS (C&P)
Founder & Chief Physician
ఫోన్ : 9056959595

హైదరాబాద్ బ్రాంచీలు : బషీర్బాగ్ ,తార్నాక , బంజారాహిల్స్
ఏపీ బ్రాంచీలు : విజయవాడ , తిరుపతి ,కర్నూల్ , రాజమండ్రి



Comments