ఇది ఉండగా వయాగ్రా ఎందుకు?| అంగస్తంభన కోసం ఆయుర్వేదం లో మెరుగైన చికిత్స | Best Ayurvedic Treatment For Erectile Dysfunction
అతని పేరు ఎస్ నాగేశ్వర్. వయసు 43 స్థూలకాయం ఉంది. ఆయనకు ఇద్దరు పిల్లలు. రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా పని చేస్తున్నాడు .గత ఆరేళ్లుగా అతనికి మధుమేహం ఉంది .చాలా ఏళ్లుగా విపరీతంగా మద్యం పొగ తాగే అలవాటు ఉంది. అయితే రెండేళ్లుగా అంగస్తంభనలు సరిగా ఉండటం లేదు అండ్రాలజిస్టును సంప్రదిస్తే వయాగ్రా మాత్రలు వేసుకుని సూచించారు. కొన్నాళ్లు ఈ స్వల్ప మోతాదులో ఫలితం కనిపించిన ఆ తరువాత డోసు పెంచాల్సి వచ్చింది .కానీ, పోనుపోను 100 మి. గ్రాములు మాత్రలు వేసుకున్నాస్థంబనలు రావడం లేదు. మాత్రల ద్వారా ఆశించిన ఫలితం లేకపోగా దుష్ప్రభావాలు అయితే వచ్చాయి .ముఖ్యంగా తలనొప్పి, ముఖం కమిలిపోవడం ,విరోచనాలు ,చూపు మసక బారడం వంటి లక్షణాలు మొదలయ్యాయి. ఈ విషయమై డాక్టర్ కు చెబితే వయాగ్రా మాత్రల కు భిన్నంగా ఇతర విధానాల గురించి చెప్పారు వాటిలో అంగానికి ఇచ్చుకునే ఫినైల్ఇంజెక్షన్ గురించి, అంగంలోని మాత్రలను చొప్పించే విధానం గురించి చెప్పారు. ఒకవేళ ఏవి పని చేయకపోతే, అంగంలోకి పంపించే కృత్రిమ ఇంప్లాంట్లను అమర్చుకోవచ్చని చెప్పారు. అవన్నీ అతడు విపరీతంగా ఆందోళనకు గురయ్యాడు. అవి వద్దని తన సమస్యకు ఆయుర్వేదంలో వైద్యం ఏమైనా ఉందేమో తెలుసుకోవడానికి మా వద్దకు వచ్చాడు.
ఆయుర్వేద పరిభాషలో అంగస్తంభన లోపాన్ని ధ్వజ భంగం అంటారు .దీనికి మౌలికంగా సప్తధాతువుల్లో లోపం ఏర్పడటం కారణం. ప్రాథమికంగా ఆహారపు అలవాట్లు, జీవన విధానంలోని లోపాలే ఉంటాయి. ఇవే ముందు అతనికి మధుమేహం రావడానికీ, ఆ తర్వాత లైంగిక సమస్యలు రావడానికి కారణమయ్యాయి. వీటన్నిటికీ వెనుక అంటే అగ్ని మాంద్యం అంటే జీర్ణ వ్యవస్థ లోటుపాట్లు ప్రధానంగా మూలంగా ఉంటాయి. ఈ లోపాలు ధాతు పోషణ సరిగా జరగనివ్వవు . ధాతు లోపాలతో శ్రోతసుల్లో అవరోధాలు చోటుచేసుకుంటాయి . ఏవి శరీరం లో ని వాతం ,కఫము పెరగడానికి కారణమవుతాయి .వాతాల్లో ప్రత్యేకించి అపాన వాతం వీరిలో పెరుగుతుంది .దాని ఫలితమే లైంగిక సమస్యలు .వాతపరమైన దోషాలు ఏర్పడినప్పుడు కండరాల వ్యవస్థ , నరాల వ్యవస్థ దెబ్బ తింటాయి .రక్త ప్రసరణ లోనూ తేడాలు వస్తాయి .
మధుమేహం వల్ల నరాల వ్యవస్థ దెబ్బతింటుంది. నరాలు దెబ్బతినడం వల్ల అంగస్తంభనా సమస్యలు మొదలవుతాయి. మానసిక, నాడీ ,రక్త ప్రసరణ, హార్మోన్ లోపాలు ,లైంగిక బాగాల్లోని లోపాలు వీటిలో ఏ కారణమైనా స్తంభనా సమస్యకు కారణం కావచ్చు .ఇవే కాకుండా మరికొన్ని ఇతర కారణాలు కూడా ఉంటాయి.
వయాగ్రాతో ఏమవుతుంది? :-
అల్లోపతి డాక్టర్ను సంప్రదిస్తే వయాగ్రా, లెవిట్రా, సియాలిస్ వంటి మాత్రలు రాస్తారు .ఈ మాత్రల వినియోగం చాలా సురక్షితం అని చెబుతారు. కానీ, ఈ మాత్రల వల్ల వచ్చే దుష్ప్రభావాలు ఇన్నీ అన్నీ కావు. వాటిలో ప్రధానంగా తలనొప్పి,ముఖం కమిలిపోవడం, విరోచనాలు కావడం, చూపు మందగించటం, ప్రతిదీ నీలి రంగులో కనిపించడం ,తరచూ తుమ్ములు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి .అంతకు ముందే అధిక రక్తపోటు ,గుండెజబ్బులు ఉన్నవారు ఈ మాత్రలు వాడితే ప్రాణహానికి దారితీయవచ్చు. అంతేకాకుండా మాత్రలను డోసు పెరిగితే అంగస్తంభన నాలుగు గంటలకు పైగా అలాగే ఉండి పోవచ్చు. వెంటనే వైద్య చికిత్స తీసుకోకపోతే శాశ్వత నపుంసకత్వం రావచ్చు.
ఆయుర్వేద చికిత్సలు:-
మధుమేహ నియంత్రణ కోసం నాగేశ్వర్ వేసుకుంటున్న అల్లోపతి మాత్రలను కొనసాగించమని చెప్పాం . కాకపోతే వాటికి అనుబంధంగా కొన్ని ఆయుర్వేద మాత్రలు కూడా సూచించాం. శరీరంలో కల్మషాలు పేరుకుపోవటం వల్ల అతని ధాతువుల్లో లోపం ఏర్పడినందుకు దీపన, పాచన చికిత్సలు చేస్తూ, పంచకర్మ చికిత్సలు చేసాం. ఈ చికిత్సలోనూ ప్రత్యేకించి వాజీకరణ వస్తి చేశాం. మందుల్లో ప్రధానంగా అశ్వగంధ కపికచ్చు సూచించాము. అలాగే లైంగిక శక్తిని పెంచే ఆహార పానీయాలు సూచించాం. పొగతాగడం మద్యం సేవించడం పూర్తిగా మానేయమని చెప్పాం. పంచకర్మ చికిత్సల తరువాత వాజీకరణ ద్రవ్యాలు తీసుకోవటం మొదలైన కొద్ది రోజుల్లోనే అతని స్తంభనల్లో మెరుగుదల కనిపించడం మొదలయ్యింది. ఆ తరువాత స్వల్పకాలంలోనే శృంగారంలో సంపూర్ణంగా పాల్గొనే సామర్థ్యం వచ్చింది. పైగా వయాగ్రా తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనం తాత్కాలికమే. ఆయుర్వేద వైద్య చికిత్సలో ఆ ప్రయోజనం శాశ్వతంగా ఉంటుంది.
డాక్టర్ వర్ధన్
MD (Ayu): Ph.D: MS (C&P)
Founder & Chief Physician
ఫోన్ : 9056959595
హైదరాబాద్ బ్రాంచీలు : బషీర్బాగ్ ,తార్నాక , బంజారాహిల్స్
ఏపీ బ్రాంచీలు : విజయవాడ , తిరుపతి ,కర్నూల్ , రాజమండ్రి
Comments
Post a Comment