ఐబిఎస్ కడుపులో వరద హోరు.....Best Ayurvedic Treatment of IBS | Symptoms Of IBS | Vardhan Ayurveda



ఐబిఎస్ కడుపులో వరద హోరు

సమస్య ఐబిఎస్ అని తెలియగానే చాలా మంది 'ఒంట్లో పుట్టిన జబ్బు అయితే సరే గానీ,పుర్రెలో పుట్టిన దానికి ఎవడేం చెయ్యగలడు? అంటూ పెదవి విరిచేస్తారు.నిజానికి ఐబిఎస్ నూటికి నూరుపాళ్లు ఒంట్లో పుట్టిన సమస్యే. మెదడుకూ జీర్ణ వ్యవస్థకూ మధ్య ఒక సంధానకర్తగా ఉండే గ్రహణి లో సమస్య తలెత్తడమే ఐబిఎస్ కు కారణం.చాలా మంది ఆధునిక వైద్యులు అనుకుంటున్నట్లు ఇది అంతుచిక్కని, ఎవరూ ఏమీ చేయలేని సమస్యేమి  కాదు. ఐబిఎస్ మూలాలు తెలిసిన ఆయుర్వేదం ఒక్కటే ఐపీఎస్ ను సమూలంగా తొలగించగలుగుతోంది అంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ వర్ధన్.

అన్న పానీయాలు చకచకా ముగించుకుని, జీవన వ్యాపకాల్లో పడిపోవాలి గానీ, అన్నం తినాలంటేనే భయమేస్తే ఎలా.?ఐ బి ఎస్ వ్యాధిగ్రస్తుల సమస్యే అది కదా  మరి! భోజనం చేయగానే మరుగుదొడ్డిని వెతుక్కునేలా చేసే ఈ వ్యాధిని ఐబిఎస్ అని గుర్తించడానికే చాలా మందికి ఏళ్లు బడుతోంది. ఎవరో  అనడం కాదు ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఫంక్షనల్ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ డిజార్దర్స్ వారు 2007లో చేసిన తమ అధ్యయన ఫలితాలే ఆ విషయాన్ని చెబుతున్నాయి. ఈ అధ్యయనంలో బయటపడ్డ విషయాల్లో తీవ్రంగా కలవరపెట్టే ఒక ప్రధాన విషయం ఏమిటంటే, వ్యాధి నిర్ధారణ పరీక్షల ద్వారా ఎవరికైనా ఐబిఎస్ ఉన్నట్లు తేలడానికి ఆరున్నర ఏళ్లు పడుతోందని తేలడం.వ్యాధి నిర్ధారణ కావడానికే ఆరున్నరేళ్లు పడితే, అతనికి వైద్య చికిత్సలు అందేదేప్పుడు? ఆ మందులు పనిచేసి అతడు ఆ సమస్య నుంచి విముక్తి పొందేదేప్పుడు? పైకి ఎంతో పురోగతి సాధించినట్లు కనబడుతున్నా ఆధునిక వైద్య విధానాల్లో నేరుగా ఐబిఎస్ ను   గుర్తించే సాంకేతిక పరిజ్ఞానం ఈ నాటికీ లేదు.  మిగతా వ్యాధులు ఏవీ లేవని తేల్చుకోవడం ద్వారా ఇది ఐబిఎస్ అన్న ఒక అభిప్రాయానికి రావడం తప్ప నేరుగా ఇది ఐబిఎస్ అని చెప్పగలిగే నిశితత్వం ఇప్పటికీ లేదు. ఐబిఎస్ లక్షణాలు మొదలైన తొలి నాటి నుంచి వ్యాధి నిర్ధారణ అయ్యే దాకా పరీక్షలు చేస్తూ వెళితే, దాదాపు ఆరున్నర ఏళ్లు పడుతోంది. అన్నేళ్ల కాలంతో పాటు వైద్య పరీక్షల పేరిట వేలకు వేలు ఖర్చు అవుతాయి. కొంతమంది డాక్టర్లు ఆ వ్యక్తికి ఉన్నది క్యాన్సర్ కాదని తేల్చడానికి వేలల్లో ఖర్చయ్యే పెట్ స్కానింగ్ కూడా చేయిస్తున్నారు ఇది ఐబిఎస్ రోగులకు మహాభారమైపోయింది.
.
 లక్షణాలు ఒకటా రెండా ...?

ఐబిఎస్ లో ఉండే మౌలిక లక్షణాల్లో కడుపులో నొప్పి, కడుపు పట్టేసినట్లు ఉండడం కడుపులో అసౌకర్యంగా ఉండడం, కడుపు ఉబ్బరం,మలబద్దకం, విరేచనాలు ఒకదాని తరవాత ఒకటిగా వస్తుంటాయి.రోజుకు మూడు సార్ల కన్నా ఎక్కువగా విరేచనాలు రావటం లేదా వారానికి మూడు సార్ల కన్నా తక్కువగా విసర్జన కావడం ఈ లక్షణాలన్నీ ఐబిఎస్  లో ఉంటాయి. విసర్జన వచ్చిన ప్రతిసారీ పరుగుగా వెళ్లాల్సిన పరిస్థితి. ఎన్నిసార్లు వెళ్లినా  విసర్జన ఇంకా పూర్తి స్థాయిలో కాలేదన్న భావన. మలం జిగురుగా రావడం, ఆకలి మందగించడం, ఏ కొంచెం తిన్నా కడుపునిండినట్లు అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.  రుచి తెలియకపోవడం, వికారం, కడుపులో ఆమ్లాలు పెరగడం, వాంతులు, ఛాతిలో మంట, కడుపులోని ద్రవాలు నోటిలోకి వచ్చే రిఫ్లక్స్ వ్యాధి, జ్వరం, మైగ్రేన్ తలనొప్పి, వెన్నునొప్పి, కండరాల నొప్పి, కీళ్ళ నొప్పి, రాత్రివేళ ఎక్కువసార్లు మూత్రం రావడం, ఎన్ని సార్లు మూత్రానికి వెళ్ళిన పూర్తిగా విసర్జన కాలేదన్న భావన,శృంగారం పట్ల ఆసక్తి లేకపోవడం, స్త్రీలలో అయితే రతి సమయంలో నొప్పి రావటం, నీరసం, నిద్రలేమి,శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దడ, ఒళ్లంతా దురదలు రావడం, వేడికీ, చల్లదనానికి అతిగా స్పందించే స్వభావం, అలసట ఈ లక్షణాలన్నీ కనిపిస్తాయి. ఈ క్రమంలో లో ఈ శరీరం బాగా బలహీనపడి వ్వ్యాధినిరోధక శక్తి బాగా తగ్గిపోతుంది.ఫలితంగా శరీరం ఎప్పుడూ ఏదో ఒక వ్యాధికి గురవుతూనే ఉంటుంది. పైన పేర్కొన్న ఏ ఒక్క లక్షణం ఉన్నా, ఆయుర్వేద నిపుణుడ్ని సంప్రదించవలసిందే.

 పేగు కు సంబంధం లేదు అనిపించే లక్షణాలు.....?

వెన్నునొప్పి, మగతగా ఉండడం, నీరసం, తరచూ జ్వరం రావడం, ఎక్కువ సమయాల్లో తల నొప్పిగా ఉండడం,కండరాల నొప్పి,దడ, అతి నిద్ర,చర్మం అంతా దురదగా   అనిపించడం,వేడికి చలికి అతిగా స్పందించే తత్వం, శ్వాస సరిగా ఆడకపోవడం,పిల్లి కూతలు, శరీరమంతా బిగుసుకుపోవడం,మూత్రనాలంలో ఇన్ఫెక్షన్లు తలెత్తడం ,వంటి లక్షణాలు కనిపిస్తే, ఇవన్నీ పేగులకు ఆవల శరీరంలోని ఇతర భాగంలో  కనిపించని లక్షణాలు. పైకి సంబంధం లేనివి గా అనిపించినా ఇవి ఐబిఎస్ లక్షణాలే.

 ఆయుర్వేదం తిరుగులేని వైద్యం


ఐబిఎస్  రావడానికి  మానసిక ఒత్తిళ్లే  కారణమంటూ ఈనాటికి అలోపతి వారు చేతులు దులిపేసుకుంటూనే ఉన్నారు. కానీ, ఇది పూర్తిగా జీర్ణ వ్యవస్థలో ఉండే గ్రహణి సమస్య అని కొన్ని దశాబ్దాల క్రితమే ఆయుర్వేదం చాలా స్పష్టంగా పేర్కొంది. ప్రత్యేకించి మెదడుకు జీర్ణ వ్యవస్థ లోని గ్రహణి లేదా రెండవ మెదడుకు మధ్య సమన్వయం దెబ్బ తినడమే కారణమని అని ఎంతో లోతుగా వివరించింది కూడా ఐబిఎస్ సమస్య ని అని గమనించక కడుపు ఉబ్బరం అనిపించగానే యాంటాసిడ్ మాత్రలు వేసుకుంటూ ఏళ్ల కొద్ది గడిపేస్తారు అగ్ని మాంద్యం వల్ల తలెత్తే ఈ కడుపు ఉబ్బరం సమస్య ఈ మాత్రలతో మరింత తీవ్రమవుతుంది. అల్లోపతిలో ఐబిఎస్ ఉందని తేల్చడానికి ఆరున్నరేళ్లు పడుతుంది. తేల్చిన తర్వాత అయినా అల్లోపతికి ఐబిఎస్ కు మంచి మందులు ఉన్నాయా అంటే అవి లేవు. అందుకే కడుపు ఉబ్బరం ఉన్నప్పుడే ఆయుర్వేద డాక్టర్ ను  సంప్రదిస్తే, కడుపు ఉబ్బరం సమస్య ఐబిఎస్ గా మారే అవకాశం ఉండదు ఒకవేళ అప్పటికే ఐబిఎస్ గా మారి ఉంటే ఆయుర్వేద ఔషధాలు ఆ వ్యాధిని నామరూపాలు లేకుండా చేస్తాయి.




డాక్టర్  వర్ధన్   
MD (Ayu): Ph.D: MS (C&P)
Founder & Chief Physician
ఫోన్  : 9056959595

హైదరాబాద్ బ్రాంచీలు :  బషీర్బాగ్ ,తార్నాక , బంజారాహిల్స్ 
ఏపీ బ్రాంచీలు : విజయవాడ , తిరుపతి ,కర్నూల్ , రాజమండ్రి

Comments