ఐ బి ఎస్, ఐ బి డి వ్యాధుల నుంచి సంపూర్ణ విముక్తి..... | Ayurvedic Treatment For IBS,IBD | VardhanAyurveda | Dr.VARDHAN



పెద్దపేగులో కంపరం పుట్టించే ఐ బి ఎస్ వ్యాధి గురించిన అవగాహన కొంతమేరకు ఇప్పటికే కొంత కలిగింది. అయితే ఐపీఎస్ పోలికలే ఎక్కువగా ఉండి ఐ బి డి వ్యాధి గురించి కూడా తెలియడం ఎవరికైనా చాలా అవసరం. ఈ రెండింటి మధ్య ఉండే ప్రధాన వ్యత్యాసం గురించి తెలియడం ముఖ్యం. ఐపీఎస్ లో పెద్ద పేగు పనితీరు, దాని ప్రవర్తన మారిపోతాయి. అది సహజ ధర్మం నుంచి వైదొలగి పోతుంది. ఐ బి డి లో నేమో నోటి నుంచి మలద్వారం దాకా ఉండే పెద్దపేగు, చిన్న పేగుల్లో వాపు ఏర్పడుతుంది. మనలోని కణాలు ఒక దాని మీద ఒకటి ఎదురు తిరగడం మనలోని  వ్యాధి నిరోధక శక్తి కి, వ్యతిరేకంగా పనిచేయడం ఈ వ్యాధికి ప్రధాన లక్షణాలు.

ఒకే తరహా లక్షణాలు.......

ఐ  బి ఎస్ లోను, ఐ బి డి లోనూ ఒకేలా కనిపించే కొన్ని లక్షణాలు ఉన్నాయి. వాటిలో కడుపు ఉబ్బరం కడుపు నొప్పి, నాలుగు రోజులు మలబద్ధకం, నాలుగు రోజులు విరోచనాలు,ఇలా నిరంతరం వేధిస్తూ ఉంటాయి. దీనికి తోడు కొన్ని సార్లు విసర్జనకు ఎన్నిసార్లు వెళ్లినా ఇంకా పూర్తిగా విసర్జన కాలేదన్నా బాగానే ఉండటం ఇందులోని మరో లక్షణం. వీటికి తోడు తీవ్ర నిరసం ఉంటుంది. తీవ్రమైన తలనొప్పి ,కణతల  నొప్పి ఉంటాయి. అంతకు ముందే మైగ్రేన్ తలనొప్పి ఉంటే అది క్రమక్రమంగా తీవ్రమవుతుంది ఉంటుంది. అజీర్తి ,పేగుల్లో కంపరం ,అసౌకర్యం, ఆ కారణంగా వచ్చే ఒక అసహనం, కోపం ,దిగులు, భయం, న్యూరోసిస్ రకరకాల ఫోబియలు మానసికమైన కుంగుబాటు ఇవన్నీ ఇందులో భాగం అవుతాయి. ఇవే కాకుండా కడుపులో మంట, గుడ గుడమని శబ్దాలు కడుపులో పుండ్లు ఏర్పడటం, జిగట పదార్థం రావడం ఉంటాయి.బరువుగా బాగా తగ్గిపోవడం కీళ్లనొప్పులు ఒంటి నొప్పులు నిద్రలేమి కడుపులోని ఆమ్లాలు పైకి yegadannukoche జి. ఇ. ఆర్ . డి ఇవన్నీ ఉంటాయి. ఐబి ఎస్ లోనూ ,ఐ బి డి లోనూ ఈ లక్షణాలు అంతే సమానంగా ఉంటాయి. అయితే ఐబిఎస్ తో ప్రాణాలకు ముప్పు ఏర్పడే పరిస్థితి ఏది ఉండదు కానీ, ఐ బి డి   లో ఏర్పడే వాపు, అల్సర్ల వల్ల తీవ్రమైన రక్తస్రావం ఏర్పడి ప్రాణాపాయ స్థితి కూడా ఏర్పడవచ్చు. ఐ బి డి వ్యాధి దీర్ఘకాలం కొనసాగితే క్యాన్సర్ వ్యాధిగా మారే ప్రమాదం కూడా ఉంది.

 క్రాన్స్ ,అల్సరేటివ్ కొలైటిస్.......

ఐ బి డి వ్యాధి లో భాగంగా, క్రాన్స్ అల్సరేటివ్ కొలైటిస్ అని రెండు రకాల వ్యాధులు కూడా వస్తూ ఉంటాయి. క్రాన్స్ వ్యాధి లో నోటి నుంచి మలద్వారం దాకా ఉండే పేర్లలో ఏ భాగంలోనైనా వాపు ఏర్పడవచ్చు. కాకపోతే చాలా మందిలో చిన్న పేగులో, పెద్దపేగు ప్రారంభంలో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది. అల్సరేటివ్ కొలైటిస్ వ్యాధి లో మాత్రం పెద్దపేగులోను ,విసర్జక భాగంలోనూ అల్సర్లు ఏర్పడతాయి. దీని వల్ల రక్తస్రావం ఆవుతుంది. ఆ రక్తం ఎక్కువగా నలుపు రంగులో కనిపిస్తుంది. బరువు తగ్గడం నీరసం కడుపు నొప్పి ఇలా ఐబిఎస్ లో కనిపించే లక్షణాలన్నీ ఈ క్రాన్స్ లోనూ, అల్సరేటివ్ కొలైటిస్ లో కనిపిస్తాయి.

ఆయుర్వేద విశిష్టత.....

వాస్తవానికి నోటి నుంచి విసర్జక స్థానం దాకా తలెత్తే అన్ని సమస్యలను తొలగించడానికి మౌలికంగా అగ్ని చికిత్స అవసరం అవుతుంది. మనం తీసుకునే ఆహారం పూర్తిస్థాయిలో జీర్ణమై అది సప్తధాతువులు గా ఏర్పడడం చాలా అవసరం. వాత, పిత్త, కఫాలనే దోషాలు, సప్తధాతువులు సమస్థితిలో ఉన్నప్పుడే ఎవరైనా సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు. అందుకే దోషాలను ధాతువులను సామ్యవస్థకు, తీసుకురావడమే ప్రధాన లక్ష్యంగా ఆయుర్వేదం పనిచేస్తుంది. ఈ చికిత్సలో భాగంగా అగ్ని దీపన చికిత్స, గ్రహణ చికిత్స , బృహ్మణ చికిత్స చేస్తాం. ఇవన్నీ చేయడం ద్వారా దోషాలు, ధాతువులు, మనస్సు, ఇంద్రియాలు, సమస్థితికి వచ్చేస్తాయి. ఒక నిష్ణాతుడైన ఆయుర్వేద వైద్యుని సంప్రదిస్తే పూర్తి విముక్తి పొందడం ఖాయం.



డాక్టర్  వర్ధన్  
MD (Ayu): Ph.D: MS (C&P)
Founder & Chief Physician
ఫోన్  : 9056959595

హైదరాబాద్ బ్రాంచీలు :  బషీర్బాగ్ ,తార్నాక , బంజారాహిల్స్
ఏపీ బ్రాంచీలు : విజయవాడ , తిరుపతి ,కర్నూల్ , రాజమండ్రి


Comments