పీసీఓడీ, సంతానలేమి కి గుడ్ బై.. || Ayurvedic Treatment For PCOD |Vardhanayurveda|| Dr. MADHURI


ప్రతి నెల అండాశయం నుంచి ఒక అండం విడుదల కావాల్సి ఉంటుంది, అయితే కొంతమంది స్త్రీలలో సహజంగా ఉండే ఈస్ట్రోజన్ హార్మోన్ల కన్నా పురుష హార్మోన్ అయిన ఆండ్రోజన్ హార్మోన్ ఉత్పన్నమవుతాయి. ఇవి అండం విడుదలకు అడ్డుపడతాయి. దీనికి తోడు ఇది రుతుక్రమంలో తేడాలకు, సంతానలేమికి కారణం అవుతాయి. ఈ పరిణామాలకు మూలమయ్యే  సమస్యనే పిసిఓడి అంటారు. పీసీఓడీ ఉన్న వారిలో అండాలు విడుదల కాకుండా అండాశయం లోనే ఉండి పోయి చివరికి  కణుతులు గా మారిపోతాయి. సాధారణంగా చాలామంది స్త్రీలకు ఈ పరిణామాలేవీ దృష్టికి రావు. వాళ్లు డాక్టర్ ను సంప్రదించేది కేవలం రుతుక్రమం తేడాల కారణంగానే, అయితే ఇలా డాక్టర్ ను సంప్రదించే చాలా మంది మహిళలకు తమకు చాలా కాలంగా పీసీఓడి సమస్య ఉన్నట్లే తెలియదు. వీళ్లలో ప్రధానంగా టీనేజ్ అమ్మాయిలు, సంతానయోగ్యత లో ఉన్నవారు, రుతుక్రమం ఆగిపోయే మోనోపాజ్ దశలో ఉన్న వారే ఉంటారు. పీసీఓడీ సమస్య ఈ ముగ్గురిలో ఎప్పుడైనా కనిపించవచ్చు. ఈ వ్యాధికి కొన్ని ప్రధాన కారణాలైతే ఉంటాయి. రుతుక్రమం అస్తవ్యస్తం కావడం, ముఖం మీద గాని, చేతులు కాళ్ళలో కానీ అవాంఛనీయమైన రోమాలు రావడం అంటే మీసాలు గడ్డం రావడం ఉంటాయి. మగవాళ్ల లా బట్టతల రావడం జుట్టు ఊడి బట్టతల రావడం, ముఖం మీద మొటిమలు రావడం, మెడ మీద నలుపెక్కిపోవడం, అధిక బరువు స్థూలకాయం వంటివి ఉంటాయి. వీటన్నిటినీ మించి అండాశయంలో చిన్నచిన్న నీటి బుడగలు లాంటివి ఎక్కువగా పుట్టడం ఉంటాయి. ఈ లక్షణాల ఆధారంగా దాన్ని మనం పీసీఓడీ సమస్యగా గుర్తించి వచ్చు. పీసీఓడీ రావడానికి సహజంగా పురుషుల్లో ఉండే ఆండ్రోజెన్ లు లేదా టెస్టోస్టిరాన్ లు స్త్రీలలో ఎక్కువగా ఉండటం కారణమవుతుంది.


ఆయుర్వేదం ఏం చేస్తుంది?



PCOD వల్ల ఎదురయ్యే అతి పెద్ద సమస్య సంతాన లేమి. దీనికంతా అండాశయం నుంచి అండం విడుదల కాకపోవడమే కారణం. పైగా వీళ్ళలో ఎక్కువమంది మధుమేహం బారిన పడతారు. దిగులు ఆందోళన కూడా వీరిలో ఎక్కువే. మౌలికంగా ఈ సమస్యలన్నింటి వెనుక శరీరంలో జఠరాగ్ని సరిగా లేకపోవడమే అని  తేలిపోతుంది. ఇందులో భాగంగానే జీవక్రియల ఆశక్తత కనిపిస్తుంది. ఆయుర్వేద చికిత్సలతో ధాతు వృద్ధి జరుగుతుంది. అగ్ని పూర్వస్థితికి చేరుతుంది. వీటితో పాటు రసాయన చికిత్సలు, వాజీకరణ చికిత్సలు జరుగుతాయి. ఈ చికిత్సలతో పిసిఓడి/పిసిఓఎస్ సమస్యలే కాదు, మున్ముందు రాబోయే మధుమేహాన్ని ఇవి నివారిస్తాయి. ఇవి సంతానలేమి సమస్యను తొలగించడంతో పాటు ఒక సంపూర్ణ జీవితాన్ని మీకు అందిస్తాయి.









డాక్టర్  మాధురి  వర్ధన్
MD (Ayu) (Gynecologist & Infertility Specialist)
ఫోన్  : 9056959595

హైదరాబాద్ బ్రాంచీలు :  బషీర్బాగ్ ,తార్నాక , బంజారాహిల్స్
ఏపీ బ్రాంచీలు : విజయవాడ , తిరుపతి ,కర్నూల్ , రాజమండ్రి

Comments