ఈ బాధ తగ్గేదెలా..? || పైల్స్ అంటే ఏమిటి?పైల్స్ బాధ తగ్గేది ఎలా?|What Is Piles Best Treatment For Piles || Vardhan Ayurveda



 కదలకుండా కాసేపు కుర్చీలో కూర్చోలేరు. ఓ గంట బైక్ నడపలేరు. ఉద్యోగ, వ్యాపారాల మీదికి మనసే పోదు. నొప్పి, దురదే కాదు... రక్తస్రావ సమస్య ఒకటి. పైల్స్, ఫిషర్,ఫిస్టులా, ఆబ్బిస్ సమస్య ఏదైతేనేమిటి? అన్ని నరకాన్ని తలపించే యాతనలే.ఈ సమస్యలకు శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారైనా సుఖంగా ఉన్నారా అంటే వారికి ఆ సమస్యలు మళ్లీ మళ్లీ వస్తూనే ఉన్నాయి. జీర్ణవ్యవస్థలోని లోపాలను చక్కదిద్దడం ద్వారా మాత్రమే ఈ సమస్యలను నిర్మూలించగలం అంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ ఆర్ కె వర్ధన్,డాక్టర్ మాధురీ వర్ధన్.

 కొన్ని వ్యాధులు కాస్తంత ఉపశమనం కోసం తల్లడిల్లేలా చేస్తాయి. అలాంటి వాటిలో ఫిషర్,ఫిస్టులా(భగంధరం), ఫైల్స్ (అర్మమొలలు), ఆబ్బిస్ ( చీముగడ్డ) మలద్వారం లో వచ్చే నాలుగు ప్రధాన సమస్యలు కాకపోతే, ఈ నాలుగింటిలోనూ స్వల్పమైన తేడాలతో ఒకే తరహా లక్షణాలు ఉంటాయి.ఈ నాలుగింటిలో ఒక వ్యాధిని మరో వ్యాధిగా పొరబడే ప్రమాదం ఉంది. కాకపోతే నాలుగింట్లో ఏ వ్యాధి వచ్చినా చాలామంది అర్మమొలలే అనుకుంటారు. తనకున్న సమస్య ఏమిటో నిర్ధారించగలిగేది నిపుణుడైన డాక్టర్ మాత్రమే. మలద్వారంలో వచ్చే సమస్యలన్నిటికీ, జీర్ణవ్యవస్థలోని లోపాలు, ఆ కారణంగా వచ్చే మలబద్ధకం సమస్యే ప్రధాన కారణం.ఆహారంలో పీచు పదార్థాలు తక్కువగా ఉండటం, నీరు తక్కువగా తాగడం, శరీర శ్రమ లేకపోవడం,ఇందుకు దారితీస్తాయి.స్థూలకాయం, ఎక్కువ గంటలు కదలకుండా కూర్చోవడం, గంటల పర్యంతం వాహనాలు నడపడం వంటివి కూడా ఈ సమస్యకు మూలం. గర్భం లోని శిశువు బరువు కారణంగా కూడా కొంత మంది స్త్రీలు ఈ సమస్యలను ఎదుర్కొంటారు.పెద్ద వ్యవధి లేకుండా వెంట వెంట ప్రసవాలు జరిగినప్పుడు కూడా ఈ సమస్య రావచ్చు.

 ఎలా తెలుస్తుంది?

మలద్వారం లో వచ్చే నాలుగు వ్యాధుల్లో నొప్పి,రక్తస్రావం, చీము -జిగురు పడటం, దురద ఇదే ప్రధానంగా కనిపించినా మరికొన్ని ఉపలక్షణాలు కూడా కనిపిస్తాయి. వాటిలో జీర్ణక్రియ, విసర్జన క్రియ సరిగా లేకపోవడం. ఈ కారణంగా ఆహారం మీద ఆసక్తి లేకపోవడం, కడుపు ఉబ్బరం, అతిగా దాహం వేయడం, నోటి నుంచి మలద్వారం దాకా మంటగా ఉండడం,కడుపులో శబ్దాలు రావడం, బరువు తగ్గడం, తేన్పులు రావడం, లివర్ మీద ఒత్తిడి బాగా పెరిగినప్పుడు కళ్ళచుట్టూ వాపులు రావడం, రక్తహీనత ఏర్పడటం,దగ్గు,శ్వాస సమస్యలు, శరీరం శక్తిహీనం కావడం, కళ్లు తిరిగినట్లు అనిపించడం, వంటి లక్షణాలు కనిపిస్తాయి.

ఫైల్స్ (ఆర్మమొలలు)

మలద్వారం వద్ద ఉండే సూక్ష్మరక్తనాళాలు ఉబ్బడం ద్వారా ఆర్మమొలల (ఫైల్స్)  సమస్య మొదలవుతుంది. దీనికి కాలేయం మీద ఒత్తిడి పెరగడం ఒక ప్రధాన కారణం. అతిగా మద్యపానం చెయ్యడం, పొగతాగడం, మాంసాహారం, కొవ్వు పదార్థం ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వంటి అలవాట్లతో కాలేయం మీద ఒత్తిడి పెరిగి అది సూక్ష్మ రక్తనాళాల్లో వాపు ఏర్పడేలా చేస్తుంది. ఆ వాపు ప్రభావంతో ఆ భాగంలో మొలల్లా బయటికి రావడాన్నే ఫైల్స్ అంటాం.ఆర్మమొలలు నాలుగు దశల్లో ఉంటాయి. మొదటి దశలో కాస్త రక్తస్రావం అవుతుంది. అంతేగాని మొలలు బయటికేమి రావు. రెండవ దశలో మొలలు బయటకు పొడుచుకు వస్తాయి. కానీ,మళ్లీ వాటంతట అవే మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాయి. మూడవ దశలో మొలలు బయటికీ వచ్చినప్పుడు వాటంతట అవే కాకుండా లోపలికి నెడితేనే వెళతాయి. కాకపోతే నెట్టడం వల్ల తాత్కాలికంగానే లోపలి ఉండిపోయి మళ్లీ బయటకు వచ్చేస్తాయి. ఇక నాలుగవ దశలో బయటకు వచ్చిన మొలలు నెట్టినా లోపలికి వెళ్లకుండా బయటే ఉండిపోతాయి. ఈ దశలో విసర్జన మరీ కష్టమవుతుంది.వెళ్లిన ప్రతిసారీ రక్తస్రావం అవుతూ ఉంటుంది.క్షారసూత్రాన్ని  ఆ మొలలకు బిగించడం ద్వారా దానికి రక్త ప్రసరణ ఆగిపోయి ఆ తరువాత రాలిపోతుంది. రాలిపోయే క్రమంలో సూత్రానికి ఉండే క్షారలు ఆ గాయాన్ని  మాన్పేస్తాయి.అలాకాకుండా శస్త్రచికిత్స తో మొలను కత్తిరించి వదిలేస్తే ఆ గాయం అలానే ఉంటుంది. గాయం మానడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది. ఆలస్యంగానే మానిన ఆ సమస్య మళ్లీ రావచ్చు. ఆయుర్వేదంలో మొలలు రాలిపోవడం, మానిపోవడం ఏకకాలంలో జరిగిపోతాయి.
                                                     
ఫిస్టులా

 మలద్వారం లో  ఒక చీముగడ్డ తయారు కావడాన్ని ఫిస్టులా అంటారు. చాలా రోజుల దాకా కొందరు ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తారు. నొప్పి మరీ ఎక్కువనిపిస్తే యాంటీబయాటిక్ మాత్రలు వేసుకుంటారు. మూడు నాలుగు రోజులకు నొప్పి తగ్గినట్లు అనిపిస్తుంది. కానీ మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటుంది. ఇలా పదే పదే రావడంతో అందులో ఉండే చీము లో లోపలికి చొచ్చుకు పోతుంది. అలా వెళుతూ ఒక దశలో పిరుదు లో ఏదో ఒక చోట రంధ్రం చేసుకుని బయటకు వచ్చేస్తుంది. అలా చీముతో పాటు రక్తం కూడా బయటకి వచ్చేస్తుంది.
                                                 
క్షార సూత్రం


క్షార సంబంధ ఔషధాలు పూసిన ఒక ప్రత్యేక దారం ద్వారా చికిత్స జరుగుతుంది. ఫిస్టులా కారణంగా తయారైన చీము నిరంతరం వెళ్ళే దారి ట్యూబ్ లా తయారవుతుంది. ఇందులో ఇన్ఫెక్షన్ల తీవ్రత పెరుగుతుంది. తొందరగా మానదు. దాని చుట్టూ ఒక ఫైబ్రస్ టిష్యూ ఏర్పడటమే ఇందుకు కారణం. ఒకసారి  ఫైబర్ టిష్యూ ఏర్పడిందీ అంటే దానికదిగా మానడం కష్టం. శస్త్ర చికిత్సలో వచ్చే సమస్య కూడా ఇదే, శరీరం మీద కోత పెట్టినప్పుడు మరో ఫైబ్రస్ టిష్యూ ఏర్పడుతుంది. గాయం సరిగా మానకపోవడానికి ఇధో కారణం. అందుకే శస్త్రచికిత్స చేయించుకున్నా ఈ సమస్య మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటుంది.శస్త్ర చికిత్స కారణంగా మలద్వారం వద్ద ఉండే స్పింటర్ దెబ్బతింటుంది. ఫలితంగా ఆ వ్యక్తికి విసర్జన కు సంబంధించిన స్పృహ ఉండదు. క్షార సూత్ర విధానం ఇందుకు పూర్తిగా భిన్నమైనది. క్షారసూత్రం  తో ఫైబ్రస్ టిష్యూను పూర్తిగా తీసివేయగలుగుతాం.ఈ తీసివేసే క్రమంలోనే అది మానిపోతుంది కూడా.
                                               
ఫిషర్

మలద్వారం లో పగులు రావడాన్ని ఫిషర్ అంటారు. తీవ్రమైన మలబద్దకమే దీనికి ప్రధాన కారణం. విసర్జన సమయంలో బలంగా ముక్కడం ఈ స్థితిని తెచ్చిపెడుతుంది. తరచూ విరేచనాలు కావడం వల్ల కూడా కొందరికి ఈ సమస్య రావచ్చు. సరియైన వైద్య చికిత్సలు వెంటనే అందకపోతే రోజురోజుకు ఆ పగులు పెద్దదవుతుంది. అలా వచ్చే బాధ కత్తిరిస్తున్నప్పుడు కలిగే బాధ ఉంటుంది. అందుకే ఫిషర్ ను ఆయుర్వేదంలో పరిక త్తిక అంటారు. ఈ సమస్య చికిత్స లో విసర్జన క్రియ సవ్యంగా జరిగేలా చూసుకుంటూ ఆ భాగంలో కొన్ని ఔషధాలు కూడా వినియోగిస్తాం. మలద్వారం లో ఉండే స్పింటర్ సక్రమంగా పని చేయించే ప్రక్రియలు కూడా ఉంటాయి.
                                           
 ఆబ్బిస్


 మలద్వారం లో చీము గడ్డలు ఏర్పడతాయి. వీటిని కొందరు యాంటీబయాటిక్ మాత్రలు వేసుకుంటూ చాలా కాలం దాకా అలాగే గడుపుతారు. ఈ మాత్రలతో తగ్గినట్లే తగ్గి మళ్లీ మళ్లీ వస్తుంది. ఇక్కడ తయారయ్యే చీము లోలోపలికి వెళ్ళి ఫిస్టులా కు దారి తీస్తుంది.ముందే ఆ గడ్డలోని చీము నీ తీసివేస్తే వెంటనే మానిపోతుంది. ఆ ప్రయత్నమేధీ చేయకుండా చీము లోపలికి కాలువలా వెళ్లి ఫిస్టులాగా మారుతుంది. ముందు ఆ చీము తీసివేసి, ఆ గాయం మానడానికి కొన్ని ఔషధాలు వాడాలి. ఈ సమస్యకు కూడా క్షారసూత్రమే సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ సమస్యలన్నిటికీ మూలమైన జీర్ణ వ్యవస్థ లోపాలను సరిదిద్దేందుకు ప్రాధాన్యతనిస్తాం. అందులో భాగంగానే అంతరాగ్ని చికిత్స. జీర్ణ వ్యవస్థ సరిగా పనిచేయనప్పుడు ఆమం అనే ఒక విష పదార్ధం శరీరంలో తయారవుతుంది. ఆమం తయారు కాకుండా నిరోధించడానికి దీపన,పాచన ఔషధాలను ఇస్తాం. దీపనం జీర్ణక్రియ కు ఉత్తేజితం చేస్తే, పాచనం, విష పదార్థాలు బయటికి వెళ్లేలా చేస్తుంది.  వీటితోపాటే వ్యాధి నుంచి పూర్తి ఉపశమనం లభించేలా శమన చికిత్సలు కూడా చేస్తాం.



డాక్టర్  మాధురి  వర్ధన్ 
MD (Ayu) (Gynecologist & Infertility Specialist)
ఫోన్  : 9056959595

హైదరాబాద్ బ్రాంచీలు :  బషీర్బాగ్ ,తార్నాక , బంజారాహిల్స్
ఏపీ బ్రాంచీలు : విజయవాడ , తిరుపతి ,కర్నూల్ , రాజమండ్రి 

Comments