వినయ్ కొంతకాలంగా దిగులుగానే ఉంటున్నాడు . ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న భావన .చాలా సార్లు కళ్ళ వెంట నీళ్ళు వస్తున్నాయి . దేని మీద మనసు లగ్నం కాదు. ఒక్కోసారి విపరీతంగా కోపం వచ్చేస్తోంది .నిద్రా ఆకలి తగ్గి పోయాయి. ఇంటి సమస్యలు, ఆఫీస్ పని ఒత్తిళ్లు అంత తీవ్రంగానే ఉన్నాయి. మరి ! వీటికి తోడు, కొంతకాలంగా వెన్నునొప్పి, సయాటికా సమస్యలు కూడా వేదిస్తున్నాయి .ఒకటే నొప్పి, మంట.ఈ స్థితికి ఎంత సేపు తన జీవిత సమస్యలే కారణం అనుకుంటున్నాడే గానీ , తనకున్న వెన్ను నొప్పి ,సయాటికా సమస్యలే తన దిగులూ, అందోళనకు, డిప్రెషన్ కు కారణమని గ్రహించలేకపోయాడు.
వెన్నునొప్పి ,సయాటికా సమస్యలు మానసికంగా కుంగదీసి డిప్రెషన్ కు దారి తీయడం లో ముందుంటాయి .వెన్ను నొప్పి, సయాటికా సమస్యలు మొత్తం నాడీ వ్యవస్థ తో ముడిపడి ఉండడమే ఇందుకు కారణం. శరీరంలోని కండరాలు,లిగమెంట్లు, వీటన్నిటిలో ఎక్కడ సమస్య ఉన్నా అది నిరంతరం ఒక ఒత్తిడికి గురి చేస్తూ ఉంటుంది .బాగా పెరిగినప్పుడు కొన్ని అడ్రినలిన్ , నార్ అడ్రినలిన్ అనే కొన్ని హార్మోన్లు విడుదలై రక్తంలోకి వెళ్తాయి.ఈ హార్మోన్లన్నీ విషతుల్యమైనవి కావడం వల్ల శరీరం ఎన్నో దుష్ప్రభావాలకు లోనవుతుంది . ప్రధానంగా నాడీ వ్యవస్థ బాగా దెబ్బతింటుంది. మొత్తంగా చూస్తే జీవక్రియలన్ని కుంటుపడతాయి.
మెదడులో ఏమవుతుంది ?
శరీరంలో ఎక్కడైనా నొప్పి మొదలైనప్పుడు సహజంగానే దాని సంకేతాలు మెదడుకు వెళతాయి . అందుకు ప్రతిస్పందనగా మెదడులోంచి కొన్ని రసాయనాలు విడుదలవుతాయి. అయితే వెంటనే వైద్య చికిత్సలు మొదలై లభిస్తే సరి. అలా కాకుండా,ఆ నొప్పి దీర్ఘకాలంగా కొనసాగుతూ వెళితే నిరంతరంగా విడుదలయ్యే రసాయనాలు మెదడు కణాలనే దెబ్బతీస్తాయి. ఈ సమస్య ఇలాగే కొనసాగితే ,సుమారు 11 శాతం మెదడు కుంచించుకుపోతుందని ఇటీవలే బ్రిటన్ పరిశోధకులు కనుగొన్నారు .ఒకసారి మెదడు ఇలా కుచించుకుపోయింది అంటే నాడీ ,హార్మోన్, మానసికమైన ఎన్నో సమస్యలు మొదలవుతాయి. శరీరం, బుద్ధి, మనసు ఈ మూడింటి మధ్య అవినాభావ సంబంధం ఉంది .అందుకే ఈ మూడింటిలో ఏ ఒక్కటి వ్యాధిగ్రస్తమైన అనుబంధం బలహీన పడుతుంది. అంతటితో పలురకాల వ్యాధులకు బీజం పడుతుంది.
మూలాలు తొలగాలి ....
ఏ వ్యాధి అయినా మొత్తం ప్రతికూల పరిస్థితిని తెలిపే ఒక లక్షణం మాత్రమే. ఆ ఒక్క లక్షణంతోనే ఏది ఆగిపోదు .అందుకే ఒక వ్యాధి వచ్చింది. అంటే మరెన్నో వ్యాధులు రావడానికి అనువైన వాతావరణం శరీరంలో ఉందని అర్థం .వెన్ను నొప్పి ఉందని కేవలం వెన్నునొప్పికి మాత్రమే చికిత్స తీసుకోని ఆగిపోతే ఏమవుతుంది ? వెన్నునొప్పి తగ్గినట్టునిపిస్తుంది. ఆ వెనువెంటనే కొత్తగా మరేదో వ్యాధి మొదలవుతుంది.
అందుకే వెన్నునొప్పి, కారణమైన ఆ మూల సమస్య మరెన్నో వ్యాధులకు దారితీస్తుంది. అల్లోపతిలో అయితే ,ఒక్క వ్యాధికి ఒక్కో చికిత్స వేరు వేరుగా తీసుకోవలసి వస్తుంది .ఆయుర్వేదం లో ఆ అవసరం లేదు. అన్ని వ్యాధులకు మూలం గా ఉండే వాత పిత్త కఫ గుణదోషాలను చక్కదిద్దడం ద్వారా ఆయుర్వేదం ఆ తర్వాత రాబోయే వ్యాధులన్నిటికి అడ్డుకట్ట వేస్తుంది . అయితే ఈ వాత, పిత్త, కఫాలు వాటిలో వచ్చే తేడాలేవి ఎక్స్రేరే ,ఎంఆర్ఐ లేదా మరే స్కానింగ్ లోను కనిపించదు. కనిపించని ఆ సమస్యలను వదిలేయడం వల్లే అల్లోపతిలో వ్యాధిని సమూలంగా తొలగించడం సాధ్యం కావడం లేదు. ఆయుర్వేదంలోనే అది సాధ్యమవుతుంది . మరి కొంతమందికి ఎంఅర్ఐ లో ఏ తేడాలు కనిపించవు.కానీ, ఆ వ్యక్తి విపరీతమైన బాధకు గురవుతున్నాడు. అందువల్ల ఎంఆర్ఐ లో పెద్ద తేడాలు ఏమీ లేవని చికిత్స చేయకపోతే ,అది ఏదో ఒక దశలో తీవ్రమైన సమస్యగా బయటపడవచ్చు. అందువల్ల ఎంఆర్ ఐ పరీక్ష సర్వ సమగ్రంగా భావించకుండా రోగి లక్షణాల ఆధారంగా చికిత్స చేసి, వ్యాధి మూలాలను తొలగించే చికిత్సలు కూడా చేస్తే సమస్య శాశ్వతంగా తొలగిపోతుంది. ఈ సమస్యలన్నింటికీ వాతమే ప్రధాన కారణం. వాయు రూపంలో ఉండే వాతం స్కానింగ్ లలో కనిపించదు. అలాంటప్పుడు ,వాటినే నమ్ముకున్న వారు చికిత్స చేయరు. అయితే అది ఏదో ఒక దశలో బాగా తీవ్రమైన కదలలేని పరిస్థితి ఏర్పడుతుంది.
రెండు అంచులు:
దీర్ఘకాలికమైన వెన్నునొప్పి డిప్రెషన్ కు దారి తీసే విధంగానే, దీర్ఘకాలికంగా ఉండే డిప్రెషన్ కూడా వెన్ను నొప్పికి దారి తీసే ప్రమాదం ఉంది. డిప్రెషన్ లో ప్రధానంగా హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. కాబట్టి, ఇది కండరాలు ,లిగ్మెంట్లను , టెండాన్లను ,డిస్కులను, నాడీ వ్యవస్థను, దెబ్బ తీస్తువెళుతుంది. ఏదో ఒక దశలో అది వెన్నునొప్పికి కూడా దారి తీయవచ్చు. అయితే, ముందే గుర్తించి ఆయుర్వేద చికిత్సలు తీసుకుంటే, ఒకేసారి డిప్రెషన్, వెన్నునొప్పి రెండు తగ్గుతాయి . దీర్ఘకాలికంగా డిప్రెషన్ లో ఉన్నవారు ఒకసారి వెన్నునొప్పి పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం .ఎందువల్ల అంటే కొందరికి వెన్నులో తేడాలు వచ్చిన వారిలో దానికి సంబంధించిన నొప్పిగానీ ,ఇతర లక్షణాలు కాని ,కనిపించకపోవచ్చు. అలాగే వెన్ను నొప్పి మొదలైన వారు కూడా వెంటనే చికిత్సలు తీసుకోవడం చాలా అవసరం. వెన్నునొప్పి నాడీ వ్యవస్థ కు సంబంధించినది కావడం వల్ల ఎప్పుడో ఒకప్పుడు డిప్రెషన్ కు దారి తీయవచ్చు.
సత్యవజయ చికిత్స ...
మొత్తంగా శరీరంలో 107 మర్మ కేంద్రాలు ఉంటాయి. కేవలం వెన్నెముకలోని 14 నుంచి 16 దాకా ఉంటాయి. మర్మ చికిత్స లో ఈ మర్మ కేంద్రాలన్నీ ఉత్తేజితం అవుతాయి. దీనివల్ల శరీరంలో పేరుకుపోయిన విష పదార్ధాలన్నీ బయటకు వెళతాయి . దీనికితోడు వెన్నుముక సమస్యలను తొలగించే మేరు చికిత్స కూడా ఉంటుంది .వీటితో హార్మోన్ల వ్యవస్థ కూడా చైతన్యవంతం కావడంతో వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది.హార్మోన్ వ్యవస్థ కూడా బలోపేతం అవుతుంది. ఫలితంగా శరీరం, బుద్ధి, మనసు తమ సహజ శక్తిని పుంజుకుంటాయి. ఫలితంగా శారీరక మానసిక ఒత్తిళ్లన్నీ తొలగిపోతాయి. ఆలోచనా పరిధి పెరుగుతుంది. మానసిక శక్తి బలోపేతం అవుతుంది .వెన్నునొప్పి,సయాటికాల కారణంగా డిప్రెషన్ కు గురైన వారికి మర్మ చికిత్సలతో పాటు,మేరు చికిత్స పాటు ,సత్వావజయ చికిత్స కూడా ఉంటుంది. శరీరంలోని జవజీవాలను పెంచడంలో ఇది ఇది అద్భుతంగా పని చేస్తుంది .అందుకే ఈ చికిత్సలు వెన్నునొప్పి, సయాటికా సమస్యలతో పాటు డిప్రెషన్ కూడా తగ్గించగలుగుతున్నాయి. శరీరానికి, మెదడుకు ఉన్న అనుబంధాన్ని సరియైనా రీతిలో నిలబెట్టడమే ఆయుర్వేద చికిత్సల ప్రత్యేకత .అందుకే శారీరక మానసిక సమస్యలను సంయుక్తం గా నయం చేయడంలో ఆయుర్వేదం అత్యున్నత స్థాయిలో ఉంది.
MD (Ayu): Ph.D: MS (C&P)
Founder & Chief Physician
ఫోన్ : 9056959595
హైదరాబాద్ బ్రాంచీలు : బషీర్బాగ్ ,తార్నాక , బంజారాహిల్స్
ఏపీ బ్రాంచీలు : విజయవాడ , తిరుపతి ,కర్నూల్ , రాజమండ్రి
Comments
Post a Comment