గాల్ బ్లాడర్ లో రాళ్లు ఉంటే సర్జరీ తప్పదా .. || Gallbladder Stones | Ayurvedic Treatment for Gall Stones
శరీరంలోని అత్యంత కీలకమైన అంతర్భాగాలలో పిత్తాశయం (గాల్ బ్లాడర్) ఒకటి. ఇందులో అచ్ఛ పిత్త రసం నిలువై ఉంటుంది. ఈ పిత్త రసం జీర్ణప్రక్రియలో ఒక కీలక భూమికను నిర్వహిస్తుంది. అయితే వివిధ కారణాల వల్ల కొందరిలో పిత్తాశయంలో రాళ్ళు ఏర్పడతాయి. పిత్తాశయం లో నొప్పి మొదలై రాళ్లు ఉన్నట్టు తేలగానే డాక్టర్లు వెంటనే సర్జరీ ద్వారా గాల్ బ్లాడర్ ను తీయించేసుకోండి లేదంటే చాలా సమస్యలు వచ్చిపడతాయంటారు. కానీ సర్జరీ అయ్యాక ఎన్నెన్ని సమస్యలు ఎదురవుతాయో చెప్పరు. అత్యవసరమైన ఫ్యాట్స్ ను జీర్ణించుకునే శక్తి పూర్తిగా హరించుకుపోతుందనే ఆ ఒక్క మాట చెప్పిన ఎవరు సర్జరీ కోసం అంతగా తొందరపడరు. వాస్తవానికి పిత్తాశయంలో నొప్పి మొదలై రాళ్లు ఉన్నాయని తేలినంత మాత్రాన సర్జరీ ద్వారా ఆ పిత్తాశయాన్ని తొలగించుకోవాల్సిన అవసరం లేదు. అప్పటికి ఆ నొప్పి తగ్గే ఉపశమన చికిత్సలు తీసుకొని, ఆ తర్వాత ఆహారం జీవనశైలి మార్పులు చేసుకుని ఆయుర్వేద వైద్యం తీసుకుంటే మీ పిత్తాశయంలోని రాళ్లతో మీకు ఇబ్బంది రాదు.
ఎక్కడివీ రాళ్లు..
ఆయుర్వేద పరిభాషలో పిత్తాశయంలోని రాళ్ళును పిత్తాశ్మరి అంటారు. కొవ్వు పదార్థాలు కొలెస్ట్రాల్ పిత్త రసం ఈ మూడింటి సమిశ్రణం వల్లే ఈ రాళ్ళు ఏర్పడతాయి. సాధారణంగా 40 లేదా 50 ఏళ్లు పైబడిన వారిలోనే పిత్తాశయ రాళ్ల సమస్య కనిపిస్తుంది. వయసుతో పాటు థైరాయిడ్ సమస్యలు, మధుమేహం, అధిక రక్తపోటు, నియంత్రణ లేని ఆహారం, ప్రతి దానికి మందులు వాడటం, దీర్ఘకాలికంగా వాడే ఆస్తమా మందులు, టీబీ క్యాన్సర్ మందులు వాడటం, అతిగా యాంటీ బయోటిక్స్ వాడటం వల్ల ముందుగా కాలేయం దెబ్బ తింటుంది. ఫలితంగా పిత్తాశయం కూడా రోగగ్రస్తం అవుతుంది. ఫలితంగా జీర్ణక్రియకు సంబంధించిన అగ్ని స్థానం దెబ్బతింటుంది. దాని పరిణామంగా పేగుల కదలికలు తగ్గిపోతాయి. దీనివల్ల జీర్ణాశయాన్ని అస్తవ్యస్తం చేసే గ్రహణి (ఐబిఎస్) సమస్య మొదలవుతుంది. ఈ గ్రహణి ఒక వ్యాధి లక్షణం గా కనిపించవచ్చు. ఈ క్రమంలో తల్లిలాంటి కాలేయం పాడైపోయి, పిత్తాశయంలో రాళ్లు ఏర్పడవచ్చు.
ఈ సర్జరీ ఎందుకు..
కొన్ని అరుదైన పరిస్థితులు అంటే పిత్తాశయం చితికిపోయినప్పుడు, పిత్తాశయం మొత్తాన్ని రాళ్లు ఆవహించినప్పుడు, కాలేయంలో క్యాన్సర్ మొదలైనప్పుడు ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప పిత్తాశయ రాళ్ల కారణంగా సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం లేదు. పిత్తాశయంలో రాళ్లు ఉన్నా వాటి వల్ల ఏ ఇబ్బందీ లేకుండా చేసే చికిత్సలు ఆయుర్వేదం లో ఉన్నాయి. సర్జరీకి వెళ్లక ముందే అయితే, ఐబిఎస్ రాకుండా గ్రహణి హరి చికిత్సలు చేస్తాం. అజీర్తి సమస్యలు రాకుండా అశ్మరీ చికిత్సలు, ఆగ్నేయ చికిత్సలు చేస్తాం. వాత హర చికిత్సలు చేస్తాం. ఒకవేళ అప్పటికే సర్జరీ జరిగి ఉంటే దాని దుష్ప్రభావాలకు తావు లేకుండా ధాతు శక్తిని వృద్ధి చేయడానికి ఉత్కృష్టమైన కొన్ని ప్రత్యేకమైన రసాయన చికిత్సలు చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తాయి.
డాక్టర్ వర్ధన్
MD (Ayu): Ph.D: MS (C&P)
Founder & Chief Physician
ఫోన్ : 9056959595
హైదరాబాద్ బ్రాంచీలు : బషీర్బాగ్ ,తార్నాక , బంజారాహిల్స్
ఏపీ బ్రాంచీలు : విజయవాడ , తిరుపతి ,కర్నూల్ , రాజమండ్రి
Comments
Post a Comment