లక్షణాలు తెలిస్తే సోరియాసిస్ ఫై గెలుపు ..... || What is Psoriasis | The Best Psoriasis Treatment at Vardhan ayurveda Hospital | Dr Vardhan



ఏదో చర్మసమస్యలే అనుకుని ఊరుకుండిపోతే ఎలా? అది సోరియాసిస్ ఏమో మరి. అయినా, లక్షణాలు తెలిస్తే వ్యాధిని ముందే గుర్తించి వెంటనే వైద్య చికిత్సలకు వెళ్ళవచ్చు . కాకపోతే ఇక్కడ మరో విషయం కూడా ఉంది. వచ్చిన చర్మ వ్యాధి సోరియాసిస్ కాకపోవచ్చు. కానీ దీర్ఘకాలికంగా ఉన్న ఏ చర్మ వ్యాధి అయినా ఏదో ఒక దశలో సోరియాసిస్ గా మారే ప్రమాదమే ఎక్కువ. అందుకే ఈరోజు చర్మవ్యాధి రేపటి సోరియాసిస్ అనుకొని వెంటనే డాక్టర్ ను సంప్రదించడం ఎంతో అవసరం.


గమనించాలే గాని సొరియాసిస్ ముందే గుర్తించడం ఏమంత కష్టం కాదు. నిజానికి, సోరియాసిస్ పూర్తి స్థాయిలో ఒక వ్యాధిగా రూపొందడానికి  ముందు నుంచే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వీటిని పూర్వరూపాలు అంటారు.  శరీరం అతిగా చెమట పట్టడం గానీ, అసలే చెమట పట్టకపోవడం కానీ కనిపిస్తుంది. చర్మం నూనె గాను లేదా పొడిగాను కనిపిస్తుంది. వెంట్రుకలు నిలబడడం ,చర్మం సహజరంగు కోల్పోవడం వంటి కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. చర్మం ఏ కారణంగా ఆయన గాయమైనప్పుడు ఎక్కువ రోజుల దాకా మానకపోవడం కూడా గమనించవచ్చు. మాలి కన్నా శరీరంలోని వాత పిత్త కఫాల లో  ఏర్పడే లోపాలు సొరియాసిస్ కు కారణమవుతాయి.

ప్రకోపాలే మూలం ................

ఒకవేళ వాతప్రకోపం తోనే సొరియాసిస్ వస్తున్నప్పుడు శరీరమంతా నల్లగా మారిపోతుంది. దద్దుర్లు వచ్చి బాగా దురదగా ఉంటాయి. చర్మం పొట్టులా రాలుతుంది. ఒకవేళ వ్యాధి పిత్త ప్రకోపం వల్ల వచ్చి ఉంటే, చర్మం మేడిపండు రంగులోకి మారుతుంది. దురద మంట ఉంటాయి అతిగా చెమట రావడం చెమట వాసన వేయడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఒకవేళ కఫము  ప్రకోపం చెందడం వల్ల సొరియాసిస్ వచ్చి ఉంటే చర్మం పొడిబారి గాని, నూనె గానీ కనిపిస్తుంది. చర్మమంతా ఏనుగు చర్మంలా మారి, దురదగా ఉంటుంది. వ్యాధి తీవ్రమైనప్పుడు ఆ ప్రభావం శరీరంలోని సప్తధాతువుల మీద కూడా పడి, ధాతుక్షయం జరుగుతున్నప్పుడు ధాతు సంబంధమైన లక్షణాలు సైతం  కనిపిస్తాయి. రసధాతువు దెబ్బతిన్నప్పుడు చర్మం తన సహజత్వాన్ని కోల్పోతుంది. చర్మం పొడిగా మారడం, కొందరిలో చెమట  అతిగా రావడం కనిపిస్తుంది. కొందరిలో స్పర్శజ్ఞానం తగ్గిపోతుంది. అలాగే రక్తదాత దెబ్బతిన్నప్పుడు ఒళ్ళంతా మచ్చలు ఏర్పడి వాటిలో చీమూ, ఏర్పడి చెడు వాసన వేస్తుంది. మాంస ధాతువు దెబ్బతిన్నప్పుడు చాలా మందంగా మచ్చలు ఏర్పడతాయి. మేధో ధాతువు ప్రభావితమై విపరీతంగా చెమటలు రావడం తో పాటు మచ్చలు తయారై అందులో చీము ఏర్పడి బాగా చెడు వాసన వేస్తుంది. పార్టీలో నుంచి బాగా క్రీములు కూడా పుట్టుకొస్తాయి. అఖిలతో ప్రభావితం అయినప్పుడు కీళ్లల్లో నొప్పులు మొదలవుతాయి. ముక్కు దూలం వంకర పోవడం, కళ్ళు ఎర్రబారడం, సుప్రభాతం ప్రభావితం అయినప్పుడు జననాంగాల మీద మచ్చలు ఏర్పడడం అంగంలో నొప్పి రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

స్కాల్స్ (కపాలం) సోరియాసిస్......

అత్యధికుల్లో అంటే 90 శాతం మంది లో సోరియాసిస్ తలమీదే మొదలవుతుంది. ఆ తర్వాత క్రమంగా శరీరంలోని ఇతర భాగాలకు పాకుతుంది. రెండు మూడు రోజులు తల స్నానం చేయకుండా ,అలాగే ఉండిపోయి ఆ తరువాత తల దువ్వితే  తల నుంచి పడే సన్నని పొడి అది చుండ్రు. పొడిలా కాకుండా చిన్న చిన్న పెచ్చుల్లా , పెలుసుల్లా రాలి పడితే అది సోరియాసిస్. సాధారణంగా చుండూరు తల భాగం అంతా ఆవరించి ఉంటుంది సోరియాసిస్ మాత్రం తల మీద అక్కడక్కడ బిల్లలు బిలలుగా  ఏర్పడి పెచ్చులు గా లేస్తుంది. పైగా ఈ స్కాల్స్ సోరియాసిస్ ,తల భాగానికి పరిమితం కాకుండా నుదురు, చెవుల వెనుక, మెడ కింది భాగానికి  కూడా పాకుతుంది.

 నెల్ ( గోళ్లు)  సోరియాసిస్......

ముందు కపాలం లో మొదలైన సోరియాసిస్ అత్యధికుల్లో వొళ్ళంతా పాకి ఆ తర్వాత గోళ్ళ లోకి పాకుతుంది.కొందరిలో ఒంటిమీద పాక కుండానే  తల నుంచి నేరుగా గోళ్ల మీదకి రావచ్చు .ఈ స్థితిలో గోళ్లు తమ సహజ వర్ణాన్ని  కోల్పోతాయి. ఎక్కువ మందిలో లేత పసుపు రంగులోకి మారతాయి. గోళ్లు పెలుసులు గా లేదా నిర్జీవం గా నూ మారతాయి.

ప్లేక్ సొరియాసిస్........
 ఇది చాలా ఎక్కువ మందిలో కనిపించే సోరియాసిస్. చర్మం మీద ఎక్కడో ఒక చోట చిన్న కురుపులా తయారవుతుంది. అది ఎండిపోయిన పొట్టులా ఉంటుంది. జీవంలేని చర్మకణాలు ఉత్పన్నమై చర్మం మీద ఒక మచ్చలా  ఏర్పడతాయి. ఈ మచ్చలు బాగా దురదగా ఉంటాయి. దురద కారణంగా ఆ కురుపును గోకడం ద్వారా పొట్టు రాలుతుంది. కానీ, ఆ మచ్చ పెద్దదవుతుంది.

గట్టేట్ సోరియాసిస్.......

. ఈ వ్యాధి చిన్నపిల్లల్లో మధ్యవయస్కుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది చిన్న చిన్న మచ్చలు గా ఎరుపు రంగులో ఉండి, ఒకదానితో ఒకటి కలవకుండా శరీరమంతా వ్యాపించి ఉంటాయి. ఇవి ఎక్కువగా చాతి, వీపు భాగంలోనే వస్తాయి. ఇందులో చాలా దళసరి మచ్చలు ఏర్పడతాయి.

ఇన్వర్స్  సోరియాసిస్......

ఈ సోరియాసిస్ ఎక్కువగా చంకల్లో, గజ్జల్లో, చర్మం మడతల్లో వస్తూ ఉంటుంది. అలాగే జననాంగాల లో ను వస్తుంది మచ్చలు మెరుస్తూ ఎరుపురంగులో ఉంటాయి ఈ మచ్చలు గరుకుగా కాకుండా నునుపుగా ఉంటాయి. స్థూలకాయుల్లో ఈ సోరియాసిస్ ఎక్కువగా కనిపిస్తుంది.

ఆస్పెడ్జ్ సైన్.....

 సొరియాసిస్లో కొందరి చర్మం మీద పొక్కులు ఏర్పడి,పోలీసులు ఏర్పడినప్పుడు తీవ్రమైన దురద మొదలవుతుంది. గోటితో గోకి ఆ పొలుసులన్నీ తీసివేసినప్పుడు ఆ బాధను రక్తపు చుక్కలు కనిపిస్తాయి. వీటిని ఆస్పిడ్జ్ సైన్స్ అంటారు.

కొఫినార్ ఫినామీనా. ......

గాయం మానిన తర్వాత గాని సర్జరీ జరిగిన తర్వాత ఘాటు మీద కాని కొందరిలో సోరియాసిస్ మొదలయ్యే వీలుంది. అలా వచ్చే వాటిని కెఫినార్ ఫి నో మీనా అంటారు.

ఫస్ట్ లార్  సోరియాసిస్.....

ఈ సొరియాసిస్ మచ్చలు చీము తో ఉంటాయి .ఈ చీము రక్తంలో కలిసి శరీరమంతా వ్యాపించి నప్పుడు ఇతర అవయవాలు కూడా ఇన్ఫెక్షన్ కు గురై రోగి శరీర మంతా విషతుల్యమవుతుంది. ఒక్కోసారి ఇది సేప్పిస్ వ్యాధికి గురి కావచ్చు. శరీరంలోని కీలక అవయవాలన్నీ  ఒకేసారి దెబ్బతినే  మళ్లీ ఆర్గాన్ ఫెయిల్యూర్ దాకా వెళ్ళవచ్చు. అంతిమంగా ఇది ప్రాణాపాయానికి కూడా దారి తీయవచ్చు.

ఎరిద్రో డేర్మీక్ సోరియాసిస్........

 ఈ సోరియాసిస్ లో వచ్చే మచ్చలని వాపు తోనే ఉంటాయి. ఎరుపు రంగులో ఎత్తుగానూ ,వేడిగా ఉంటాయి. రోగి శరీర ఉష్ణోగ్రత కూడాఎప్పుడు నిలకడగా ఉండదు అయినా అతి తక్కువ వ్యవధిలోనే ఎక్కువ సార్లు పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. ఈ మచ్చలు చాలా పెద్దవిగా దాదాపు మొత్తం వ్యాపించి ఉంటాయి. ఇందులో తీవ్రమైన దురద, నొప్పి వుంటాయి. ఈ మచ్చలు చిన్న చిన్న పేలుసులు గా కాకుండా పెద్ద పెద్ద పొరలుగా ఊడి పోతూ ఉంటుంది.ఈ సోరియాసిస్ చమత్కారాన్ని ఆవరించి ఉండడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగి గుండె వేగం పెరుగుతుంది. మరే సోరియాసిస్ లోని కనిపించని ప్రత్యేక లక్షణం ఇది.

వామ్ జంబూశ్చ్ సోరియాసిస్.... ఇది ఫస్ట్ లార్ సోరియాసిస్, ఏరిద్రో  డెర్మిక్  సోరియాసిస్ ఈ రెండూ కలిసినప్పుడు వచ్చే సోరియాసిస్. అందుకే ఇందులో ఈ రెండింటి లక్షణాలు కనిపిస్తాయి. చీమ తో పాటు అతి పెద్ద మచ్చలు వాపు రావడం వల్ల ఇది సెప్సిన్ గాను మారుతుంది. శరీరంలోని ప్రొటీన్ అంతా వెళ్ళిపోయి శరీరమంతా నిర్జీవంగా మారిన స్థితిలో చీము నిండిపోవడంతో వ్యాధి నిరోధక శక్తి బాగా తగ్గిపోతుంది. అంతిమంగా ఇది ఒక్కోసారి ప్రాణాపాయానికి కూడా దారి తీయవచ్చు. కాకపోతే ఈ ప్రమాదం వయసు పైబడిన వారిలోనే ఎక్కువగా ఉంటుంది. సోరియాసిస్ వ్యాధి బాగా ముదిరే దాకా పట్టించుకోకపోతే దాని వల్ల వచ్చే దుష్ప్రభావాలు ఎక్కువే. ఒకవేళ నిజంగానే అది మరేదో చర్మ వ్యాధి అయినా, దీర్ఘకాలికంగా ఆ వ్యాధి అలాగే ఉంటే చివరకి అది సొరియాసిస్ గా మారే ప్రమాదం ఉంది. అందుకే ఆ వ్యాధి ముందే గుర్తించడం చాలా ముఖ్యం. ఈ లక్షణాలు గురించి తెలిసి  ఉంటే ముందే గుర్తించి ఆయుర్వేద వైద్య చికిత్సతో ముందే బయటపడవచ్చు. ఎక్కడ సోరియాసిస్ అని బయటపడుతుందొనని, వైద్యుని కలవకుండా ఉండి పోతే ఏమౌతుంది? వ్యాధి ముదిరి ఒక్కోసారి సారియటిక్ ఆర్థరైటిస్ వచ్చి కాళ్లు చేతులు వంకర్లు పోయి అంగవైకల్యాన్ని మిగిలిపోవచ్చు. అందుకే లక్షణాలు కనిపించగానే వైద్య చికిత్సలకు వెళ్తే సారియసిస్ యాతన ఏమీ లేకుండా జీవితం హాయిగా సాగిపోతుంది.



డాక్టర్  వర్ధన్  
MD (Ayu): Ph.D: MS (C&P)
Founder & Chief Physician
ఫోన్  : 9056959595

హైదరాబాద్ బ్రాంచీలు :  బషీర్బాగ్ ,తార్నాక , బంజారాహిల్స్
 ఏపీ బ్రాంచీలు : విజయవాడ , తిరుపతి ,కర్నూల్ , రాజమండ్రి

Comments