ఐబిఎస్ నరకానికి గుడ్బై....... | Ayurvedic Treatment For IBS | Reasons And Treatment For Irritable Bowel Syndrome | Vardhanayurveda
ఏ మనిషి అయినా ఒక ప్రవాహంలా దూసుకుపోవాలని అనుకుంటాడు. కానీ అస్తమనం టాయిలెట్లో చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడితే, జీవితం శిధిలమై పోవడం తప్ప ముందుకు సాగేది ఏముంది . ఐబి ఎస్ తో ఎదురయ్యే సమస్యే అది. ఏదో తెలిసిన డాక్టర్ కదా అనుకొని వెళితే ఐబిఎస్ ను జీవితాంతం వెంటాడే సమస్యగా చిత్రిస్తున్నారు. అయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. యాది మూలాన్ని గుర్తించిన ఆయుర్వేదం ఐబిఎస్ నుంచి సమూలంగా శాశ్వతంగా విముక్తిని కలిగిస్తుందని అంటున్నారు. ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ వర్ధన్.
వాస్తవానికి IBS లేదా గ్రహణి అనేది ఒక వ్యాధి కాదు. అది పలు రకాల లక్షణాలన్నీ కలసి సంయుక్తంగా బయటపడే ఒక శారీరక విపరిణామం. అయితే ఏదో నాలుగు రోజులు అజీర్తిగా అనిపించి, విసర్జన లో ఏదో తేడా వచ్చి, కడుపులో కాస్త నొప్పి అనిపించగానే అది ఐబీఎస్ఏ నని ఒక నిర్ధారణకు రావడం లో అర్థం లేదు. కడుపులో ఏదైనా గాయం గాని, లేదా మరేదైనా వ్యాధి గానీ లేకుండానే కడుపులో ఒక అలజడి మొదలవడం ఈ వ్యాధి లక్షణం. ఒకరోజు విరోచనాలు, ఆ మరుసటి రోజు మలబద్దకం, కడుపులో నొప్పి, ఏదో అసౌకర్యంగా అనిపించడం, అలా నెలకు మూడు సార్లు కన్నా మించి, మూడు మాసాలకు పైగా, ఈ సమస్య కొనసాగిన అప్పుడే దాన్ని ఐ బి ఎస్ గా గుర్తిస్తారు. కాకపోతే అల్లోపతిలో వ్యాధిని గుర్తించడం తప్ప దాన్ని సమూలంగా తొలగించే వైద్యం ఈనాటికీ లేదు. ఎంతసేపు శరీర నిర్మాణాల్లో వచ్చే తేడాల సరిచేయడానికి పరిమితమవుతారు గాని, శరీరంలోని క్రియాత్మక లోపాన్ని సరి చేసే విధానం వారి వద్ద లేనేలేదు. అందుకే ఐబీఎస్ బాధితులకు ఆయుర్వేదమే శరణ్యం అవుతోంది.
ఏమిటా మర్మం........
విశ్వానికి. అగ్ని విరజిమ్మే సూర్యుడు ఎలా కేంద్రబిందువో , శరీరానికి మీ జఠరాగ్ని అంతటి కేంద్రబిందువు. మౌలికంగా అగ్ని ప్రాణ శక్తిని ఇస్తుంది. అగ్ని శక్తిని ,వర్ణాన్ని ,ఆరోగ్యాన్ని, ఉత్సాహాన్ని ,శరీరానికి కాంతిని, మనసుకు శాంతి ని ఇస్తుంది. అగ్ని తేజస్సును అన్నింటినీ మించి అగ్ని ఓజస్సును ఇస్తుంది. అగ్ని అంటే జఠరాగ్ని పెరగడమే కాదు ,అగ్ని మొత్తం జీర్ణవ్యవస్థను సమగ్రంగా నిలబెడుతుంది. అయితే ఒకవేళ అందుకు విరుద్ధంగా అగ్ని మద్యం ఏర్పడిందా? ఒక ఐపీఎస్ మాత్రమే కాదు శరీరం సర్వ రోగాలకు నిలయం అవుతుంది.
ఐబీఎస్ అంటే ఏమిటి?
IBS అంటే చాలామంది ఇది psychosomatic డిసార్డర్ అనే మాటకే పరిమితం చేస్తారు. అలాగే ఇది కేవలం బ్రెయిన్ కు సంబంధించిన సమస్యగానే పేర్కొంటూ వచ్చారు. అందరూ అంటున్నట్లు బ్రెయిన్ కు సంబంధించిన విషయమే. కాకపోతే ఫస్ట్ బ్రెయిన్ కాదు సెకండ్ బ్రెయిన్ కు సంబంధించిన విషయం. సెకండ్ బ్రెయిన్ అనేది మానసికమైన అదేమీ కాదు. ఇది జీవ వ్యవస్థకు సంబంధించిన ఒక ఫంక్షనల్ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ డిసార్డర్ సమస్య. అంతకు ముందు ఉన్న ఐపీఎస్ సమస్యకు మానసిక ఒత్తిళ్లు తోడైతే ఎక్కువ అవుతుంది గాని, మానసిక ఒత్తిళ్లతో ఐపిఎస్ ఎప్పుడు రాదు.
లక్షణాల్లో ప్రధానంగా...
కడుపులో నొప్పి ఐ బి ఎస్ లోని ఒక ప్రధాన లక్షణం. చాలా మందిలో ఈ నొప్పి కడుపు లో ఎడమ బాగానే వస్తుంది. సోదరుల బొడ్డు కింద లేదా పైభాగంలో రావచ్చు. నొప్పితో పాటు కడుపు ఉబ్బరం కూడా ఉంటుంది. కొన్నిసార్లు ఈ నొప్పి వచ్చినట్టే వచ్చి దానికదే తగ్గిపోతుంది. కొన్నిసార్లు ఆపానవాయువు విడుదలతో తగ్గిపోతుంది. మరి కొన్నిసార్లు నొప్పి తీవ్రమై టోయిలెట్ వెళ్తే గాని తగ్గదు. కొద్ది రోజులు దాకా విరోచనాలు అవుతూ ఆ తర్వాత మలబద్ధకం కొనసాగుతుంది. కొన్నిసార్లు విరేచనాలు మలబద్ధకం ఒకదాని తరువాత ఒకటిగా వేధిస్తాయి. ఆ తర్వాత కొద్ది రోజులు విరామం ఇచ్చి మళ్లీ యథావిధిగా సమస్య తీవ్రమవుతుంది. తినేది వంట పట్టక ఐపీఎస్ బాధితులు రోజురోజుకు బాగా నీరసించి పోతారు తలనొప్పి వీటిని తరచూ వేధించే సమస్యలు. వీటితో పాటే వెన్ను ,కండరాలు నొప్పి ,నిద్రలేమి వంటి శారీరక కారణాలతోపాటు అసహనం, చిరాకు ,కోపం, దిగులు, ఆందోళన ,డిప్రెషన్ ,వంటి వి కూడా వీరిని కుంగదీస్తాయి.స్త్రీలలో ఈ వ్యాధి కారణంగా శృంగారంలో నొప్పి శృంగారం పట్ల ఆసక్తి లేకపోవడం వంటివి కనిపిస్తాయి. పురుషుల్లో అయితే అంగస్తంభన లోపాలు, శీఘ్రస్కలన సమస్యలు కూడా మొదలవుతాయి.
చికిత్సలో భాగంగా IBS సమస్యను సమూలంగా తొలగించే దానికి అగ్ని ఉత్తేజితం చేయడం ఒక్కటే మార్గం. ఆయుర్వేదంలోని ఆగ్నేయ చికిత్సలతో అదే జరుగుతుంది. చికిత్సలో భాగంగా, దీపన పాచన చికిత్సలు, అమహార చికిత్సలు, దోష ,ధాతు ,మల సామ్యత చికిత్సలు ఉంటాయి. శరీరం ,మెదడు, మనసును ఈ మూడింటినీ శక్తివంతం చేసే చికిత్సలు ఉంటాయి. ఒకటేమిటి? IBS కు సంబంధించిన సమస్త భయాలను పోగొట్టి ఆయుర్వేదం ఒక గొప్ప పాజిటివ్ అవుట్ లుక్ ను అందిస్తుంది. నేల పాలైన జీవితాన్ని ఒక మహావృక్షంలా నిలబెడుతుంది.
డాక్టర్ వర్ధన్
MD (Ayu): Ph.D: MS (C&P)
Founder & Chief Physician
ఫోన్ : 9056959595
హైదరాబాద్ బ్రాంచీలు : బషీర్బాగ్ ,తార్నాక , బంజారాహిల్స్
ఏపీ బ్రాంచీలు : విజయవాడ , తిరుపతి ,కర్నూల్ , రాజమండ్రి
Comments
Post a Comment