ఆయుర్వేదం తో సంతానభాగ్యం .. || సంతాన సాఫల్యానికి ఉత్తమ వైద్యం | Best Ayurvedic Treatment For Infertility || Vardhan Ayurveda
సంతానం అన్నది కేవలం పునరుత్పత్తి అవయవాలకు మాత్రమే పరిమితమైనది కాదు. అది మొత్తం శరీర వ్యవస్థ మీద ఆధారపడి ఉంటుంది. అందుకే సంతాన సాఫల్యానికి దంపతులిద్దరి ఆరోగ్యం ఎంతో ముఖ్యమైనది అని ఆయుర్వేదం చెబుతుంది. అయితే ఆధునిక వైద్య విధానాలు స్త్రీపురుషుల శుక్ర, ఫలితాలను ఫలదీకరణం చెందించి గర్భాశయం లోనికి ప్రవేశ పెడితే చాలనుకుంటున్నాయి. అందుకే ఐవిఎఫ్ చికిత్సలు చాలా వరకు విఫలమవుతున్నాయి. ఒకవేళ సంతానం కలిగిన ఆ శిశువుల్లో చాలామంది అంత ఆరోగ్యంగా ఉండడం లేదు. ఇందుకు భిన్నంగా ఆయుర్వేదం దంపతుల మొత్తం శరీర వ్యవస్థను శక్తివంతం చేస్తుంది. అందుకే ఆయుర్వేద చికిత్సతో కలిగే శిశువే కాదు ఆ దంపతులు కూడా జీవితాంతం ఆరోగ్యాన్ని పొందుతున్నారు అంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ వర్ధన్.
దంపతులు ఇరువురూ ఆరోగ్యంగా ఉన్నప్పుడే వారికి కలిగే శిశువు ఆరోగ్యం తో ఉంటుంది .దంపతులు ఆరోగ్యం పట్టించుకోకుండా సంతానం మీద దృష్టి పెడితే వచ్చే ఫలితాలు ఆశించిన రీతిలో ఉండవు. ఇంద్రియాలు వాత , పిత్త, కఫము, త్రిదోషాలు ,రక్తము ,మాంసము మేధస్సు, అస్థి, మజ్జ ,శుక్రం అనే సప్తధాతువులు మొత్తంగా బాగుండాలనే ఆరోగ్యం అంటారు. మనం తీసుకునే ఆహార పానీయాల ద్వారా అంతిమంగా ఏర్పడేది శుక్రధాతువు. ఈ శుక్ర ధాతువు కూడా స్త్రీ పురుషులు ఇరువురిలోనూ ఉంటుంది. మౌలికంగా హార్మోనల్ యంత్రాంగానికి సంబంధించిన endocrinol వ్యవస్థే శుక్ర ధాతువు. జీర్ణ వ్యవస్థ సర్వ సమగ్రంగా ఉంటేనే శుక్రధాతువు కూడా పరి పక్వ స్థితిలో ఉంటుంది. అయితే ఆధునిక జీవన శైలి ఆహారపు అలవాట్లు ఇవన్నీ చాలా వరకు ఈ శుక్రధాతువు దెబ్బతీసే విధంగానే ఉంటున్నాయి. రసధాతువు ల నుంచి మొదలుకొని శుక్రధాతువు దాక అన్ని క్షీణ దశగానే వెళుతున్నాయి. ఇవన్నీ పునరుత్పత్తి వ్యవస్థ మీద తీవ్రమైన దుష్ప్రభావానికి కలిగిస్తున్నాయి. ఫలితంగా సంతానలేమి సమస్యలు ఎక్కువ అవుతున్నాయి.
సంఖ్య తగ్గిపోతే ......
శుక్రకణాల సంఖ్య తక్కువగా ఉన్నప్పుడు వాటిని పెంచడానికి ఆధునిక వైద్యంలో మూడు నాలుగు మాసాల పాటు వాడేందుకు కొన్ని మందులు సూచిస్తారు .అయితే, అవి వాడుతున్న ఆ మూడు నాలుగు మాసాలు శుక్రకణాల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది కాకపోతే ఓ ఆరు మాసాల్లో ఆ సంఖ్య మందులు వాడటానికి ముందున్న స్థాయికే పడిపోతుంది. కేవలం శుక్రకణాలను పెంచడమే లక్ష్యంగా చికిత్సలు సాగిన పరిణామమే ఇది. ఆయుర్వేద మందులతో ఆ మూడు నాలుగు మాసాలు కాదు పెరిగిన ఆ సంఖ్య ఎప్పటికీ అలాగే ఉంటుంది.
వాత వైగుణ్యం ,...........
నాడీ వ్యవస్థలోని లోపాలను వాత వైగుణ్యం అంటారు. నిజానికి గర్భధారణ జరగడానికి నాడీవ్యవస్థ సవ్యంగా పని చేయడం చాలా ముఖ్యం. వీటితోపాటు బహిష్ట సంబంధిత సమస్యలు సుమారు 20 రకాల స్త్రీ లైంగిక సమస్యలు సంతానలేమికి కారణం అవుతాయి. వాత వైగుణ్యం . ఏర్పడినప్పుడు శుక్రకణాలను స్వీకరించే తత్వం స్త్రీలో తగ్గిపోతుంది. వాతం ఐదు రకాలు. వీటిలో చివరిది ఆపాన వాతం శుక్రశోనితాలు కలవడం గర్భం రావడం అన్నది ఈ ఆపానవాయువు పరిధిలోనే ఉంటుంది. అపానవాయు సరిగ్గా ఉన్నప్పుడే గర్భధారణ సులువుగా జరుగుతుంది . ఆపాన వాతం సరిగా లేకపోతే రుతుక్రమం సరిగా ఉండదు. హార్మోన్లు సరిగా విడుదల కావు ఫలితంగా గర్భధారణకు అనువైన పరిస్థితి కరువైపోతుంది. అయితే ఆపానవాయువు ను సరైన స్థితికి తెచ్చే ఆయుర్వేదానికి ఉంది.
హార్మోన్ సమస్యలు......
రుతుక్రమ దోషాలు గర్భధారణకు పెద్ద ఆటంకంగా ఉంటాయి. అయితే ఈ దోషాలను హార్మోన్ మాత్రలు ఇచ్చే అవసరం లేకుండానే చక్కదిద్దే మందులు ఆయుర్వేదం లో ఉన్నాయి. ఆధునిక వైద్య విధానంలో నిరంతరంగా హార్మోన్లు ఇవ్వడం వల్ల చాలాసార్లు అసలు సమస్య అలాగే ఉండిపోయి ఊబకాయం వచ్చేస్తుంది. కొంతమందికి మాత్రమే కాకుండా హార్మోన్ ఇంజెక్షన్లు ఇస్తారు. వీటివల్ల కొందరిలో అండం విడుదల అవుతుంది. కానీ ఆ అండం నాణ్యత ఆరోగ్యంగా ఉండదు. ఐ వి ఎఫ్ చికిత్సలు ఐదుసార్లు తీసుకున్న చాలాసార్లు ఫలితం లేకపోవడానికి మొత్తం శుక్ర శో నితాల నాణ్యతను పట్టించుకోకపోవడమే కారణం. శుక్రకణాలు లో నాణ్యత లేకపోయినా కొందరికి సంతానం కలుగవచ్చు. కానీ ఆ శిశువు ఆరోగ్యంగా ఉండే అవకాశాలు చాలా తక్కువ.
సంపూర్ణ ఆరోగ్యం......
స్త్రీలలోని గర్భాశయ రుతుక్రమ సమస్యలు కావచ్చు. పురుషుల్లోని శుక్రకణాల సంఖ్య లేదా వాటి నాణ్యత సమస్య కావచ్చు. వాటి మూలకారణాలను తొలగించే దిశగా ఆయుర్వేదం పనిచేస్తుంది. సంతానం కోసం చేసే చికిత్సకు ముందు శరీరంలోని కల్మషాలన్నిటిని బయటకు పంపే చికిత్సలు చాలా ముఖ్యం. ఆ తర్వాతే పంచకర్మ చికిత్సలు ,ఆ తర్వాత రసాయన చికిత్సలు, వాజీకరణ చికిత్సలు చేయాలి. శరీరాన్ని చైతన్యపరిచే రసాయన చికిత్సలో భాగంగా సర్వాంగధార , నవరకిడి, నస్యకర్మ చికిత్సలు కూడా ఉంటాయి. వీటితోపాటు గర్భాశయ జననాంగ భాగాల లో ఉండే ఇన్ఫెక్షన్లను తొలగించేందుకు ఉత్తరవస్తి చికిత్స చేయవలసి ఉంటుంది. దీని వల్ల గర్భాశయ లోపాల తో పాటు గర్భం ఆలయాల్లోని అడ్డంకులు కూడా తొలగిపోతాయి. అంగస్తంభన సమస్యలు ఉన్న పోయి లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. సంతానం కోసం భార్యా భర్తలు ఇద్దరూ ఆయుర్వేద చికిత్సలు తీసుకోవాలి. మొత్తంగా అన్ని చికిత్సలకు కలిపి మూడు నుంచి ఆరు మాసాల దాకా పడుతుంది. ఆయుర్వేద సంతాన సాఫల్య చికిత్సతో శిశువే కాదు దంపతుల ఆరోగ్యం కూడా దివ్యంగా ఉంటుంది.
Comments
Post a Comment