వాతాన్ని వదిలేసి, వెన్ను నొప్పికి సర్జరీలా? | Ayurvedic Treatment For Back Pain | Meru chikista




వెన్ను  సమస్యలన్నింటికి అసలు కారణం శరీరంలో వాతం పెరిగిపోవడమే. ఆ వాతం వాయు రూపంలో ఉండడం వల్ల ఏ స్కానింగ్లోనూ  కనిపించదు. ఏమీ కనిపించలేదని నార్మల్ అని వదిలేస్తే, కొద్ది రోజుల్లో సమస్య విషమించిపోతుంది. కనిపించలేదని వాతాన్ని వదిలేసి సర్జరీకి సిద్ధమైతే వెన్నునొప్పి తగ్గకపోగా, మరికొన్ని కొత్త సమస్యలు మొదలవుతాయి అంటున్నారు. ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ వర్ధన్, డాక్టర్ మాధురీ వర్ధన్.....

 నడుము నొప్పి సమస్యకు చాలా కాలం వరకు సరైన వైద్య చికిత్సలు అందకపోతే ఏమవుతుంది? ఎన్నో రకాల దుష్ప్రభావాలు తలెత్తే సమస్య క్రమంగా, మరింత సంక్లిష్టమై పోతుంది. ఈ రోజుల్లో ఈ నడుము నొప్పి సమస్య అతి చిన్న వయసులో అంటే 22 నుంచి 25 వయస్సు లోపే మొదలవుతుంది . వీరిలో సాఫ్ట్ వేర్  ప్రొఫెషనల్స్ సంఖ్య మరి  ఎక్కువ. నడుమునొప్పి సమస్య  తొలి దశలో పరుచుకుపోయినట్లు ,  ఏదో అసౌకర్యంగా అనిపించడం తప్ప, ఆ నొప్పి ఎక్కడి నుంచి వస్తుందో సరిగ్గా తెలియకపోవచ్చు. అయితే కొద్దిపాటి విశ్రాంతితో ఉపశమనం లభించవచ్చు. ఇంకేముంది నొప్పి తగ్గిపోయిందిలే అనుకొని యధావిధిగా క్రికెట్ లాంటి ఆటలు ఆడడం, మార్కెట్ కి వెళ్లి బరువైన సంచి  మోసుకు రావడం, వంటివేవో చేస్తారు.అంతటితో మళ్లీ నొప్పి మొదలవుతుంది. ఈ సారి నొప్పి మునుపటి కన్నా చాలా తీవ్రంగానే ఉంటుంది .వెంటనే మళ్ళీ డాక్టర్ వద్దకు ఎక్స్ రే టెస్ట్ వెళితే  రాస్తారు.

 ఎక్స్ రే  ఎం ఆర్ ఐ పరీక్షలు:

ఎముకల్లో  వచ్చిన మార్పులు, ప్రమాదంలో ఏర్పడిన పగుళ్లు, క్యాల్షియం అదనంగా పెరిగిపోయిన లక్షణాలు ఇది మాత్రమే ఎక్స్ రే లో కనిపిస్తాయి. ఇటీవలే మొదలైన సమస్య ఎంత తీవ్రంగా ఉన్నా అది ఎక్స్ రే  లో   కనబడదు. కనిపించడం లేదన్న కారణంగా డాక్టర్స్ అంతా నార్మల్ గా నే ఉందని పంపించేస్తారు. ఇది చాలా ప్రమాదం.మూడు నాలుగు మాసాల క్రితమే మొదలైన సమస్యతో ఎవరైనా బాధపడుతున్నప్పుడు వారి ఎక్స్ రే  రిపోర్టు ఏమీ కనిపించదు కాబట్టి. ఎలాగో నొప్పి ఉందని చెబుతున్నారు కాబట్టి పెయిన్ కిల్లర్స్ ఇస్తారు.  పెయిన్ కిల్లర్స్ వల్ల కూడా ఉపశమనం రాకపోవచ్చు . ఇలాంటి స్థితిలో డాక్టర్స్ ఎంఆర్ఐ పరీక్ష  చేస్తారు. అయితే కొందరి ఎంఆర్ఐ రిపోర్టులో కొన్ని మార్పులు కనిపించవచ్చు . కానీ రోగికి ఆ వ్యాధి తాలూకు లక్షణాలేమీ కనిపించకపోవచ్చు .కొందరి ఎంఆర్ఐ రిపోర్టులో మార్పులేమీ కనిపించకపోవచ్చు .కానీ రోగిలో  విపరీతంగా ఆ వ్యాధి లక్షణాలు కనిపించవచ్చు. .ఎంఆర్ఐలు కేవలం డిస్కులో వాపు, ఏర్పడిన డిస్క్ సమస్యలు కనిపించవచ్చు. కానీ ఆ వ్యక్తికి డిస్క్ ప్రోట్రూజన్ ,డిస్కు  ఎక్స్ ట్రుజ్ న్ బయటికి వచ్చి వెన్నుపామును నొక్కుతున్న తాలూకు లక్షణాలన్నీ  వేధించవచ్చు.

 అత్యవసరం అయితే నే ..........

ఎంఆర్ఐ అవసరమే కానీ, ఎప్పుడు? ఏ ప్రమాదంలో నో ఫ్రాక్చర్ అయినప్పుడు డిస్కు బెల్ట్ వంటి సమస్యలు ఉన్నప్పుడు వెన్ను భాగంలో కణుతులు  ఏమైనా ఏర్పడ్డాయని చూడాలనుకున్నప్పుడు ఎంఆర్ఐ అవసరమే. సమస్య తీవ్రత కారణంగా ,మలమూత్రాల మీద అదుపు లేకుండా పోయిన స్థితిలో కూడా ఎంఆర్ఐ తప్పనిసరి .

అసలు సమస్య వాతప్రకోపం....

నడుము నొప్పి గానీ ,వెన్నునొప్పి గానీ ,మెడ నొప్పి గానీ, రావడానికి అసలు కారణం శరీరంలో వాతం పెరిగిపోవడమే. అసలు కారణమైన వాతం, నాడీ పరీక్షతో గుర్తించాలే గాని అది ఎక్స్ రే లో గాని ,ఎంఆర్ఐ లోగాని కనిపించదు.వాతప్రకృతి ఉన్నవారికి ఎంఆర్ఐ లో పెద్ద మార్పేమీ కనిపించకపోయినా ,అతడు విపరీతమైన వ్యాధి లక్షణాలతో బాధపడతాడు అదే కఫ పకృతి వ్యక్తుల ఎన్ఆర్ఐ రిపోర్ట్ లో ఎన్నో మార్పులు కనిపించిన అతనికి పెద్దగా నొప్పి ఏమీ ఉండదు. అందువల్ల శరీర ప్రకృతిని అనుసరించి, వ్యాధి తీవ్రతను అంచనా వేయాల్సిందే .మౌలికంగా వాతాన్ని గుర్తించి  హరించే వైద్య చికిత్సలు తీసుకోవడం ఒక్కటే ఈ సమస్యలన్నింటికీ ఏకైక పరిష్కారం.

మేరు చికిత్సలే మహా మంత్రం......

నిజానికి, ఆదిలోనే మతాన్ని గుర్తించగలిగితే చాలావరకు పెయిన్ కిల్లర్స్ , ఎక్స్ రే  , ఎంఆర్ఐ అవసరమే ఉండదు. పదే పదే ఈ పరీక్షలతో కాలయాపన చేస్తే పరిస్థితి విషమించి ఒక దశలో డిస్క్ క్టమీ , ల్యామినెక్టమీ వంటి  సర్జరీల దాకా వెళుతుంది.ఒకవేళ సమస్య ఇంకా ముదిరి రెండేసి, మూడేసి డిస్కులు దెబ్బ తిన్నప్పుడు వాటిని కలిసి ఒక ప్లేట్ కు బిగించే చికిత్స చేస్తారు. దీని వల్ల నడుము బిగుసుకుపోయి సహజమైన కదలికలకు అంతరాయం ఏర్పడుతుంది .పైగా ఆ పక్కనున్న డిస్కులు  కూడా దెబ్బతినిపోతాయి .అందువల్ల మలమూత్రాలు  ఆగిపోయి ఒక విషమస్థితిలో తప్ప  సర్జరీ కి వెళ్లకపోవడమే అన్ని విధాలా శ్రేయస్కరం. వాతం పెరగడం వల్లే ఎముకలకు సంబంధించిన  అస్థి ధాతువు క్షీణించి దురవస్థలు మొదలవుతున్నాయి. అందుకే వాతహర చికిత్సలు తీసుకోవడానికి మించిన మరే ఇతర వైద్య చికిత్సలు లేవు .వాస్తవానికి ఆయుర్వేదంలో  మర్మ చికిత్సలు,మేరు చికిత్సలు, బృహ్మణ  చికిత్సలు గొప్ప వరం లాంటివి. అందుకే వాటి జోలికి వెళ్లకుండా సర్వసమగ్రమైన ఆయుర్వేద చికిత్స ద్వారా వెన్నుముక కు సంబంధించిన సమస్త సమస్యల నుంచి సంపూర్ణంగా విముక్తి పొందవచ్చు.




డాక్టర్  మాధురి  వర్ధన్ 
MD (Ayu) (Gynecologist & Infertility Specialist)
ఫోన్  : 9056959595

హైదరాబాద్ బ్రాంచీలు :  బషీర్బాగ్ ,తార్నాక , బంజారాహిల్స్
ఏపీ బ్రాంచీలు : విజయవాడ , తిరుపతి ,కర్నూల్ , రాజమండ్రి 

Comments