బెందులు సోరియాసిస్ గా మారతాయా ? | How To Cure Psoriasis | Vardhan ayurveda Hospital || Dr.MADHURI



కొందరి చర్మం మీద తరచూ ఎర్రటి దద్దుర్లు లేదా బెందులు వచ్చి వాటికవే తగ్గిపోతాయి. అందుకే చాలామంది వాటి పట్ల నిర్లక్ష్యం గానే ఉండి పోతారు. అయితే ఎక్కువగా అలా పదేపదే వస్తూ పోతున్నప్పుడు వాటిని తీవ్రంగా పరిగణించాలి. ఒక్కోసారి ఈ దద్దుర్లు లేదా బెందులు సోరియాసిస్ కు దారితీయవచ్చు. తొలి దశలోనే సమస్యను గుర్తించి చికిత్స తీసుకుంటే సోరియాసిస్ రాకుండా ముందే అరికట్టవచ్చు.

      అప్పుడో ఇప్పుడో వంటి మీద ఏవో దద్దుర్లు రావడం మళ్ళీ వాటంతట అవే తగ్గిపోవడం కొందరికి బాగా అనుభవమే. స్వల్ప కాలమే ఉండి ఆ తరువాత వాటికవే మాయమైపోయే సమస్యలను సాధారణంగా ఎవరూ పట్టించుకోరు. నిజానికి ఈ లక్షణాలన్నీ శరీరంలో మున్ముందు రాబోయే కొన్ని తీవ్ర వ్యాధులను తెలిపే సూచికలు. ప్రత్యేకించి ఈ దద్దుర్లు గానీ, ఈ బెందులు గాని శరీరంలో లో పిత్త ప్రకృతి పెరగడం వల్ల వస్తుంటాయి. తొలిదశలో వీటికి చికిత్స తీసుకుంటే సరేసరి. లేదంటే కొందరిలో ఇవి పలురకాల చర్మవ్యాధులకు కొన్నిసార్లు ఇవి సొరియాసిస్ వ్యాధికి కూడా దారితీయవచ్చు దద్దుర్లు గాని బెందులు గాని అరుదుగా ఎప్పుడో ఒకసారి వచ్చిపోతే పరవాలేదు. అలా కాకుండా పదే పదే వచ్చి పోతున్నప్పుడు ఆ విషయాన్ని డాక్టరు దృష్టికి తీసుకు వెళ్లడం తప్పనిసరి. ఇవేమిటని పక్క వాళ్ళు అడుగుతున్నప్పుడు సమాధానం చెప్పకుండా దాటేస్తుంటారు. పైగా వారి మీద అసహనాన్ని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తారు. చివరికి ఇవి  తన మీదే తానే అసహనాన్ని పెంచుకునే పరిస్థితిలో పడదోస్తాయి.

అలర్జీగా మొదలై:

 ముందు అలర్జీగా మొదలై ఆ తరువాత ఎర్రటి బెందులు, దద్దుర్లు వస్తూ ఉంటాయి. అయితే దద్దుర్లు చాలాసార్లు అలా వచ్చి ఇలా తగ్గిపోవచ్చు. కానీ ఎర్రటి  కురుపుల్లా ఉండే బెందులు మాత్రం కొందరిలో కొన్ని గంటల దాకా కొనసాగవచ్చు. వాస్తవానికి శరీరంలో ఒక రక్షణ వ్యవస్థలో భాగంగా యాంటీ హిస్టమిన్ వ్యవస్థ పని చేస్తూ ఉంటుంది. కాకపోతే ఈ యాంటీ హిస్టమిన్లు మరీ ఎక్కువగా ఉత్పత్తి అయినప్పుడు ఈ తరహా చర్మ సమస్యలు మొదలవుతాయి. ఇలాంటి స్థితిలో 'అవిల్' మాత్రలు గాని 'సెడ్రిజిన్'  మాత్రలు గాని వేసుకుంటే తాత్కాలికంగా తగ్గుముఖం పడతాయి. ఆ తరువాత ఎప్పుడో ఒకప్పుడు మళ్లీ వస్తూనే ఉంటాయి. ప్రత్యేకించి రామగుండం, మహబూబ్ నగర్, అనంతపూర్, హైదరాబాద్ బంటి అధిక ఉష్ణోగ్రత ఉండే ప్రాంతాలు అలాగే విజయవాడ, విశాఖపట్నం వంటి సముద్ర తీర ప్రాంత వాసుల్లో ఈ సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. బెందులు  ఎర్రగా తయారవుతాయి. వేసవిలో మరి కాస్త ఎక్కువ అవుతాయి. బెందులు తరచూ వస్తున్నప్పుడు చర్మం తన వ్యాధి నిరోధక శక్తిని కోల్పోతుంది. ఫలితంగా వాతావరణంలో ఏ కాస్త మార్పు వచ్చినా తట్టుకోలేని స్థితి ఏర్పడుతుంది. ఒక దశలో ఇవన్నీ ఏదో ఒక చర్మవ్యాధులకు దారితీస్తాయి. వీటిలో ముఖ్యంగా 60 శాతం చర్మ వ్యాధులు సోరియాసిస్ గా మారే ప్రమాదం ఉంది. నిజానికి బెందులు వల్ల సోరియాసిస్ రాదు.  బెందులుతో చర్మం వ్యాధి నిరోధక శక్తి కోల్పోయిన కారణంగా సోరియాసిస్ పరిస్థితి ఏర్పడుతుంది.  బెందులు గాని, దద్దుర్లు గాని వచ్చినప్పుడు దురద, మంట తో పాటు ఎండకు వెళితే తట్టుకోలేని స్థితి ఏర్పడుతుంది. వాతావరణం చల్లబడినప్పుడు కాస్త తగ్గుముఖం పట్టి ఎండల్లో ఎక్కువ అవుతుంది. వంకాయ గోంగూర ఇలాంటివి తిన్నప్పుడు ఎక్కువ అవుతుంది.

పిత్తాన్ని తొలగిస్తూ...

బెందులు, దద్దుర్లు రావడానికి పిత్త ప్రకృతే మూలం. ఇలాంటి వారిలో మలబద్ధకం సమస్య ఉంటుంది. కడుపు ఉబ్బరం, మంట వుంటాయి. ఎక్కువ కాలం నిర్లక్ష్యం చేయకుండా వీరు ఆయుర్వేద డాక్టర్ ను  కలవడం ఉత్తమం. ఈ స్థితిలో వెంటనే విరేచన చికిత్స చేయడం చాలా అవసరం. సమస్యకు పిత్తం పెరగడమే కారణం కాబట్టి పిత్తాన్ని హరించే చికిత్సలు అంటే విరేచన చికిత్స అవసరం అవుతాయి. చికిత్స తీసుకుంటున్న సూర్యరశ్మి లోకి వెళ్లకుండా జాగ్రత్త పడడం కూడా అవసరమే.

       ఒకవేళ తప్పనిసరై వెళ్లాల్సి వస్తే, వెళ్లేముందు శరీరం మొత్తంగా చందనాది తైలాన్ని రాసుకోవడం మేలు. విరేచన చికిత్సతో శరీరంలోని సోరియాసిస్ కారకమైన పిత్తం త్వరగా తగ్గుతుంది. ఆ తర్వాత శరీరంలో చల్లదనం తేవడానికి రక్తశుద్ధి చేయడం అవసరం. అందుకు  సర్వాంగ తక్రదార చికిత్స బాగా తోడ్పడుతుంది. ఈ చికిత్స కోసం పాల లో రక్తశోదక ద్రవ్యాలు, వర్ణప్రసాదక  ద్రవ్యాలు వేసి మజ్జిగల చేస్తాం. ఈ మజ్జిగను తల నుంచి బొటనవేలి దాకా  దారాల పోస్తాం. దీనివల్ల శరీరమంతా శీతల తత్వాన్ని పొందుతుంది. ఆ వెంటనే శరీరంలోని కణజాలమంతా చైతన్యవంతమవుతుంది. వ్యాధినిరోధక  శక్తి పెరుగుతుంది. వీటితోపాటు ఆర్కె లేహ్యం, స్నేహపానం, విరేచనం, పంచకర్మ చికిత్సలు కూడా చేస్తే బెందులు, దద్దుర్లు పూర్తిగా తగ్గిపోయి, మునుముందు సొరియాసిస్ కు అసలు తావే లేకుండా పోతుంది.




డాక్టర్  మాధురి  వర్ధన్   
MD (Ayu) (Gynecologist & Infertility Specialist)
ఫోన్  : 9056959595

హైదరాబాద్ బ్రాంచీలు :  బషీర్బాగ్ ,తార్నాక , బంజారాహిల్స్ 
ఏపీ బ్రాంచీలు : విజయవాడ , తిరుపతి ,కర్నూల్ , రాజమండ్రి

Comments