సర్జరీ కాదు కటివస్తి చాలు || Case Study:Kati Vasti Ayurvedic Treatment For Back Pain:Dr.Madhuri Vardhan
ఆమె డాక్టర్ పి నీరజ .సీనియర్ గైనకాలజిస్ట్. వయసు 52,డాక్టర్ గా తన విధి నిర్వహణలో వంగి పని చేయడం ఎక్కువ. ఫలితంగా రెండేళ్ల క్రితం ఆమె వెన్ను నొప్పి మొదలైంది .న్యూరాలజిస్ట్ సలహామేరకు ఎక్స్రేరే తీస్తే ఎల్ -3 , ఎల్ -4 , ఎల్ -5 ,ఎస్- 1 డిస్క్లో దెబ్బతిన్నట్లు రిపోర్ట్ వచ్చింది. ఈ స్థితిలో శస్త్రచికిత్స తప్ప మరోమార్గం లేదన్నారు.శస్త్రచికిత్స తర్వాత ఓ ఎనిమిది మాసాల దాకా కాస్త ఉపశమనం గానే అనిపించింది .ఆ తర్వాత మళ్లీ నొప్పి మొదలైంది. అందుకే రెండోసారి కూడా శస్త్ర చికిత్స చేశారు. అయినా తగ్గలేదు డాక్టర్ ను సంప్రదిస్తే మరోసారి శస్త్ర చికిత్స చేయించుకుంటే ఇక సమస్య పూర్తిగా పోతుంది అన్నారు .నిజానికి రెండవ శస్త్రచికిత్స తాలుక దుస్ప్రభావాలు ఇప్పటికీ ఇంకా పోనే లేదు. కాళ్లలో తిమ్మిర్లు రావడంతో పాటు,ఏ కాస్త నిలబడిన కాళ్లలో నొప్పి, కొంకర్లు పోవడం ,వంటివి ఇంకా వేధిస్తూనే వున్నాయి . అందుకే ఆమె శస్త్రచికిత్స సమ్మతించడం లేదు. డిస్క్ సమస్యలకు ఆయుర్వేద చికిత్స గురించి ఎవరో చెప్పగా విని మా వద్దకు వచ్చారు.
మావద్ద ఆమెకు వరుసగా నాలుగు వారాల పాటు చికిత్స కొనసాగింది. ముఖ్యంగా పంచకర్మ చికిత్స లో భాగంగా అభ్యంగం, స్వేదం, తైలమర్దన లతో పాటు ఎలికిడి చికిత్స కూడా చేశాం .ఔషధ గుణాలున్న కొన్ని రకాల ఆకులను తైలం లో ఉడికించి ఒంటికి పట్టించే ఈ విధానం ఆమె ఎక్కువ మేలు చేసింది. ఈ ఎలకిడి చికిత్స వల్ల శరీరంలోని వ్యర్థ పదార్థాలను వెలుపలికి వచ్చేస్తాయి. ఫలితంగా శరీరంలోని వాతం హరించుకుపోతుంది. ఓ 40 ఏళ్ల గడిచాక శరీర వ్యవస్థ సహజంగానే క్షీణిస్తూ వెళుతుంది. ఈ స్థితిలో శరీరంలో వాతప్రకోపం ఎక్కువగా ఉంటుంది. ఇది వెన్ను నొప్పితో పాటు పలురకాల సమస్యలకు కారణమవుతూ ఉంటుంది. అందుకే ఔషధ తాయిలాలతో వాతాన్ని తొలగించడం పట్ల ఆయుర్వేదం పట్ల ఎక్కువగా శ్రద్ధ వహిస్తుంది.వెన్ను నొప్పి ఉన్నవారికి వాతం తగ్గడం అంటే నొప్పి తగ్గడమే చికిత్సలో భాగంగా విరోచనం ,నస్యం , వస్తి చికిత్సలు కూడా చేశాం. ముఖ్యంగా యోగ వస్తితో పాటు కటివస్తి చికిత్స కూడా చేశాం. కటివస్తి తో బిగుసుకుపోయిన వెన్ను భాగం అ సాధారణ స్థితికి వచ్చేస్తుంది. నరాల పైన ఒత్తిడి తగ్గడంతోపాటు, ఎండిపోయిన భాగాల్లో తేమ నింపడంలో నరాల వ్యవస్థ లో పూర్వ శక్తిని తేవడంలో వస్తీకరణ చికిత్సలు బాగా తోడ్పడతాయి. వెన్నెముకకు ఇరువైపులా ఉండే కండరాలలో శక్తి నింపడం డిస్కులు నరాలమీద ఒత్తిడిని తగ్గించడం ఇవన్నీ చికిత్సలో భాగాలే. ఈ చికిత్సలన్నీ ఆమెకు చేశాం. ఆ తర్వాత నాలుగు నెలలకు సరిపడే మందులు ఇచ్చి పంపించాం .మందులన్నీ అయిపోయాక అంటే ఐదవ నెలలో వాళ్ళు మా దగ్గరకు వచ్చారు. వెన్నుకు సంబంధించిన తన బాధలన్నీ తొలగిపోయాయని తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడామె డాక్టర్ గా ముందులాగే పూర్తిస్థాయిలో తన వృత్తిని చేసుకోగలుగుతున్నాం అని చెప్పారు. సర్జరీల అవసరాన్ని తప్పించే ఇలాంటి ఎన్నో ఉదంతాలు ఆయుర్వేద చికిత్సలు కనబడతాయి .
ఆమె పేరు ఎన్ వసంత .వయసు 33 .పెళ్లయి పదేళ్లు అయినా ఇంకా సంతానం కాలేదు. చాలా రోజులుగా పొత్తికడుపులో నొప్పితో పాటు వెన్ను నొప్పి కూడా ఉంది .అయితే ఎంత సేపూ వాళ్ళు గర్భం రావడం లేదని ఆలోచిస్తున్నారు. అందుకు అవసరమైన రకరకాల పరీక్షలు చేయిస్తున్నారు. కానీ ,వెన్నునొప్పి పైకి వారి దృష్టికి రావడం లేదు. ఆమె మా వద్దకు వచ్చినప్పుడు వెన్ను సంబంధమైన సమస్య ఉందేమో అని ఎన్ ఎల్ ఆర్ పరీక్ష చేశాం .అందులో ఆమెకు డిస్క్ సమస్య ఉన్నట్లు తేలింది .డిస్కు సమస్యలు ఉన్నప్పుడు గర్భం వస్తే వెన్ను భాగం ఎంతగా దెబ్బ తింటుందో సవివరం గా చెప్పాక వారు వెన్ను చికిత్స తీసుకోవాలని నిర్ధారించుకున్నారు.
యుక్త వయసులోనే వెన్ను నొప్పి ఉన్న వారిలో చాలా మంది ఆ విషయాన్ని బయటకు చెప్పరు. ఈలోగా పెళ్లయి , గర్భం వస్తే అది వెన్ను కు సంబంధించి కొన్ని దీర్ఘకాలిక సమస్యలకు బీజం పడుతుంది .
వాస్తవానికి డిస్క్ సమస్య ఉన్నప్పుడు గర్భం దాల్చడం ఏ మాత్రం శ్రేయస్కరం కాదు. ఈ స్థితిలో గర్భం వస్తే వెన్ను భాగాల్లోని కండరాల మీద ఒత్తిడి పెరిగి సమస్య మరింత జటిలమవుతుంది. అందుకే ఆమెకు మొట్టమొదట కటివస్తి అనే చికిత్స చేశాం. కొన్ని ఆయుర్వేదం అంశాల ముద్దను వెన్ను భాగంలో ఉంచి వెన్ను మధ్యలో ఆయుర్వేద తైలం పోయడం ఈ కటివస్తి చికిత్స విశేషం. ఈ చికిత్సల ఉబ్బి బయటకు వచ్చిన డిస్కు తిరిగి యథాస్థానానికి వచ్చేసింది. నిజానికి చికిత్స లేకుండానే వత్తిడిని తగ్గించి డిస్కులను పూర్వస్థితికి చేయగలిగే ఒక విశేష చికిత్స కటివస్తి .ఆయుర్వేదంలో నీ ఈ చికిత్సా విశేషాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా గుర్తించింది .తర్వాత ఆమెకు సర్వాంగ ధార చికిత్స కూడా చేశాం.
ఈ చికిత్సశరీరంలోని బిగుసుకుపోయిన కండరాలు అన్నీ వదులవుతాయి. కండరాలు తిరిగి శక్తివంతం కావడంతోపాటు శరీరంలోని వ్యర్థ పదార్థాలను తొలగిపోతాయి. కటివస్తి, సర్వాంగ ధార చికిత్సలతో ఆమె వెన్ను సమస్యలు తొలిగిపోయింది .ఆ వెంటనే సంతానం కలిగించే ఆయుర్వేద చికిత్సలు కూడా ప్రారంభించాం. వెన్ను సమస్యల నుంచి విముక్తి పొందడం ద్వారా గర్భధారణ తర్వాత మళ్లీ కండరాల సమస్యలు, డిస్క్ సమస్యలు తలెత్తే పరిస్థితి రాదు. గర్భానికి ముందు వెన్ను సమస్యలను నిర్లక్ష్యం చేసిన వారు జీవితకాలమంతా వెన్నునొప్పితో బాధపడడం మనకు కనిపిస్తుంది. ఈ చికిత్స తీసుకున్న వసంత కు ఇప్పుడు ఆ దిగులే లేదు.
డాక్టర్ మాధురి వర్ధన్
MD (Ayu) (Gynecologist & Infertility Specialist)
ఫోన్ : 9056959595
హైదరాబాద్ బ్రాంచీలు : బషీర్బాగ్ ,తార్నాక , బంజారాహిల్స్
ఏపీ బ్రాంచీలు : విజయవాడ , తిరుపతి ,కర్నూల్ , రాజమండ్రి
Comments
Post a Comment