కీళ్ల నొప్పులే కదా ! పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే తగ్గిపోతాయిలే అనుకుంటూ కొందరు . అంతగా అయితే కీలు మార్పిడి చేయించుకుంటే సరి . ఆ తరువాత జీవితమంతా నిశ్చింతగా ఉండిపోవచ్చని కొందరు . ఇలా అర్ధం లేని దీమాతో చాలా మంది కాలం గడిపేస్తున్నారు . నిజానికి కీళ్ల నొప్పులు రావడానికి గల అసలు కారణం శరీరంలో ఆమం పేరుకుపోవడమే . అసలు కారణమైన ఆమాన్ని తొలగించకపోతే ఒక కీలు తర్వాత మరో కీలు తెబ్బతింటూ చివరికి శరీరం విరిగి పడిన ఎముకల గుడవుతుంది .అందుకే కీళ్ల నొప్పులను సములం గా తొలగించే ఆయుర్వేద చికిత్సలను ఆశ్రయించడమే ఏకైక మార్గం అంటున్నారు డాక్టర్ వర్ధన్ , డాక్టర్ మాధురి వర్ధన్ .
ఆర్థరైటిస్..... కీళ్లనొప్పులకు మారుపేరు. కీళ్లు అరిగి అరిగి ఒక దశలో అంగవైకల్యం మిగిలిపోయే ఒక తీవ్ర సమస్య. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 350 మిలియన్ల మంది ఆర్థరైటిస్ సమస్యతో బాధపడుతున్నారు. ఇది కొద్దిపాటి నొప్పితో మొదలై, చివరికి జీవితాన్నే స్తంభింపచేస్తుంది. ఈ సమస్య ఎప్పుడూ పెద్ద వయసులోనే అని కాదు, 20 నుంచి 80 దాకా ఎవరికైనా రావచ్చు .దీనికంతా జీవనశైలి లోపాలే కారణం. ఇటీవల కాలంలో బాడీ బిల్డింగ్ కోసం ఎక్కువ గంటలు జిమ్ లో గడపడం, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, రోజుకు పది గంటలకు పైగా కంప్యూటర్ వర్క్ లో ఉండిపోవడం, ఎక్కువగా టీవీ చూస్తూ ఉండిపోవడం, రోజంతా బైక్ మీదే తిరగడం, మొబైల్ ఫోన్లో గంటల పర్యంతం మెసేజ్ లు పంపుతూ ఉండిపోవడం, ఇలా ఎంతసేపు మైండ్ గేమ్స్ తప్ప వాకింగ్ గానీ, మరే శరీర శ్రమ లేకపోవడం గానీ , ఈ కీళ్ల నొప్పులకు అంటే ఆర్థరైటిస్ సమస్యకు దారితీస్తున్నాయి .
ఈ సమస్య మొదట్లో పెద్ద వ్యాధి గా ఏమీ అనిపించదు. కాకపోతే కొన్నిసార్లు మాత్రం లక్షణాలు కనిపిస్తాయి. కూర్చున్నా , లేచినా , కాస్త అ సౌకర్యంగా అనిపించడం, కాలు పట్టేసినట్లో , లేదా జారిపోతున్నట్లో అనిపించడం వంటి ఆర్థై రిటిస్ లక్షణాలు కనిపిస్తాయి.. పదే పదే కాలు బెనకడం నుంచి కీళ్లలో మోకాళ్ళ లో టక్ టక్ అనే శబ్దం రావడం దాకా ఇన్నీ ఆర్థరైటిస్ లక్షణాలే.
కొంతమందిలో అంతకుముందెప్పుడో ప్రమాదవశాత్తు ఎప్పుడైనా పడిపోయి గాయమై ఉంటే, దానికి జీవనశైలి లోపాలు కూడా తోడై, అది కాలక్రమం గా ఆర్థరైటిస్ గా మారవచ్చు,ఆర్థరైటిస్ అంటే కేవలం మోకాళ్ళకే పరిమితమయ్యే సమస్య కాదు . ఏది శరీరం లోని అన్ని కీళ్లలోనూ దెబ్బతీస్తుంది . నొప్పి ముందు మోకాళ్లలోనే మొదలైన , ఆ తరువాత వెన్నుముక ,నడుము ,కటిభాగం , భుజాలు ,మోచేతులు ,మాణికట్లు ,మడమలు ,అలా మొత్తం కీళ్లు ఆర్థరైటిస్ పాలవుతాయి.
నొప్పి ఏ కారణం తో వచ్చిందన్న విషయాన్నీ పట్టించుకోకుండా చాలా మంది నొప్పి తగ్గితే చాలనుకుంటారు .అందుకే పెయిన్ కిల్లర్స్ వేసుకోవడానికే మొగ్గు చూపుతారు .వాస్తవానికి ఈ పెయిన్ కిల్లర్స్ నొప్పి తెలియకుండా చేస్తాయి తప్ప నొప్పి లేకుండా చేయవు .నొప్పి గురించిన సంకేతాలు మెదడుకు చేరకుండా అడ్డుకోవడం ద్వారా పెయిన్ కిల్లర్స్ నొప్పి తెలియకుండా చేస్తాయి . అయితే నొప్పి తెలియకుండా పోయినంత మాత్రాన ఆర్థరైటిస్ సమస్య పోదు .రోజురోజుకూ కీళ్లు తిరిగిపోతూ ,చివరికి కాలుకదపలేని స్థితి ఏర్పడుతుంది .నిజానికి కీళ్ల అరుగుదల అసలు కారణం , శరీరం లో ఆమం పెరిగిపోవడమే .అయితే నొప్పి తగ్గడానికి వేసుకునే ఈ పెయిన్ కిల్లర్స్ శరీరం లోని ఆమాన్ని మరింతగా పెంచుతాయి . చివరికి సమస్య బాగా జఠిలమైపోయాక అల్లోపతి వైద్యానికి వెళితే కీలు మార్పిడి చికిత్స తప్ప మార్గం లేదంటారు .
మోకాలు కీళ్లలో నొప్పి వస్తే, అది కేవలం మోకాళ్ళ కే పరిమితమైన సమస్య అని కాదు కదా ! ముందు సమస్య మోకాళ్లు లోనే మొదలైన ఆ తర్వాత మిగతా అన్ని కీళ్ళకు పాకుతుంది .దానికి కారణం ఎముకలకు మూలమైన అస్థిధాతువు క్షీణించడమే .అస్థిధాతువు క్షీణించడానికి ,శరీరంలో ఆమం పేరుకుపోవడమే అసలు కారణం .ఆమం పేరుకు పోవడానికి జీర్ణక్రియ నుంచి శరీరంలో సమస్త దేహక్రియలన్నీ పాడైపోవడం మూలం .ఈ స్థితిలో ఆమాన్ని హరించే చికిత్స చేయాలి. అందుకు దేహక్రియలను చైతన్య పరుస్తూ, ధాతు వృద్ధిని కలిగించే ఔషధాలు ఇవ్వాలి .అందుకు ఆయుర్వేదంలోని పంచకర్మ చికిత్సలు, రసాయన చికిత్సలు అవసరమవుతాయి. కీళ్లకు వెన్ను దన్నుగా ఉండే కండరాలు, లిగమెంట్లు ,టెండాన్లు వీటన్నింటినీ శక్తివంతం చేసే మర్మ చికిత్స కూడా అవసరమవుతాయి. దేహ క్రియలు ,సప్త ధాతువుల లోపాలు పట్టించుకోకుండా కీళ్లమార్పిడి చేయించుకుంటాం . మాకేమిటి ? అనుకుంటూ ఉండిపోతే, అప్పుడు మోకాళ్ళు కిల్లె కాదు శరీరంలోనీ ప్రతి కీలు నూ మార్చవలసి వస్తుంది .ఒకవేళ ఎవరైనా అప్పటికే కీలు మార్పిడి చేయించుకుని ఉంటే, ఆ తరువాతయినా , ఆయుర్వేద చికిత్స చేయించుకోవాలి. లేదంటే ఆ సమస్య మిగతా కీళ్లకు కూడా పాకుతుంది. ఫలితంగా శరీరం శిధిలమైపోతుంది. అయితే ,ఆర్థరైటిస్ వల్ల తలెత్తే దుష్ప్రభావాలు ఎన్నయినా ఉండవచ్చు. ఆ సమస్య రావడానికి అసలు కారణం మాత్రం శరీరంలో ఆమం పేరుకుపోవడమే. సమర్థవంతంగా హరించే ఏకైక శక్తి ఎప్పటికి ఆయుర్వేదమే.
|
డాక్టర్ మాధురి వర్ధన్
MD (Ayu) (Gynecologist & Infertility Specialist)
ఫోన్ : 9056959595
హైదరాబాద్ బ్రాంచీలు : బషీర్బాగ్ ,తార్నాక , బంజారాహిల్స్
ఏపీ బ్రాంచీలు : విజయవాడ , తిరుపతి ,కర్నూల్ , రాజమండ్రి
MD (Ayu) (Gynecologist & Infertility Specialist)
ఫోన్ : 9056959595
హైదరాబాద్ బ్రాంచీలు : బషీర్బాగ్ ,తార్నాక , బంజారాహిల్స్
ఏపీ బ్రాంచీలు : విజయవాడ , తిరుపతి ,కర్నూల్ , రాజమండ్రి
Comments
Post a Comment