సయాటికా నుంచి సంపూర్ణ విముక్తి |What Is Sciatica | Ayurvedic Treatment for Sciatica | Best Ayurveda Hospital | VardhanAyurveda



సయాటికాతో వేగలేక శస్త్రచికిత్సకు వెళ్దామంటే చేయించుకున్న వాళ్ళు మాత్రం పొందిన సుఖమెంత ? అల్లోపతి వైద్యులేమో ముందు పెయిన్ కిల్లర్స్ అనీ, తర్వాత శస్త్రచికిత్స తప్ప మరో మార్గమే లేదంటారు .సయాటికా అన్నది కండరాలు, నరాలు బిగుసుకుపోవడమో ,బిగువు కోల్పోవడం వల్లో తలెత్తే  సమస్య. ఈ స్థితిలో ఆయుర్వేద చికిత్సలతో కండరాలను,  నాడీ వ్యవస్థను సాధారణ స్థితికి తేవాలి గానీ , శస్త్రచికిత్స ద్వారా ప్రయోజనమేది  ఉండదంటున్నారు  ఆయుర్వేద వైద్య నిపుణులు.. డాక్టర్ వర్ధన్.. డాక్టర్ మాధురీ వర్ధన్..

సయాటిక అనగానే ఓ నెల రోజులు విశ్రాంతి తీసుకోమని ఎంత అలవోకగానో  చెప్పేస్తారు. నిజమే, విశ్రాంతి శరీరం మీద పడుతున్న ఒత్తిడిని దూరం చేస్తుంది. ఉపశమనమూ కనిపిస్తుంది .కానీ,విశ్రాంతి మానేసిన తరువాత మాటేమిటి? మళ్ళీ పరిస్థితి మొదటికి రావడమే గా. ఏ పని లేకుండా ఎల్లకాలమూ  ఎవరు  ఉండిపోలేరు  కదా..
మూడు నాలుగు  రోజుల విశ్రాంతిని ఆయుర్వేదం చెబుతుంది. కానీ ఇతర వైద్య విధానాలు చెప్పినట్లు ఏకంగా నెల రోజులు మంచాన పడి ఉండమని చెప్పదు. అలా చేస్తే కండర వ్యవస్థ, నాడీ వ్యవస్థ అంత అచేతనంగా మారిపోతుంది. చికిత్సా విధానంలో మరో భాగంగా పెయిన్ కిల్లర్స్ సూచిస్తారు .ఒకటి రెండు రోజులైతే సరేగాని  ,పెయిన్ కిల్లర్స్ ఎక్కువ రోజులు వాడితే కలిగే దుష్ప్రభావాలు తక్కువేమీ కాదు .అసిడిటీ ,అల్సర్లే  కాదు. ఏళ్ల పర్యంతం కొనసాగిస్తే నపుంసకత్వం వచ్చే ప్రమాదం కూడా ఉంది. అందుకే ఆయుర్వేద చికిత్సలో పెయిన్ కిల్లర్స్  అన్న భావనే  లేదు. సయాటికాకు మూలకారణమైన వాతాన్ని హరించే చికిత్సలే ఇక్కడ ప్రధానమవుతాయి. దానికి బాహ్య చికిత్సలే  కావచ్చు. కడుపులోకి ఇచ్చే ఔషధ ఔషధాలే కావచ్చు . ఇవన్నీ వాతాన్ని ఆయుర్వేదానికి పరమ లక్ష్యం గా ఉంటుంది.

మళ్లీ చైతన్యపరిచి...

 అల్లోపతి విధానంలో చేసే ఫిజియోథెరపీ కి ,ఆయుర్వేదంలో లో చేసేది మర్మ చికిత్సల కూ  ఒక ప్రధానమైన తేడా ఉంది. ఫిజియోథెరపీ కండరాల వ్యవస్థ మీద మాత్రమే పని చేస్తుంది. అది కండరాల శక్తిని కాస్త  పంచడానికి తప్ప,లిగమెంట్లు,టెండాన్లు , వెన్నుముక, నాడీ వ్యవస్థకు పోషకాలను అందించే విధానమేది  ఇతర వైద్య  విధానాలలో లేదు.ఆలా అందించడంలో  ఆయుర్వేదంలోని పంచకర్మ చికిత్సలు ,మేరు  చికిత్సలు ,పునరుజ్జీవ చికిత్సలు శక్తివంతంగా పనిచేస్తాయి .ఇవి కండరాల వ్యవస్థ తో పాటు,నది వ్యవస్థనూ , వెన్నుముక ఆరోగ్యాన్ని కాపాడే దిశగా పని చేస్తాయి .

డిస్కుల  మధ్య దూరం తగ్గి పోవడం వల్ల సయాటికా నరం ఒత్తిడికి గురికావడం వల్ల తలెత్తే సమస్య కావడం వల్ల సయాటికా సమస్య నివారణకు ఆ  డిస్కుల దూరాన్ని తిరిగి పెంచడమే పరిష్కారం అవుతుంది. అది ఆయుర్వేద చికిత్స  సాధ్యమవుతుంది. తాత్కాలిక చికిత్సలతో సరిపెడితే కండరాల్లో ఒక ఆసవకార్యం  ఏర్పడి వాతం పెరుగుతుంది . దీనివల్ల కండరాలు చేసే సహజ ధర్మాన్ని అవి సక్రమంగా నిర్వహించలేకపోతాయీ అంటే పూర్తిగా బిగుసుకు పోవడం లేదా బిగువు కోల్పోవడమో జరుగుతుంది. ఇది కదలికలు లేకుండా చేసి జీవిత గమనాన్నే స్తంబింపజేస్తుంది .

సర్జరీ లేకుండానే...

 నిజంగానే శస్త్రచికిత్స అవసరం ఉన్నవారు 5 శాతానికి మించి ఉండరు. కానీ, 95 శాతం మందికి ఈ శస్త్ర చికిత్సలు చేసేస్తున్నారు. అయితే కనీసం వారు ఐదు శాతం మందికైనా  పూర్తిగా నయమవుతుందనే గ్యారంటీ ఇవ్వలేకపోతున్నారు .వెన్నెముక వ్యవస్థ అత్యంత సంక్లిష్టమైనది .ఆ వ్యవస్థలో కి కత్తి ఏ కాస్త పక్కకు జరిగిన పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంది. ఒక్కోసారి  పూర్తిగా మంచాన పడే ప్రమాదం ఏర్పడవచ్చు. చాలా మంది సయాటికా బాధితులు శస్త్రచికిత్స జరిగిన కొద్ది రోజులు సంతోషంగా ఉంటారు. ఇక కొలు కుంటున్నాడు లే అనుకున్న సమయానికి మళ్లీ నొప్పి మొదలవుతుంది. రోజు రోజుకు భరించలేనంత తీవ్రం గా మారుతుంది.ఆయుర్వేద చికిత్సలు  ఇందుకు పూర్తిగా భిన్నమైనవి . శస్త్రచికిత్సల  అవసరం లేకుండానే మొత్తం శరీర వ్యవస్థను సాధారణ స్థితి కి తెచ్చే  సమర్థవంతమైన విధానాలు ఇందులో ఉన్నాయి. ఆయుర్వేద చికిత్సలో భాగంగా ఆహారపు అలవాట్లలో మార్పులు, జీవనశైలి మార్పులతో ఉంటుంది. నిజానికి జీవనశైలి మార్పులకు కూడా అత్యంత ప్రాధాన్యత ఉంటుంది .నిజానికి జీవనశైలి మార్పులే ఆ సమస్య మరోసారి రాకుండా కాపాడతాయి .


  ఆ తర్వాత యోగా

 సయాటికా సమస్యను తాత్కాలిక చికిత్సలతో సరిపెడితే కండరాల్లో ఒక అసౌకర్యం ఏర్పడి వాతం  పెరుగుతుంది. దీనివల్ల కండరాలు చేసే సహజ ధర్మాన్ని అవి సక్రమంగా నిర్వహించలేక పోతాయి. అంటే పూర్తిగా బిగుసుకుపోవడమో  లేదా బిగువు కోల్పోవడమో  జరుగుతుంది. ఇది కడలికలే లేకుండా చేసి జీవితగమనాన్ని స్తంబింపచేస్తుంది .

 వెన్ను నొప్పి లేదా సయాటికా ఉందని చెప్పగానే కొందరు యోగాభ్యాసాన్ని సూచిస్తారు. నిజానికి శరీర వ్యవస్థ ఆరోగ్యంగా స్థిరంగా ఉన్న వారికి యోగా  ఉపకరిస్తుందే  తప్ప అప్పటికే బాగా దెబ్బ తిన్న వాళ్లకు కాదు. అప్పటికే నరం ఒత్తుకుపోయి సయాటికతో బాధపడుతున్న సమయంలో యోగాసనాలు వేసే పరిస్థితి మరింత విషమిస్తుంది. వైద్య చికిత్సలతో ఆ సమస్య తగ్గిపోయిన తర్వాతే  యోగా చేయాలి  తప్ప సమస్య తో  ఉన్నప్పుడు కాదు.

 ఇవి  చికిత్సలు

 ఆయుర్వేద చికిత్సల్లో బాహ్య చికిత్సలు ,అంతర చికిత్సలు అంటూ  ప్రధానంగా రెండు రకాలు. వీటిలో శరీరంలో పేరుకుపోయిన కల్మషాలను తొలగించేందుకు చేసే పని చేసే పంచకర్మ చికిత్స ,వెన్ను ,నాడీ వ్యవస్థను శక్తివంతంగా  చేసే  మేరు చికిత్స ప్రధానంగా ఉంటాయి. వీటితో పాటు అభ్యంగం ,స్వేదం ,ఎలకిడి, శస్య కర్మ, విరోచన ,వస్తికర్మలు ,నవరకడి,  సర్వాంగ ధార వంటి చికిత్సలు ఉంటాయి. సమస్య తీవ్రతను  అనుసరించి వాటిలో ఏ చికిత్సలు అవసరమో నిర్దారిస్తాం . ఈ చికిత్సలో భాగంగా చేసే వస్తికర్మ అనే చికిత్స సమస్య తిరిగి రాకుండా కాపాడుతుంది. శస్త్ర చికిత్స చేయించుకుంటే సమస్య మళ్లీ వస్తుంది .ఆయుర్వేద చికిత్స చేయించుకొని ఆ తర్వాత జీవనశైలిని కూడా చక్కదిద్దకుంటే సమస్య తిరిగి వచ్చే అవకాశమే లేదు.ఇప్పుడున్న వెన్నునొప్పి, సయాటికా నొప్పి మాత్రమే కాదు. ముందు ముందు మరెన్నో వ్యాధులు రాకుండా నివారించడం కూడా సాధ్యమవుతుంది.

లైంగిక సమస్యలకు విరుగుడు

సయాటికా సమస్య తో బాధపడుతున్న వారిలో చాలామంది తాము చేస్తున్న వృత్తికి ,ఇతర వ్యాపకాలకూ దూరమవుతాయి .  ఇది చాలా మందిని తీవ్రమైన డిప్రెషన్ కు  గురి చేస్తుంది. శారీరక మానసిక ఒత్తిడులు, ఈ  డిప్రెషన్ వల్ల శరీరంలో ఎడ్రినల్  హార్మోన్లు అధికంగా ఉత్పన్నమవుతాయి. విషకారకమైన  వీటికి నాడీ వ్యవస్థను దెబ్బ తీసే గుణం  ఉంది.పైగా గుండె వేగం ,శ్వాస వేగం పెరిగి శరీరంలో కీలక భాగాలన్నీ దెబ్బతింటాయి .కిడ్నీ ,లివర్,క్లోమగ్రంధి  దెబ్బతిని  అధికరక్తపోటు, మధుమేహం కి దారి తీసే ప్రమాదం ఉంది .నాడీ వ్యవస్థ దెబ్బతినడం వల్ల జననాంగాలకు రక్తప్రసరణ తగ్గుతుంది .దీని వల్ల అంగస్తంభన సమస్యలు  మొదలవుతాయి. కొందరికి స్కలన సమయంలో ఆ  తీవ్రమైన నొప్పి కలుగుతుంది. సయాటికా సమస్యలు ఉన్న స్త్రీలకు శృంగారంలో పాల్గొనడం బాధాకరంగా ఉంటుంది .అంతిమంగా ఇది దాంపత్య సంబంధాలనే  దెబ్బతీసే ప్రమాదం ఉంది. ఒక ఒకరకంగా సయాటికా సమస్యను నిర్లక్ష్యం చేయడం అంటే దాంపత్య బంధాలను కూల్చేసుకోవడం . అయితే ఈ చికిత్స లైన తాత్కాలిక ఉపశమనాన్ని ఇచ్చే ఇచ్చేవిగా కాకుండా శాశ్వత పరిష్కారాన్ని ఆయుర్వేద చికిత్సలను ఆశ్రయించడం ఉత్తమం.



డాక్టర్  మాధురి  వర్ధన్   
MD (Ayu) (Gynecologist & Infertility Specialist)
ఫోన్  : 9056959595

హైదరాబాద్ బ్రాంచీలు :  బషీర్బాగ్ ,తార్నాక , బంజారాహిల్స్ 
ఏపీ బ్రాంచీలు : విజయవాడ , తిరుపతి ,కర్నూల్ , రాజమండ్రి 

Comments