సైనసైటిస్ : What Is Sinus | Ayurvedic Remedies for SINUS Infection:Dr Madhuri | Vardhanayurveda




సంపదో , సంతోషమో  అయితే శాశ్వతంగా ఉండిపోవాలి అనుకుంటాం.
అది గాయాల్లో,వ్యాధులో  అయితే వెంటనే తగ్గి పోవాలని అనుకుంటాం.
కాకపోతే కొన్ని వ్యాధుల ధోరణి అందరూ అనుకునే దానికి పూర్తి విరుద్ధంగా ఉంటుంది.ముఖ్యంగా  సైనస్ లాంటి వ్యాధులు సకాలంలో సరైన చికిత్స  ఏది అందకపోతే,జీవిత కాలమంత వేధిస్తాయి.

సమస్య ఏమిటంటే ,పాశ్చత్య   వైద్య విధానాలకు మనం బాగా ప్రభావితం అయిపోయాం. ఆ తర్వాత మళ్లీ మళ్లీ వచ్చిన పరవాలేదు కానీ,తక్షణమే తగ్గిస్తే చాలు అనే ఆలోచనా విధానం ఆధునిక వైద్య విధానాలకు ఉంది.ఆ తర్వాత మళ్లీ వచ్చిన పరవాలేదు కానీ, తక్షణమే ఉపశమనం లభిస్తుంది చాలు అని పేషేంట్  కూడా అనుకుంటాడు.అందుకే ఆ తరహా వైద్య విధానాలు బాగా చెల్లుబాటు అవుతున్నాయి .

ఎంత ఆధునిక వైద్య విధానమైన మూలాలు తెలియకుండా చేస్తే ఎలా సత్ఫలితాలు సాధిస్తుంది.?


అన్నం తీసుకోవడంలో ఏదైనా ఇబ్బంది ఉంటే కొంత భరించవచ్చు. నీళ్లు తాగడం లో ఇబ్బంది ఉన్నప్పుడు ఎలా గోలా  కొంత తట్టుకోవచ్చు.కానీ, అన్నిటికన్నా ప్రాణప్రదమైన శ్వాసక్రియలో ని ఇబ్బంది ఉంటే ఏమిటి చేయడం ?సమస్య తగ్గినట్లే తగ్గి మళ్లీ రావడం,పలుమార్లు ఆ పరిస్థితి ఎదురు కావడం సమస్య కదా!

 వాయు వాహికలో  వాపు రావడం కదా సైనసైటిస్ అసలు సమస్య. వాతావరణ కాలుష్యాలు,పుప్పొడి ,కంపరం పుట్టించే అంశాలు రసాయనాలు ,వైరస్, బ్యాక్టీరియాల తో తలెత్తే ఇన్ఫెక్షన్లు సైనసైటిస్ కు  ఇవే కారణం అనేది ఏది సాధారణ అవగాహన .కానీ వాటి బారిన పడిన వారందరికీ సైనసైటిస్ సమస్య రావడం లేదు కదా! శరీర
ధర్మాన్ని చక్కదిద్దటం మౌలిక ధర్మంగా భావిస్తుంది.సహజంగా సైనస్ గదుల్లో కి చిన్న రంధ్రంలో నుంచి నిరంతరంగా గాలి వెళ్తూ ఉంటుంది.ఏ కారణంగానైనా ఈ రంధ్రాలు మూసుకుపోతే గాలి వాటిలోకి ప్రవేశించడం సాధ్యం కాదు.ఇదే కారణంగా సైనస్ గదులోని  ద్రవాలు బయటకు రావడం కూడా  జరగదు. ఫలితంగా ఇన్ఫెక్షన్లు మొదలవుతాయి.

తలనొప్పి ముఖమంతా కందిపోవటం , దంతాల నొప్పి వీటితో పాటు కొందరికి జ్వరం కూడా రావచ్చు.కొందరికి ఇతర లక్షణాలలో గొంతు నొప్పి,ముక్కులో నుంచి వచ్చే ద్రవాలు రంగు మారిపోవడం. ముక్కుదిబ్బడ వేయడంతో దగ్గు కూడా రావచ్చు .కొందరికి ముందుకు వంగినప్పుడు తలంతా  భారం గాను, తీవ్రమైన తల నొప్పిగా అనిపిస్తుంది. కొన్ని రకాల అలర్జిక్ సైనసైటిస్ ల లో కళ్ళు దురద పెట్టడం ,అదేపనిగా తుమ్ములు రావచ్చు.

ఆయుర్వేద వైద్యం గా ఆయుర్వేద  మూలికలతో ఇచ్చే శమన చికిత్సలతోపాటు స్నేహనం ,స్వేదనం , నస్యం ,వమనం విరేచనం వంటి  చికిత్సలు ఉంటాయి. ఈ వైద్య చికిత్సలు తీసుకుంటున్న క్రమంలో చల్లని పదార్థాల కు , చల్లని వాతావరణానికి దూరంగా ఉండటం కూడా అంతే ముఖ్యం .ఈ జాగ్రత్తలతో పాటు ప్రాణ మాయం కూడా చేస్తే, సమస్య మరోసారి తలెత్తే అవకాశమే ఉండదు.




డాక్టర్  మాధురి  వర్ధన్  
MD (Ayu) (Gynecologist & Infertility Specialist)
ఫోన్  : 9056959595

హైదరాబాద్ బ్రాంచీలు :  బషీర్బాగ్ ,తార్నాక , బంజారాహిల్స్
ఏపీ బ్రాంచీలు : విజయవాడ , తిరుపతి ,కర్నూల్ , రాజమండ్రి

Comments