నడుము నొప్పి ముదిరితే నరకయాతనే ......... || Best Ayurveda Treatment For Back pain in Telugu



నిజానికి వేరువేరు సమస్యలుగా కనబడుతున్న ఈ వెన్ను నొప్పి కాళ్ల నొప్పి లైంగిక సమస్యల వెనుక ఉన్న వ్యాధికి మూలం ఒకటే. అందువల్ల వాటన్నింటికి వేరు వేరు డాక్టర్ల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు ఒకే ఒక్క ఆయుర్వేద డాక్టర్ ఈ సమస్యలన్నింటికి పరిష్కారం చూపుతారు. వాస్తవానికి వెన్నునొప్పి అనేది వాతం వికృతి వల్ల తలెత్తే సమస్య, అయితే వాదం అనేది కేవలం వెన్నుముక కే పరిమితమై ఉండదు. అది మొత్తం శరీరమంతా వ్యాపించి ఉంటుంది. అందుకే దెబ్బతిన్న డిస్కు లకే పరిమితం కాకుండా ఆయుర్వేదం వెన్నుముక మొత్తాన్ని పరిగణలోకి తీసుకుంటుంది. వాత దోషాల దుష్ప్రభావాలు ఎముకలకు సంబంధించిన అస్థి ధాతువుల ను  తీవ్రంగా దెబ్బతీస్తుంది. అయితే వికృతి చెందిన వాతం అస్థి ధాతువు ను  దెబ్బ తీసినట్లే , అస్థి ధాతువు  క్షీణించినప్పుడు వాత వికృతి జరుగుతుంది. ఈ రెండూ ఒక దానితో ఒకటి ముడిపడి ఉన్న సమస్యలు. శరీరంలోని ప్రతి కదలికను నియంత్రించే వాతం నాడీ వ్యవస్థ, కండరాల వ్యవస్థ, శ్వాసకోశ వ్యవస్థ, విసర్జన వ్యవస్థ వీటన్నిటికీ మూల ప్రేరకం గా ఉంటుంది. అయితే వికృతి చెందిన వాతాన్ని సాధారణ స్థాయికి తెస్తే గాని ఈ వ్యవస్థలన్నీ తిరగతి సజావుగా పనిచేయవు. అలా కాకుండా డిస్కులకే పరిమితమై వైద్య చికిత్సలు చేస్తే అవన్నీ తాత్కాలిక ఉపశమనానికి మాత్రమే ఇస్తాయి. శస్త్ర చికిత్స తర్వాత కూడా ఈ పరిస్థితి చక్క బడక పోవడానికి వాతాన్ని నియంత్రించే చికిత్స లు అందించకపోవడమే  కారణం.

 సర్జరీ ఎందుకు?
             
 అనుమతితో వెళితే ఆధునిక వైద్యులు మొదట గా ఇచ్చేది  పెయిన్ కిల్లర్స్. ఇవి తాత్కాలిక ఉపశమనం ఇచ్చిన ఎక్కువ కాలం వాడితే, తలనొప్పి కడుపునొప్పి, అల్సర్లు మొదలవుతాయి. మరింత కాలం వాడితే లివర్ దెబ్బతినడం ,కిడ్నీలు దెబ్బతినడం, లివర్ సిరోసిస్ వంటి తీవ్రమైన వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. అలా అని సర్జరీ కి వెళితే పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు కావడమే తప్ప కలిగే ప్రయోజనం మాత్రం అంత విశేషంగా ఏమీ ఉండదు. సర్జరీ వల్ల కలిగే ప్రయోజనాల విషయంలో వారిచ్చే గ్యారంటీ కూడా ఏమీ ఉండదు. కనీసం ఆ ఒక్క క సర్జరీతో అయిపోతుందా అంటే కొద్దిరోజుల్లోనే మరో సర్జరీ అవసరం కూడా రావచ్చు. మలమూత్రాలమీద నియంత్రణ కోల్పోయిన ఒక విషమ స్థితిలో మాత్రమే ఎంచుకోవాలి. అంతే గానీ, వెన్ను నొప్పి మొదలవ్వగానే సర్జరీ కి వెళ్లడం అంటే అది పలు సమస్యలను కొని తెచ్చుకోవడమే.

 ఆయుర్వేదం ఒక పరిపూర్ణ  వైద్యం ,..........

 రోగి శరీర ప్రకృతిని అనుసరించి వెన్ను నొప్పి రావడానికి గల ప్రత్యేక కారణాల్ని ఆయుర్వేదం ముందుగా కనిపెడుతుంది. సమస్యలకు అసలు కారణమైన వాత వికృతిని తొలగించే చికిత్సలు  మొదలెడతాం..... ఆ తర్వాత దాతుక్షయన్ని, నరాల వ్యవస్థను నిర్జీవం చేసే , మర్గవరొదన్ని నివారించే చికిత్సలు ఉంటాయి. చికిత్స క్రమంలో కీళ్లు ,లిగమెంట్లు, టెండాన్లు ,డిస్కులు అలా వెన్నెముకతో అనుగుణంగా ఉండే కండరాల వ్యవస్థను సమస్థితికి తెచ్చే చికిత్సలు ఉంటాయి. ఆ తర్వాత నరాల వ్యవస్థను కూడా సమస్థితికి తేవలసి ఉంటుంది. ఆ చికిత్సలో భాగంగా మేరు చికిత్సలు,మర్మ చికిత్సలు, పంచకర్మ చికిత్సలు ఉంటాయి. అలాగే శరీరంలో జీవ జీవాలు నింపే రసాయన చికిత్స ద్వారా లైంగిక సమస్యలను తొలగించే  వాజీకరణ చికిత్సలు ఉంటాయి. ఇవన్నీ వెన్నునొప్పిని కాదు చుట్టూ ఉండే సర్వ వ్యవస్థలను సరిచేస్తాయి. ఫలితంగా వెన్ను వ్యవస్థ స్థిరపడుతుంది. మీ జీవిత కాలమంతా మీ వెన్నుదన్నుగా నిలబడుతుంది.


డాక్టర్  మాధురి  వర్ధన్ 
MD (Ayu) (Gynecologist & Infertility Specialist)
ఫోన్  : 9056959595

హైదరాబాద్ బ్రాంచీలు :  బషీర్బాగ్ ,తార్నాక , బంజారాహిల్స్
ఏపీ బ్రాంచీలు : విజయవాడ , తిరుపతి ,కర్నూల్ , రాజమండ్రి

Comments