ఐబీఎస్ పిడికెడు అన్నం తిననివ్వని పీడ | What is IBS? What is The Best Treatment Of IBS |100% Safe Treatment of IBS || VardhanAyurveda
ఏ వ్యాధితో వెళ్ళినా దానికి మానసిక ఒత్తిళ్లే మూలమని చెప్పడం చాలామందికి ఒక ఆనవాయితీగా మారింది. ఐబిఎస్ సమస్యతో వెళితే, మానసిక ఒత్తిళ్లను తగ్గించుకోనిదే మేము ఎన్ని మందులు ఇచ్చినా నీ సమస్య పోదంటూ ఎంతో మంది ఆధునిక వైద్యులు కరాఖండిగా చెబుతున్నారు. ఆ మాటలు విన్న ఐబిఎస్ బాధితులు తామేదో శాపగ్రస్తులై పోయినట్టు కుంగిపోతున్నారు. కానీ, ఆయుర్వేద వాదన ఇందుకు పూర్తిగా భిన్నమైనది. ఐబిఎస్ (ఇరిటేబుల్ బావెల్ సిండ్రోమ్) అంతకు ముందే వున్న ఒత్తిళ్లతో మరికాస్త తీవ్రం అవుతుందే తప్ప, కేవలం మానసిక ఒత్తిళ్లతోనే ఎప్పుడూ రాదని మరీ మరీ నొక్కి చెబుతుంది. అందుకే ఐబిఎస్ వ్యాధిని సమూలంగా తొలగించివేస్తామని ఆయుర్వేదం అభయహస్తం ఇస్తుందని చెబుతున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ వర్ధన్.
ప్రపంచంలో నేడు దాదాపు 60 శాతం మంది ఈ ఐబిఎస్ సమస్యతో బాధపడుతున్నారు. జీర్ణాశయ సమస్యల్లో అత్యధికులు బాధపడుతున్న సమస్య ఇదే. ఆధునిక వైద్యరంగం కిడ్నీలు, లివర్, శ్వాసకోశాలు గుండె మార్పిడి దాకా వెళ్ళింది కానీ, ఐబిఎస్ రావడానికి గల కారణాల్ని మాత్రం పసిగట్టలేకపోయింది. అందుకే తాత్కాలిక ఉపశమనాన్ని ఇవ్వడానికే పరిమితమైపోయింది. ఏళ్ల తరబడి మందులు మింగి కూడా సమస్య నయం కాకపోవడంతో ఎంతో మంది ఐబిఎస్ రోగులు డిప్రెషన్ లోకి వెళ్తున్నారు, లేదా మౌనంగా ఆ నరకాన్ని అనుభవిస్తున్నారు. చివరికి ఐబిఎస్ ను తనలో భాగం చేసుకుని నిస్సహాయంగా జీవించేస్తున్నారు. జఠరాగ్నికి సంబంధించిన గ్రహణి, మెదడు, నాడీ వ్యవస్థల (ఎంటిరిక్ నర్వస్ సిస్టమ్) మధ్య ఉండే సమతుల్యత దెబ్బతినడమే అసలైన మూల కారణం.
ఏమిటీ బాధ?
ఉత్తర భాగంలో ఉండే ఎంటరిక్ నర్వస్ సిస్టమ్ ప్రధాన ధర్మం జీర్ణక్రియను క్రమబద్ధీకరించడం. అలాగే పేగుల కదలికను కూడా ఇది నియంత్రణలో ఉంచుతుంది. అలా రక్తప్రసరణ కొన్ని రకాల ద్రవాలు ఉత్పాదన ఇవన్నీ ఎంటరిక్ నర్వస్ సిస్టం మీదే ఆధారపడి ఉంటాయి. ఇది మెదడులోని ఒక భాగానికీ గ్రహణికీ సంబంధించిన సమాచార ప్రసరణను ఇది సరియైన రీతిలో ఉంచుతుంది. జీర్ణవ్యవస్థలో గ్రహణి నుంచి మెదడుకు మెదడు నుంచి గ్రహణికి రెండు వరుసల అనుబంధం ఉంటుంది. ఈ అనుబంధంలో ఎక్కడ ఏ చిన్న తేడా వచ్చినా ఐబిఎస్ లక్షణాలు మొదలవుతాయి. ఈ లక్షణాల్లో కడుపులో నొప్పి, మంట, అసౌకర్యం, కడుపు ఉబ్బరం, తేన్పులు, మలబద్ధకం, విరేచనాలు ప్రధానంగా ఉంటాయి. అయితే ఈ మలబద్ధకం, విరేచనాలు ఒకదాని తర్వాత ఒకటిగా నిరంతరం వేధిస్తూ ఉంటాయి. టాయిలెట్ కు ఎన్నిసార్లు వెళ్లినా ఇంకా వెళ్లాలనిపించడం, ఏ కొంచెం తిన్నా కడుపు ఉబ్బరంగా అనిపించడం, భోజనం పట్ల ఆసక్తి లేకపోవడం, దాని వల్ల బరువు తగ్గడం, తలనొప్పి, నీరసం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
నిలువెల్లా సమస్యలే
ఐబిఎస్ లక్షణాలు కేవలం పేగులకే పరిమితం అయి ఉండవు. ఇవి దాదాపు శరీరమంతా ఉంటాయి. అందుకే పేగులకు ఆవల ఇతర శరీర భాగాల్లో కలిపి మొత్తం 26 లక్షణాలు కనిపిస్తాయి. వాటిలో తలనొప్పి, మగతగా ఉండటం, గుండె దడ, వెన్నునొప్పి, శ్వాస సరిగా ఆడకపోవడం, కండరాల నొప్పి, కండరాలు బిగుసుకుపోవడం వంటివి ప్రధానంగా కనిపిస్తాయి. వీటికి తోడు ఎక్కువ సార్లు మూత్రం రావడం, మూత్ర విసర్జనలో ఇబ్బంది అనిపించడం, వెడికి చల్లదనానికి తట్టుకోలేకపోవడం, శృంగారంలో నొప్పి, చేతులు వణకడం, నిద్ర సమస్యలు కూడా ఉంటాయి. అలాగే పళ్ళు కొరకడం, నోరు ఎండిపోవడం, నోటి దుర్వాసన, మెడ, ముఖభాగాలు రక్తం పేరుకొని ఎరుపెక్కడం, కాళ్లు శక్తిహీనం కావడం, గొంతు నొప్పి, ఛాతీ పట్టేసినట్లు ఉండడం, ఆకలి తగ్గిపోవడం, కళ్లు లాగినట్లు అనిపించడం, కంటిరెప్ప లు కొట్టుకోవడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.
సరైన వైద్యం అందక పోతే...!
మనిషి సంపూర్ణ ఆరోగ్యం అతని జీర్ణశక్తి, జఠరాగ్ని మీదే ఆధారపడి ఉంటుంది. వాస్తవానికి మనిషి భౌతికమైన ఉనికిని నిలబెట్టేది అతని జీర్ణవ్యవస్థే. అది ఆరోగ్యం ఉన్నప్పుడే శరీరం ఆరోగ్యవంతమైన దాతువుల్ని తయారు చేస్తుంది. అది తన అస్తిత్వాన్ని, వ్యక్తిత్వాన్ని నిలబడుతుంది. జీర్ణశక్తి లేదా జఠరాగ్ని బలహీనపడితే శరీరంలోని సప్తధాతువులు బలహీనపడతాయి. ఈ స్థితిలో వాతం ప్రకోపితం అవుతుంది. ఈ పరిణామం దీర్ఘకాలంగా కొనసాగితే ఓజస్సు అంటే ప్రాణ శక్తి కూడా బలహీనపడుతుంది. అంతిమంగా ఇది మరణానికి దారి తీస్తుంది.
ఆయుర్వేదం ఏం చేస్తుంది?
ఐబిఎస్ కు మూలాల్ని ఛేదించడంలో ఆయుర్వేదం ఎంతో సమర్థవంతంగా పనిచేస్తుంది. వైద్య చికిత్సల్లో భాగంగా జఠరాగ్నిని తద్వారా జీర్ణశక్తిని పెంచే అగ్నివర్థక చికిత్సలు చేస్తాం. శరీరంలోని విష పదార్థాలను తొలగించే ఆమహార చికిత్సలు, పంచకర్మ చికిత్సలు చేస్తాం. అలాగే వాతహర చికిత్సలు, ధాతుపుష్టి చికిత్సలు, ఓజోవృద్ధికర చికిత్సలు చేస్తాం. వీటితోపాటు జీవశక్తిని ఉత్తేజితం చేసే రసాయన చికిత్సలు, శరీరాన్ని యవ్వనవంతంగా మలిచే మలిచే వాజీకరణ చికిత్సలు చేస్తాం. ఆయుర్వేదంతో ఐబిఎస్ సమస్య సమూలంగా తొలగిపోవడమే కాదు, మీలో ప్రాణవంతమైన ఓజస్సు పెరుగుతుంది. ఫలితంగా మీ శరీరం సర్వశక్తివంతంగా మారుతుంది.
డాక్టర్ వర్ధన్
MD (Ayu): Ph.D: MS (C&P)
Founder & Chief Physician
ఫోన్ : 9056959595
హైదరాబాద్ బ్రాంచీలు : బషీర్బాగ్ ,తార్నాక , బంజారాహిల్స్
ఏపీ బ్రాంచీలు : విజయవాడ , తిరుపతి ,కర్నూల్ , రాజమండ్రి
Comments
Post a Comment