లివర్ వ్యాధుల నుంచి తప్పించే పెద్దదిక్కే ఆయుర్వేదం || కాలేయ వ్యాధుల కు ఆయుర్వేద చికిత్సలు | Ayurvedic Treatment For Liver Disease || Dr Vardhan
లివర్ దెబ్బతింటే శరీరానికి పవర్ ఎక్కడిది? దురదృష్టవశాత్తూ, ఆధునికుల్లో లివర్ జబ్బులు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఫ్యాటీ లివర్ సమస్యలు, హెపటైటిస్, అసైటిస్, లివర్ సిర్రోసిస్, లివర్ క్యాన్సర్ వంటి సమస్యలు నిజంగా అత్యధికులు కలవరపెడుతున్నాయి. ఎక్కువ మంది ఆశ్రయించే ఆధునిక వైద్య విధానాలు ఇంతకూ ఈ సమస్యకు చేస్తున్నదేమిటి? ఏవో కొద్ది రోజులు మందులివ్వడం వాటితో సమస్య పూర్తిగా ఎప్పుడూ పోదు కాబట్టి చివరగా చేతులు ఎత్తేయడమో లేదా లివర్ మార్పిడి గురించి మాట్లాడటమో ఆనవాయితీగా మారింది. కాలేయ సమస్యలకు అసలు కారణమైన అగ్ని లోపాలను సరి చేయకుండా కాలేయం ఎలా బాగుపడుతుంది? అందుకే అగ్ని చికిత్సలతో లివర్ సమస్యల్ని సమూలంగా నిర్మూలించే ఆయుర్వేదం తప్ప మరో మార్గం లేదు.
ఆయుర్వేదం ఏం చేస్తుంది?
నిజానికి ఆహారం సప్తధాతువులుగా మారడానికి కాలయమే సింహద్వారం. కాలయమే తన విధుల్ని సరిగా నిర్వర్తించలేకపోతే ఆమం అంటే వ్యర్థ, విషపదార్థాలు పేరుకుపొతాయి. ఈ స్థితిలో మలబద్ధకం, అజీర్తి, నీరసం, నిస్సత్తువ మధుమేహం, అలర్జీలు, కొలెస్ట్రాల్ నిలువలు పెరిగి పోవడం వంటి సమస్యలు మొదలవుతాయి. పరిస్థితి ఇంకా విషమిస్తే, జాండీస్,హెపటైటిస్, లివర్ సిర్రోసిస్, లివర్ కేన్సర్ వంటి జబ్బులు మొదలవుతాయి. సాధారణంగా, లివర్ లో ఏ సమస్య వచ్చినా తిరిగి తనను తానే చక్కబరుచుకునే శక్తి లివర్ కు ఉంది. కాకపోతే ఆ స్థితికి రావడానికి కొంత సమయం ఇవ్వాలి. ఆయుర్వేదం దానికి అండగా నిలవాలి. నిజానికి ఫ్యాటీ లివర్ నుంచి మొదలుకుని హెపటైటిస్ దాకా, జాండిస్ నుంచి లివర్ సంబంధిత సమస్త సమస్యల దాకా సంపూర్తిగా నయం చేసే శక్తి వంతమైన మందులు ఆయుర్వేదం లో ఉన్నాయి.
మూలం ఎరిగిన వైద్యమిది
లివర్ సమస్యలన్నిటికీ మూల వైద్యం ఆయుర్వేదం. ఇది మందు జఠరాగ్నిని పెంచి జీర్ణశక్తిని సహజ స్థితికి తెచ్చే ప్రక్రియల్ని చేపడుతుంది. ఆ క్రమంలో సప్తధాతువుల్ని పరిపుష్టం చేస్తుంది. అంతిమంగా ఓజస్సును ఉద్దీపనం చేస్తుంది. ఇందులో భాగంగా అగ్నిస్థానాలకు చికిత్స చేయడం కూడా అవసరం. అగ్నిస్థానాలు అంటే ప్లిహమూ, కాలేయాలే. ఈ రెండు తిరిగి సహజ స్థితిలో పని చేయడానికి వీలుగా శరీరంలోని ఆమ్లాన్ని తొలగించే చికిత్సలు చేయాలి. ధాతు సామ్యతకే కాకుండా ధాతు పుష్టికి దోహదం చేసే చికిత్సలు కూడా చేయాలి. మొత్తంగా చూస్తే ఆగ్నేయ చికిత్సలు చేయాలి. అయితే, కాలేయం తిరిగి పనిచేసేందుకు అన్నట్టు కొన్ని నామమాత్రపు చికిత్సలు చేసి అంతిమంగా లివర్ మార్పిడి దిశగానే ఆధునిక చికిత్సలన్నీ పనిచేస్తున్నాయి. లివర్ సంబంధిత ఇతర సమస్యలే కాదు, చివరికి లివర్ సిర్రోసిస్ కైనా, లివర్ క్యాన్సర్ కైనా ఆయుర్వేదంలోని అగ్ని చికిత్సలే అత్యుత్తమ వైద్యలు. నిజానికి అగ్నికి చికిత్స చేయకుండా మిగతా ఎన్ని చికిత్సలు చేసినా వృధాయే. అగ్ని అంటే విశ్వశక్తి, దాన్ని తనలో ఇముడుచుకోవడం వల్లే ఆయుర్వేదం మానవాళికి ప్రాణ శక్తిగా వర్ధిల్లుతోంది.
డాక్టర్ వర్ధన్
MD (Ayu): Ph.D: MS (C&P)
Founder & Chief Physician
ఫోన్ : 9056959595
హైదరాబాద్ బ్రాంచీలు : బషీర్బాగ్ ,తార్నాక , బంజారాహిల్స్
ఏపీ బ్రాంచీలు : విజయవాడ , తిరుపతి ,కర్నూల్ , రాజమండ్రి
Comments
Post a Comment