వెన్ను నొప్పికి మర్మ చికిత్సలు | Amazing Ayurvedic Treatment For Backpain |VardhanAyurveda||Dr Madhuri
ఏదోలే అనుకుంటే ,ఎంత పని అయిపోయింది ? అంటూ ఆ తర్వాత ఎప్పుడో వచ్చే వారే ఎక్కువ .వెన్ను నొప్పులకు సకాలంలో సరైన చికిత్స అందకపోతే ఎవరి పని అయినా ఇంతే! నిజానికి అనారోగ్యం అన్నదీ పైకి కనిపించే శరీర విభాగాల మీదే మొత్తంగా ఆధారపడి ఉండదు. ప్రత్యేకించి వెన్ను నొప్పి సమస్య మూలాలు ఎంతో లోతైనవి. ముఖ్యంగా పైకి కనిపించని మర్మల లోని లోపాలు, వెన్నుముకె కేంద్రంగా ఉండే చక్రాలు లేదా శక్తి కేంద్రాల లోపలే ఇందుకు అసలు కారణం.
ఒక విశిష్ట వ్యవస్థ
వెన్నుముక నిజంగా శరీరంలో కెల్లా ఒక అద్భుతమైన నిర్మాణం. మొత్తం శరీరంలోని అదొక మూలస్తంభంలా ఉంటుంది. వెన్నుముక లో మొత్తం 33 పూసలు వాని మధ్య 33 డిస్క్లు ఉంటాయి. కదలికల్లో వెన్నుపూసలు ఒరుసుకుపోకుండా వాటి మధ్య కుషన్ లా ఉంటూ శరీరం ఏ వైపు అయినా తిరగడానికి ,వంగడానికి అనువుగా ఇవి తోడ్పడుతుంటాయి. వెన్నుపాముకు ఇతర నగరాలకు వెన్నుదన్నుగా ఉంటాయి. నరాల నేవీ మొత్తం శరీరమంతా విస్తరించి ఉంటాయి. వెన్నుముక చుట్టూ ,కండరాలు లిగమెంట్లు, టెండాన్లు ఉంటాయి. ఇవన్నీ నిర్మాణ వ్యవస్థకు సంబంధించిన విషయాలు. శక్తి పరమైన విషయాల్లో కి వెళితే మాత్రం ,కొన్ని అద్భుత విషయాలు కనిపిస్తాయి. శక్తి అనేది శరీరానికి ప్రాణం .ఆ శక్తిని అందించడానికి శరీరంలో 6 శక్తి కేంద్రాలు ఉన్నాయి. వీటికే షట్ చక్రాలు అని పేరు. శరీరంలో అడుగు భాగంలో అంటే విసర్జన భాగంలో ఉండేది, మూలాధార చక్రం ,వీటికి పైన జననాంగానికి దగ్గరగా స్వాధిష్టాన చక్రం ఉంటుంది .నాభి వద్ద మణిపూరక చక్రం ఉంటుంది. అలాగే గుండె దగ్గర అనాహత చక్రం ఉంటుంది. గొంతు వద్ద విశుద్ధ చక్రం ఉంటుంది .రెండు కాళ్ళ మధ్య మూడో నేత్రములు ఆగ్నేయ చక్రం ఉంటుంది. ఇవి కాకుండా ,తలమీద బ్రహ్మ రంద్రం వద్ద సహస్రార చక్రం కూడా ఉంటుంది. ఇవన్ని శక్తి చక్రాలు ఇవి నిరంతరం తిరుగుతూ ఉంటాయి .అలా తిరుగుతూ తిరుగుతూ , తమలోని శక్తిని ఒక చక్రం నుంచి మరో చక్రానికి ప్రసరింపచేస్తూ ఉంటాయి. ఆజ్ఞా చక్రం నుంచి మూలాధార చక్రం దాకా వెళ్ళిన శక్తి, తిరిగి మళ్ళీ ఆజ్ఞా చక్రం దాకా శక్తి వెళుతూ ఉంటుంది . అలా వెళుతున్నప్పుడే మనిషి ,ప్రాణ వంతంగా సంపూర్ణ శక్తివంతంగా ఉంటాడు.
వెన్నెముకే కేంద్రంగా :-
మొత్తం ఏడు చక్రాల్లో , మూలాధార చక్రం నుంచి ,విశుద్ధ చక్రం దాకా మొత్తం 5 చక్రాలు వెన్నుముక కేంద్రంగానే ఉంటాయి.ఈ చక్రాలు శక్తిని, నిరంతరం పైనుంచి కిందికి కింద నుంచి పైకి ప్రసరింప చేస్తూ ఉంటాయి .అలాగే మర్మాలు అని కొన్ని ప్రత్యేకమైన బిందువులు ఉంటాయి. మాంసం, సిరలు , స్నాయువు, అస్థి అనగా ఎముకలు ,సంధి ఇవన్నీ కలిసే బిందువులనే మర్మ కేంద్రం అంటాం .మొత్తంగా ఈ కేంద్రాలు అయితే ,శరీరంలోని ఏడు చక్రాలు 14 కీలక నాడులు ఒకదానితో ఒకటి అనుసంధానం అయి ఉంటాయి .మొత్తంగా చూస్తే శరీరంలో 75 వేల నుంచి మూడు లక్షల 50 వేల దాకా ఉంటాయి . నాడీ అంటే అది ప్రధాన రక్తనాళంలో కావచ్చు.లేదా సిరలు , ధమనులు కావచ్చు. ఇవన్నీ తిరిగి మర్మాలతో ముడిపడి ఉంటాయి. ప్రధాన శక్తి కేంద్రాలని , ఉపశక్తి కేంద్రాలని మర్మాలని అంటారు . శరీర వ్యవస్థను నడిపే ప్రాణశక్తి ,చక్రాల నుంచి ,
నాడులకు, నడులనుంచి,మర్మాలకు , అలా మొత్తం శరీరానికంతా పయనిస్తూ ఉంటుంది.
అడ్డంకి ఏర్పడితే:-
సమస్త నాడీ వ్యవస్థకు, హార్మోన్ సంబంధితమైన ఎండోక్రైన్ వ్యవస్థ ప్రాణ శక్తే ఇంధన లాంటిది. నిజానికి ఈ వ్యవస్థలన్నీ చక్రాల ఆరోగ్యం మీదే ఆధారపడి ఉంటాయి. చక్రల్లోంచి వచ్చే శక్తి సమస్త నాడుల ద్వారా అనునిత్యం నిరాటంకంగా ప్రచురించడమే ఆరోగ్యం .ఎక్కడైనా ఎ నదిలోనో అడ్డంకి ఏర్పడినప్పుడు ఆ దిశగా శక్తి సజావుగా ప్రసరించదు .ఇదే అత్యధిక రోగాలకు మూల కారణం .మనిషి ఆరోగ్యం వెన్నుముకల మీద,వాటి మీదే కేంద్రీకృతమై ఉండే చక్రాల మీదే ఆధారపడి ఉంటుంది .ప్రధాన శక్తి కేంద్రాలు , ఉప శక్తి కేంద్రాలు వీటన్నిటికీ ప్రధాన వేదిక వెన్నుముకె. అందుకే చక్రాలు , నాడులు ,ఉప నాడులు , భావుతికా రూపం ,మనోరూపం ,శక్తి రూపం ఇవన్నీ వెన్నుముకలో కేంద్రంగానే ఉంటున్నాయి .అందువల్ల వెన్నుముకను సహజ జీవన శైలితో కాపాడుకోవడం అంటే , అవసరమైనప్పుడు వైద్య చికిత్సలను తీసుకోవడం అంటే, అది మొత్తం శరీర శక్తి వ్యవస్థను కాపాడుకోవడమే అవుతుంది . వెన్ను సమస్య తో నే వచ్చినా ,చికిత్సలో భాగంగా ఉండే మర్మ చికిత్సల వల్ల వెన్నునొప్పి తగ్గడంతో పాటు అతని ప్రాణ శక్తి కూడా బలోపేతం అవుతుంది .శరీరంలో ఏదోఒక మర్మం వద్ద అడ్డంకి ఎర్పడినప్పుడు ఆయుర్వేదం కేవలం అడ్డంకిని తొలగించడంతోనే ఆగిపోదు . అలా శక్తి వాహికలోని అడ్డంకులన్నీ తొలగిస్తుంది . అప్పుడిక మిగతా నాదుల్లోంచి శక్తి సరిగా ప్రసరిస్తుంది .అలాగే ,14 కీలక నాడులలోంచి కూడా శక్తి ప్రసరితమై ,ఆ తరువాత చక్రాల వ్యవస్థ చెక్కబడి ,అదే క్రమంలో వెన్నుముక సమస్యలు తొలగిపోతాయి . మొత్తంగా చుస్తే మనిషి ప్రాణశక్తి ఉత్తేజితమవుతుంది .
వాత వ్యాధుల మాటేమిటి :-
మౌలికంగా ప్రాణశక్తి శరీరమంతా ప్రసరించడానికి వాతమే వాహిక గా ఉంటుంది .అయితే ఏ కారణంగానైనా వాతం సమస్థితిని కోల్పోయి ,వాతం ప్రకోపానికి గురైతే , అప్పుడు ప్రాణశక్తి ప్రవహించడం లో అంతరాయం ఏర్పడుతుంది. అంతరాయం వల్ల శరీరం 80 రకాల వ్యాధులు గురయ్యే ప్రమాదం ఉంది. వాటిలో వెన్నునొప్పికి ,సయాటికా సమస్యను కారణమయ్యే గృధ్రసీ వాతం ఒకటి . ఆరు చక్రాల్లో ప్రత్యేకించి, మూలాధార, స్వాదిష్టాన ,మణిపూరక చక్రాల్లో జరిగే వాతప్రకోప ప్రభావమే సయాటికా సమస్యకు దారితీస్తుంది. నిజానికి ఈ మూడు చక్రాలు నాభికి కింద భాగాన ఉంటాయి. అందుకే వెన్నునొప్పి సమస్యలు ,పురుషుల్లో అంగ స్తంభన సమస్యలు, స్త్రీలలో జననాంగం పాడి పారిపోవటం ,సంతాప లేమి సమస్యలు తలెత్తుతాయి. వీటితోపాటు మలబద్దకం, కీళ్లనొప్పులు ,అర్శమొలలు ,స్థూలకాయం ,డిప్రెషన్ వంటి సమస్యలు మొదలవుతాయి. ఇక జనగంగా సమస్యలు ,గర్భాశయ సమస్యలు, కిడ్నీ సమస్యలు, వెన్నునొప్పి, ప్రైబ్రాయిడ్స్, సంతానలేమి సమస్యలు ఇవన్నీ స్వాధిష్టాన చక్ర లోపాలవల్ల తలెత్తుతాయి. ఇక మణిపూరక చక్రం సంబంధిత సమస్యలు తలెత్తినప్పుడు, జీర్ణాశయ సమస్యలు, లివర్ సమస్యలు, అలర్జీలు సమస్యలు, గాల్ బ్లాడర్ సమస్యలు ఇవన్నీ మొదలవుతాయి.
గిరి గీతలు సరిపోవు:-
షట్చక్రాల్లో ఆటంకం ఏర్పడి ,ఈ చక్రల్లోంచి ఆ శక్తి విడుదల కానప్పుడు ఆ వ్యక్తి రోగగ్రస్తులు అవుతాడు. విధినిర్వహణలో బాగా వెనుక పడతాడు. శరీరకంగా మానసికంగానూ, జీవితాన్ని ఆస్వాదించే స్థితిని కోల్పోతాడు. దీనికంతా శరీరానికంతటికీ మూలాధారమైన చక్రాల వ్యవస్థ సమస్యలను కూడా తొలగించకపోతే క్రమంగా అది మొత్తం మనిషి అస్తిత్వాన్ని దెబ్బతీస్తుంది.పెయిన్ కిల్లర్స్ ను ఆశ్రయించడమే, లేదా సర్జరీలతో సరిపెట్టుకోవడం వంటి తాత్కాలిక ఉపశమనాలు పరిమితమైతే, సమస్య నానాటికీ తీవ్రమై పరిస్థితి మరింత విషమిస్తుంది . సమస్య తాలూకు దుష్పరిణామాలు జీవితామంతా ఉండిపోతాయి .కొన్నాళ్ళు పొతే శారీరక వైకల్యంతో పాటు మానసిక వైకల్యం కూడా మొదలవుతుంది.
మర్మ చికిత్సలే మందు:-
సమస్య మూలాలు మర్మల్లో , మహా మర్మాల్లో ఉన్నప్పుడు మర్మ చికిత్సలే సరైన సిసలైన వైద్యం అవుతాయి. ఆ చికిత్సలు అందకపోతే, శరీరంలోని సమస్త వ్యవస్థలు సాధారణంగా క్షీణిస్తూ వెళతాయి . ఆ స్థితిని అడ్డుకోవడానికి ఈ మర్మ చికిత్సలు తప్ప మరో మార్గం లేదు .కాకపోతే మీ మర్మ చికిత్స నిష్ణాతులైన ఆయుర్వేద వైద్యులు చేసినప్పుడే సత్ఫలితాలు వస్తాయి. ఈ చికిత్సలతో అప్పటిదాకా ఉన్న సమస్యలన్నీ తొలగిపోవడంతో పాటు మునుముందు రాబోయే పలురకాల వ్యాధులకు ముందే అడ్డుకట్టపడుతుంది .ఈ క్రమంలో ప్రత్యేకంగా సమస్యలకు మేరు చికిత్స, లైంగిక సమస్యలు ఉన్నవారికి వాజీకరణ చికిత్సలు కూడా ఉంటాయి. చికిత్సలు అన్ని పూర్తయ్యే శరీరంలో శక్తి వ్యవస్థ బలపడి ,మునుపెన్నడూ లేని ఉత్సాహం కార్యదక్షతా ,సొంతం అవుతాయి.రోగగ్రస్తుడ్ని ఆరోగ్యవంతుణ్ణి చేయడమే కాకుండా ఆరోగ్యం మరింత శక్తిమంతుణ్ని, చేయడంలో అద్భుతంగా పనిచేస్తాయి.శరీర ధర్మాన్ని, సమస్య తీవ్రతను అనుసరించి వైద్య చికిత్సలు ఉంటాయి. సాధారణంగా ఆరోగ్యవంతునికి చేసే మర్మ చికిత్సలు రెండు వారాల నుంచి 3 వారాల పాటు కొనసాగుతాయి. వ్యాధి గ్రస్తులు అయితే ఈ చికిత్సను రెండు వారాల నుంచి మూడు మాసాల దాకా ఉంటాయి.మర్మ చికిత్సలు వెన్నునొప్పి సమస్యలను సమూలంగా తొలగించి ,రోగిని సర్వశక్తివంతుణ్ణి చేస్తాయి. ఏమైనా మర్మ చికిత్సలు మానవాళి పాలిట కచ్చితంగా గొప్ప వరం లాంటివి.
డాక్టర్ మాధురి వర్ధన్
MD (Ayu) (Gynecologist & Infertility Specialist)
ఫోన్ : 9056959595
హైదరాబాద్ బ్రాంచీలు : బషీర్బాగ్ ,తార్నాక , బంజారాహిల్స్
ఏపీ బ్రాంచీలు : విజయవాడ , తిరుపతి ,కర్నూల్ , రాజమండ్రి
Comments
Post a Comment